- Home
- Sports
- Cricket
- Rinku Singh: ఆసియా కప్ లో ఒకే బంతి ఆడి హీరోగా మారిన రింకూ సింగ్.. రాసిపెట్టుకుని మరి కొట్టాడు !
Rinku Singh: ఆసియా కప్ లో ఒకే బంతి ఆడి హీరోగా మారిన రింకూ సింగ్.. రాసిపెట్టుకుని మరి కొట్టాడు !
India vs Pakistan Final : ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. రింకూ సింగ్ ఈ టోర్నీలో కేవలం బంతి ఆడి హీరో అయ్యాడు. రాసిపెట్టుకుని మరి విన్నింగ్ పరుగులు కొట్టాడు.

పాకిస్తాన్ పై భారత్ ఉత్కంఠ విజయం
ఆసియా కప్ 2025 ఫైనల్ లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉత్కంఠను రేపుతూ సాగింది. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి ఛాంపియన్ గా నిలిచింది. పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి 147 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించింది. అయితే టీమిండియా ప్రారంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయినప్పటికీ తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌కు గెలుపును ఖాయం చేశాడు. చివర్లో ఒక్క బంతి ఆడిన రింకూ సింగ్ ఆసియా కప్ లో భారత్ కు హీరోగా మారాడు.
Lord Rinku Singh ने पूरे टूर्नामेंट में सिर्फ एक बॉल खेली,
और एक ही बॉल में टूर्नामेंट खत्म कर दिया,#IndiaVsPakistanpic.twitter.com/oCciJjGZeY— ANIL (@AnilYadavmedia1) September 28, 2025
రింకూ సింగ్‌కు ఫైనల్లో ఛాన్స్
రింకూ సింగ్ ఈ ఆసియా కప్‌లో ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే ఛాన్స్ రాలేదు. కానీ హార్దిక్ పాండ్యా గాయపడటంతో ఫైనల్‌లో అతనికి అవకాశం లభించింది. పాకిస్తాన్ తక్కువ స్కోర్ పెట్టడంతో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశమే రాదని అనుకున్నారు. కానీ మ్యాచ్ చివరి క్షణాల్లో పరిస్థితులు మారాయి. భారత్ గెలవడానికి ఒక రన్ మాత్రమే అవసరం కాగా, రింకూ క్రీజ్‌లోకి వచ్చాడు. ఫోర్ తో భారత్ కు గెలుపు ఖాయం చేశాడు. ఈ టోర్నీలో రింకూ సింగ్ కు తొలి మ్యాచ్.. ఆడిన తొలి బంతిని ఫోర్ కొట్టి భారత్ కు విజయాన్ని అందించి హీరోగా నిలిచాడు.
Rinku singh out of nowhere , hitting the winning runs. God’s plan
pic.twitter.com/FTyJ4fnoQ7— Bihar_se_hai (@Bihar_se_hai) September 28, 2025
తిలక్ వర్మ అసలైన హీరోగా నిలిచాడు
పాకిస్తాన్ బౌలర్లు మొదటి నాలుగు ఓవర్లలోనే గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ సమయంలో తిలక్ వర్మ నిలబడి సమయోచితమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను 53 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టు గెలుపు వైపు నడిపించాడు. ఇది పాకిస్తాన్‌పై అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.
మధ్యలో కీలక భాగస్వామ్యాలు
తిలక్ వర్మకు సంజూ శాంసన్, తరువాత శివమ్ దుబే మంచి తోడ్పాటు అందించారు. సంజూతో కలిసి తిలక్ 50 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యం అందించాడు. తరువాత శివమ్ దుబేతో మరో 60 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ రెండూ మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాయి. దుబే 22 బంతుల్లో 33 పరుగులు చేసి ప్రెజర్ తగ్గించాడు.
రింకూ సింగ్ ఒక్క బంతితో గెలిపించాడు
మ్యాచ్ చివరి ఓవర్‌లో భారత్‌కు 10 పరుగులు కావాల్సి ఉంది. తిలక్ రెండో బంతిని సిక్స్ కొట్టాడు. నాలుగో బంతికి ఒక రన్ అవసరం కాగా రింకూ సింగ్ స్ట్రైక్‌కి వచ్చాడు. హారిస్ రౌఫ్ వేసిన బంతిని రింకూ బౌండరీకి పంపించి భారత్‌ను 5 వికెట్ల తేడాతో ఛాంపియన్ గా నిలిపాడు.
మ్యాచ్ తరువాత రింకూ సింగూ మాట్లాడుతూ – “నా కోసం ఆ ఒక్క బంతే ముఖ్యం. ఒక రన్ కావాలి, నేను బౌండరీ కొట్టాను. జట్టు గెలిచింది. నేను ఫినిషర్‌ని అని అందరికీ తెలుసు. ఈ క్షణం చాలా ప్రత్యేకం” అని అన్నారు.
నిజమైన రింకూ భవిష్యవాణి
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రింకూ సింగ్ సెప్టెంబర్ 6న ఒక నోట్ పై తాను విన్నింగ్ పరుగులు కొడతానని రాసుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం వెల్లడించారు. నిజంగానే ఆయన రాసినట్లు జరిగింది. చివరికి ఒక్క బంతిని ఆడి విన్నింగ్ పరుగులతో రింకూ సింగ్ ఆ మాటను నిజం చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆసియా కప్ 2025లో భారత్ 9వసారి ట్రోఫీ గెలుచుకుంది. తిలక్ వర్మ మ్యాచ్ హీరోగా నిలిచినా, రింకూ సింగ్ ఒక్క బంతితో అభిమానుల హృదయాలను గెలిచాడు.
On 6th September, Rinku Singh manifested to hit winning runs in final and Tilak Verma to score in final and win
They have walked the talk😭❤️pic.twitter.com/0E6PD66woo— S.Bhai33 (@HPstanno1) September 28, 2025

