MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?

SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?

Suryakumar Yadav: ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ముంబై జట్టును అన్‌ఫాలో చేయడంతో పాటు పాత పోస్టులన్నీ తొలగించడంతో అతను జట్టును వీడనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అసలు ఏం జరుగుతోంది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 08 2026, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీమిండియాలో కెప్టెన్సీ పోయింది..
Image Credit : Getty

టీమిండియాలో కెప్టెన్సీ పోయింది..

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఈ మధ్య టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. 2026 టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా భారత్‌కు ట్రోఫీని అందించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 2026లో పేలవ ప్రదర్శన అతని కెరీర్‌పై ప్రభావం చూపింది. 

తాజాగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు భారత జట్టునున ఎంపిక చేసిన బీసీసీఐ.. సూర్యను జట్టు నుండి తప్పించడమే కాకుండా, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుండి కూడా తొలగించింది. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. టీమిండియాలో చోటు కోల్పోవడంతో సూర్య అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముంబై ఇండియన్స్‌తో గ్యాప్ పెరిగిందా?
Image Credit : stockPhoto

ముంబై ఇండియన్స్‌తో గ్యాప్ పెరిగిందా?

సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, సోమవారం సూర్య ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కొన్ని మార్పులు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపాయి. సూర్య తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ముంబై ఇండియన్స్ జట్టును అన్‌ఫాలో చేశాడు.

అంతేకాకుండా, గతంలో ముంబై జెర్సీతో ఉన్న ఫోటోలు, జట్టుకు సంబంధించిన పోస్టులన్నింటినీ డిలీట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉన్న ముంబై ఇండియన్స్ అనే పేరును కూడా తొలగించాడు. దీంతో సూర్యకు, ముంబై ఫ్రాంచైజీకి మధ్య ఏదో గొడవ జరిగిందని, అతను వచ్చే సీజన్ నాటికి జట్టును వీడనున్నాడని ప్రచారం జోరందుకుంది.

35
ఐపీఎల్ 2026లో పేలవ ప్రదర్శన
Image Credit : ANI

ఐపీఎల్ 2026లో పేలవ ప్రదర్శన

సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ 2026లో 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 270 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు కేవలం 20.77గా ఉంది. ముంబై జట్టు ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైంది. ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 గెలిచి, 10 ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచి టోర్నీ నుండి అవుట్ అయింది.

హార్దిక్ పాండ్యా అనారోగ్యంతో ఉన్న సమయంలో సూర్య మూడు మ్యాచ్‌లకు కెప్టెన్సీ కూడా వహించాడు. అంతటి కీలక ఆటగాడు ఇప్పుడు జట్టుకు దూరం కావడం ముంబై అభిమానులకు షాకింగ్ అని చెప్పాలి.

45
కేకేఆర్ లేదా సీఎస్కే వైపు చూపు?
Image Credit : ANI

కేకేఆర్ లేదా సీఎస్కే వైపు చూపు?

ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌ను వీడితే, అతను తన పాత జట్టు అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)లో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కేకేఆర్ జట్టు ప్రస్తుతం ఒక మంచి భారతీయ బ్యాటర్, కెప్టెన్ కోసం వెతుకుతోంది. సూర్య గతంలో కేకేఆర్ తరఫున 60 మ్యాచ్‌లు ఆడి 684 పరుగులు చేశాడు.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కూడా సూర్య వంటి అనుభవం ఉన్న ఆటగాడిని తీసుకోవడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. 2026 వేలంలో ముంబై అతన్ని రూ. 16.25 కోట్లకు రిటైన్ చేసుకుంది, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జట్టు మార్పు ఖాయమనిపిస్తోంది.

Suryakumar Yadav removed Mumbai Indians and Mumbai from his bio. He unfollowed Mumbai Indians. MI unfollowed him. He deleted all MI related pics and videos from his insta id. He changed his pfp too. 

What's cooking? pic.twitter.com/PL6ErA6tDc

— SKY n Supla Shot (@sky_63_mr_t20i) June 7, 2026

55
హార్దిక్ పాండ్యా సీన్ రిపీట్ అవుతుందా?
Image Credit : X/@mipaltan

హార్దిక్ పాండ్యా సీన్ రిపీట్ అవుతుందా?

గతంలో ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో హార్దిక్ పాండ్యా కూడా ఇలాగే ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేసి, మళ్ళీ రెండు గంటల తర్వాత ఫాలో అయ్యాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం పోస్టులను కూడా డిలీట్ చేయడంతో ఇది కేవలం పొరపాటు కాదని నెటిజన్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం సూర్య ముంబై టీ20 లీగ్‌లో ట్రయంఫ్ నైట్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అక్కడ కూడా అతని జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోయి చివరి స్థానంలో ఉంది. మొత్తానికి సూర్యకు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది.

Homecoming 👀https://t.co/UluEgdzB86

— chettan (@RamSrivs) June 7, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Recommended image2
Vaibhav Breaks Sachin Record: సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved