MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL 2026 : రింకూ సింగ్ ను దెబ్బకొట్టిన షారుఖ్ కేకేఆర్ !

IPL 2026 : రింకూ సింగ్ ను దెబ్బకొట్టిన షారుఖ్ కేకేఆర్ !

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కెప్టెన్‌గా అజింక్యా రహానేను అధికారికంగా ప్రకటించింది. రింకూ సింగ్ పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, మేనేజ్మెంట్ రహానే వైపే మొగ్గు చూపింది. అసలు కేకేఆర్ ఏం ప్లాన్ చేస్తోంది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 17 2026, 10:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రింకూ సింగ్ కు బిగ్ షాక్
Image Credit : Getty

రింకూ సింగ్ కు బిగ్ షాక్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న తమ జట్టు కెప్టెన్సీ అంశంపై కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) స్పష్టతనిచ్చింది. రింకూ సింగ్ కెప్టెన్ అవుతారని అందరూ భావించారు. కానీ సీనియర్ ఆటగాడు అజింక్యా రహానేనే రాబోయే సీజన్‌లో జట్టును నడిపిస్తారని కేకేఆర్ అధికారికంగా ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రహానేపై నమ్మకం ఉంచిన కేకేఆర్ మేనేజ్మెంట్
Image Credit : X/KKRiders

రహానేపై నమ్మకం ఉంచిన కేకేఆర్ మేనేజ్మెంట్

గత సీజన్‌లోనూ అజింక్యా రహానే కేకేఆర్ జట్టుకు సారథ్యం వహించారు. అయితే, 2024లో ఛాంపియన్లుగా నిలిచిన కోల్‌కతా, 2025 సీజన్‌లో రహానే నాయకత్వంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో 7వ స్థానంతో సరిపెట్టుకుని ప్లేఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది. అయినప్పటికీ, బ్యాటర్‌గా రహానే జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేయడం ద్వారా రహానేనే తమ కెప్టెన్ అని కేకేఆర్ ధ్రువీకరించింది. అంతకుముందే రహానే తన లింక్డ్‌ఇన్ ఖాతాలో తాను జట్టును నడిపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు.

36
నిరాశలో రింకూ సింగ్ అభిమానులు
Image Credit : Getty

నిరాశలో రింకూ సింగ్ అభిమానులు

కెప్టెన్సీ రేసులో స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ పేరు కూడా వినిపించింది. మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా రింకూ సింగ్‌కే ఓటు వేశారు. యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్‌ను, అలాగే రంజీ ట్రోఫీ 2024-25లో ఉత్తరప్రదేశ్ జట్టును నడిపించిన అనుభవం రింకూకు ఉంది. కేకేఆర్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న రింకూను కెప్టెన్‌గా చేస్తారని భావించినప్పటికీ, మేనేజ్మెంట్ మాత్రం అనుభవజ్ఞుడైన రహానేకే ప్రాధాన్యం ఇచ్చింది. వేలానికి ముందే కెప్టెన్ ఎవరనేది తేల్చకుండా చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయి.

46
బలమైన కోచింగ్ బృందం.. కేకేఆర్ భారీ కొనుగోళ్లు
Image Credit : ANI

బలమైన కోచింగ్ బృందం.. కేకేఆర్ భారీ కొనుగోళ్లు

ఐపీఎల్ 2026 కోసం కేకేఆర్ తన కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు చేసింది. అభిషేక్ నాయర్‌ను హెడ్ కోచ్‌గా నియమించగా, సహాయక కోచ్‌గా షేన్ వాట్సన్ బాధ్యతలు చేపట్టారు. పవర్ కోచ్‌గా ఆండ్రీ రస్సెల్, బౌలింగ్ కోచ్‌గా టిమ్ సౌథీ వ్యవహరించనున్నారు. గత వేలంలో కేకేఆర్ రూ. 63 కోట్ల భారీ పర్సుతో బరిలోకి దిగి, కామెరూన్ గ్రీన్‌ను రూ. 25.20 కోట్లకు, మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు శ్రేయస్ అయ్యర్‌ను వదులుకుని వెంకటేష్ అయ్యర్‌ను రూ. 23.75 కోట్లకు దక్కించుకున్నా, అతను విఫలం కావడంతో ఈసారి కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది.

56
కేకేఆర్‌కు తగిలిన భారీ దెబ్బ
Image Credit : Getty

కేకేఆర్‌కు తగిలిన భారీ దెబ్బ

సీజన్ ప్రారంభానికి ముందే కేకేఆర్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా 2026 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. అతని స్థానంలో రీప్లేస్‌మెంట్‌ను తీసుకోవడానికి కేకేఆర్ ఆసక్తి చూపడం లేదు. మరోవైపు, బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ, బీసీసీఐ ఆదేశాల మేరకు అతడిని విడుదల చేయాల్సి వచ్చింది. అతని స్థానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీని జట్టులోకి తీసుకున్నారు.

66
ఐపీఎల్ 2026 కోసం కేకేఆర్ పూర్తి జట్టు
Image Credit : ANI

ఐపీఎల్ 2026 కోసం కేకేఆర్ పూర్తి జట్టు

అజింక్యా రహానే (కెప్టెన్), రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, కామెరూన్ గ్రీన్, ఫిన్ అలెన్, తేజస్వి సింగ్, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, రోవ్‌మన్ పావెల్, అనుకుల్ రాయ్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, రమణ్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా, మతీషా పతిరానా, కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, ఉమ్రాన్ మాలిక్, బ్లెస్సింగ్ ముజారబానీ.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
క్రికెట్
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mirabai Chanu: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Recommended image2
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image3
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Related Stories
Recommended image1
IPL 2026 : ఆర్‌సీబీ అభిమానులకు గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ !
Recommended image2
SRH Captain IPL 2026 : ప్యాట్ కమిన్స్ దూరం.. సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved