MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Rishabh Pant : వైట్ బాల్ క్రికెట్‌కు రిషబ్ పంత్ గుడ్ బై? అసలు ఏం జరుగుతోంది?

Rishabh Pant : వైట్ బాల్ క్రికెట్‌కు రిషబ్ పంత్ గుడ్ బై? అసలు ఏం జరుగుతోంది?

Rishabh Pant : ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన రిషబ్ పంత్, పేలవ ఫామ్ కారణంగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చోటు కోల్పోయాడు. రాబోయే ఐపీఎల్ 2026 అతనికి జీవన్మరణ సమస్యగా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 17 2026, 07:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అత్యధిక ధర పలికిన ఆటగాడికి గడ్డు కాలం : పంత్ కెరీర్ ప్రమాదంలో ఉందా?
Image Credit : ANI

అత్యధిక ధర పలికిన ఆటగాడికి గడ్డు కాలం : పంత్ కెరీర్ ప్రమాదంలో ఉందా?

భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 27 కోట్ల రూపాయల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అతన్ని కొనుగోలు చేసినప్పటికీ, ఆ ఆశించిన స్థాయి ప్రదర్శన పంత్ నుండి రావడం లేదు. గత రెండు సీజన్లుగా పంత్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ లో పంత్ తన స్థానాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది.

దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంత్‌ను సెలక్టర్లు కేవలం రెడ్ బాల్ (టెస్టులు) ప్లేయర్‌గా మాత్రమే చూస్తున్నారని, వైట్ బాల్ జట్టులో అతనికి అవకాశాలు దాదాపు మూసుకుపోయాయని అన్నారు. దీంతో ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పంత్ హాట్ టాపిక్ గా మారాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
27 కోట్ల భారం.. కెప్టెన్సీ ఒత్తిడి : ఐపీఎల్ 2025లో పంత్ ఘోర వైఫల్యం
Image Credit : Getty

27 కోట్ల భారం.. కెప్టెన్సీ ఒత్తిడి : ఐపీఎల్ 2025లో పంత్ ఘోర వైఫల్యం

ఐపీఎల్ 2025 సీజన్ రిషబ్ పంత్‌కు ఒక పీడకలలా మిగిలిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పంత్, బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 25 కంటే తక్కువగా ఉండటం గమనార్హం.

టోర్నీ చివరలో ఒక సెంచరీ సాధించినప్పటికీ, అది కేవలం పరువు నిలబెట్టుకోవడానికి తప్ప జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. భారీ ధర పలకడం, కెప్టెన్సీ బాధ్యతలు పంత్ సహజసిద్ధమైన దూకుడును దెబ్బతీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పేలవ ప్రదర్శన కారణంగానే 2024 నుండి అతను భారత పరిమిత ఓవర్ల జట్టుకు దూరమయ్యాడు.

Related Articles

Related image1
IPL 2026 : ఆర్‌సీబీ అభిమానులకు గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ !
Related image2
SRH Captain IPL 2026 : ప్యాట్ కమిన్స్ దూరం.. సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌ ఎవరో తెలుసా?
35
బద్రీనాథ్ షాకింగ్ కామెంట్స్ : పంత్ కేవలం టెస్ట్ ప్లేయర్ మాత్రమే
Image Credit : X/@NitinthisSide_

బద్రీనాథ్ షాకింగ్ కామెంట్స్ : పంత్ కేవలం టెస్ట్ ప్లేయర్ మాత్రమే

మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పంత్ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. "రిషబ్ పంత్‌పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. రెండు ఏళ్ల క్రితం వేలంలో అతను అత్యంత ఖరీదైన ఆటగాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, భారత వైట్ బాల్ సెటప్‌లో అతను తన ప్రాధాన్యం కోల్పోయాడనేది స్పష్టంగా కనిపిస్తోంది. సెలక్టర్లు అతన్ని కేవలం రెడ్ బాల్ ప్లేయర్‌గా మాత్రమే పరిగణిస్తున్నారు" అని బద్రీనాథ్ పేర్కొన్నారు. ఐపీఎల్ 2026 సీజన్ పంత్‌కు చివరి అవకాశమని, ఇందులో రాణిస్తేనే వైట్ బాల్ క్రికెట్‌లో రీఎంట్రీ సాధ్యమవుతుందని ఆయన హెచ్చరించారు.

45
ఎల్‌ఎస్‌జీ జట్టు పరిస్థితి ఏంటి? పంత్ నడిపిస్తాడా?
Image Credit : Getty

ఎల్‌ఎస్‌జీ జట్టు పరిస్థితి ఏంటి? పంత్ నడిపిస్తాడా?

లక్నో సూపర్ జెయింట్స్ గత సీజన్‌లో ఏడవ స్థానంతో సరిపెట్టుకుంది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 విజయాలు మాత్రమే నమోదు చేసింది. జట్టులో ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్ వంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లు ఉన్నప్పటికీ, దేశీయ ఆటగాళ్ల వైఫల్యం జట్టును దెబ్బతీసింది.

రాబోయే సీజన్ కోసం పంత్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన టీ20 కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు భారత దిగ్గజం యువరాజ్ సింగ్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో యువరాజ్ పంత్‌కు నైపుణ్యాలు నేర్పిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లను ఎదుర్కోవడానికి పంత్ తన బ్యాటింగ్ శైలిలో మార్పులు చేసుకుంటున్నాడు.

55
ఐపీఎల్ 2026 పంత్‌కు అగ్నిపరీక్ష
Image Credit : Instgram/rishabpant

ఐపీఎల్ 2026 పంత్‌కు అగ్నిపరీక్ష

రిషబ్ పంత్ ఒకప్పుడు టీమ్ ఇండియా ఎక్స్-ఫ్యాక్టర్‌గా గుర్తింపు పొందాడు. అయితే ప్రస్తుత పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. యువరాజ్ సింగ్ శిక్షణలో పంత్ మళ్ళీ పాత ఫామ్‌ను అందుకుంటాడా? లేదా బద్రీనాథ్ అన్నట్లుగా కేవలం టెస్టులకే పరిమితమవుతాడా? అన్నది ఐపీఎల్ 2026 తేల్చనుంది. గిల్, అభిషేక్ శర్మ వంటి యువకులను తీర్చిదిద్దిన యువరాజ్, పంత్ కెరీర్‌లో కూడా మ్యాజిక్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఈ సీజన్‌లో పంత్ విఫలమైతే, 2027 వన్డే ప్రపంచకప్ రేసు నుండి అతను తప్పుకోవాల్సి రావచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారత దేశం
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
IPL 2026 : ఆర్‌సీబీ అభిమానులకు గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ !
Recommended image2
SRH Captain IPL 2026 : ప్యాట్ కమిన్స్ దూరం.. సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved