MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Hardik Pandya : హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. జైలుకు వెళ్లే ఛాన్స్? అసలు మ్యాటర్ ఇదే !

Hardik Pandya : హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. జైలుకు వెళ్లే ఛాన్స్? అసలు మ్యాటర్ ఇదే !

Hardik Pandya : టీ20 ప్రపంచకప్ 2026 విజయోత్సవాల్లో జాతీయ జెండాను అవమానించారంటూ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై పూణేలో కేసు నమోదైంది. ఈ స్టార్ ఆల్ రౌండర్ కు జైలు శిక్ష తప్పదా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 12 2026, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హార్దిక్ పాండ్యాపై కేసు.. జైలు శిక్ష తప్పదా?
Image Credit : Getty

హార్దిక్ పాండ్యాపై కేసు.. జైలు శిక్ష తప్పదా?

భారత క్రికెట్ జట్టు సాధించిన చరిత్రాత్మక టీ20 ప్రపంచకప్ 2026 విజయోత్సవాలు ఒక చట్టపరమైన చిక్కుల్లో పడ్డాయి. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. పాండ్యాపై జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో పూణేలో ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన వేడుకల్లో పాండ్యా ప్రవర్తన జాతీయ చిహ్నం గౌరవాన్ని తగ్గించేలా ఉందనేది ఫిర్యాదులో ఆరోపణలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
న్యాయపరమైన ఫిర్యాదు వివరాలు ఇవే
Image Credit : X@@Vtxt21

న్యాయపరమైన ఫిర్యాదు వివరాలు ఇవే

పూణేకు చెందిన అడ్వకేట్ వాజిద్ ఖాన్ బిద్కర్, శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదును సమర్పించారు. తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి మైదానంలో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో పాండ్యా త్రివర్ణ పతాకానికి అగౌరవం కలిగించారని ఆయన పేర్కొన్నారు. జాతీయ జెండాను తన వీపుకు కట్టుకుని, పతాకాన్ని ధరించి మైదానంలో పడుకోవడం వంటి చర్యలు జాతీయ గౌరవానికి భంగం కలిగించాయని ఖాన్ ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "టీ20 ప్రపంచకప్ విజయానంతరం హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వేడుకల్లో మునిగిపోయారు. ఆ సమయంలో ఆయన వీపుపై జాతీయ జెండా కట్టి ఉంది. 1971 నేషనల్ ఫ్లాగ్ యాక్ట్ సెక్షన్ 2 ప్రకారం, జాతీయ జెండా గౌరవాన్ని కాపాడాలి. కానీ పాండ్యా విజయ గర్వంలో జెండాను ధరించి ఆమెతో కలిసి స్టేజ్ మీద పడుకున్నారు. ఇది ముమ్మాటికీ జాతీయ జెండాను అవమానించడమే" అని పేర్కొన్నారు.

Related Articles

Related image1
Team India : వీరు కదా అసలైన హీరోలు.. గంభీర్ నమ్మిన పంచ పాండవులు !
Related image2
పాకిస్థాన్ పై వరుణ్ చక్రవర్తి మాస్ ట్రోలింగ్.. !
35
ఫిర్యాదు అంశం పై చర్చలు.. పోలీసుల స్పందన ఏమిటి?
Image Credit : Getty

ఫిర్యాదు అంశం పై చర్చలు.. పోలీసుల స్పందన ఏమిటి?

ఫిర్యాదు దాఖలు చేసే సమయంలో అధికార పరిధికి సంబంధించిన చర్చ జరిగింది. ఈ ఘటన అహ్మదాబాద్‌లో జరిగింది కదా, పూణేలో ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారని పోలీసులు ప్రశ్నించారు. దీనిపై వాజిద్ ఖాన్ స్పందిస్తూ, "జాతీయ జెండా అనేది దేశం మొత్తానికి చిహ్నం. దేశంలో ఎక్కడ అపచారం జరిగినా ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు" అని సమాధానం ఇచ్చారు. శివాజీనగర్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి, కాపీని అందజేశారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

45
మైదానంలో అసలేం జరిగింది?
Image Credit : AFP

మైదానంలో అసలేం జరిగింది?

న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో భారత్ విజయం సాధించిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అందులో హార్దిక్ పాండ్యా, మహికా శర్మతో కలిసి ట్రోఫీతో ఫోజులిస్తూ, డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఒక క్లిప్‌లో, వారిద్దరూ పోడియంపై కలిసి పడుకుని ఉండటం, ఆ సమయంలో పాండ్యా ఒంటిపై జాతీయ జెండా కప్పి ఉండటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది కేవలం ఆనందంతో చేసిన పని అని సమర్థిస్తుంటే, మరికొందరు జాతీయ జెండా విషయంలో కనీస గౌరవం పాటించాలని విమర్శిస్తున్నారు.

55
శిక్షార్హమైన నేరం.. చట్టం ఏం చెబుతోంది?
Image Credit : BCCI\Twitter

శిక్షార్హమైన నేరం.. చట్టం ఏం చెబుతోంది?

ఈ ఫిర్యాదును ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971 కింద దాఖలు చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. ఎవరైనా బహిరంగంగా జాతీయ జెండాను తగులబెట్టడం, వికృతీకరించడం, తొక్కివేయడం లేదా ఇతరత్రా అగౌరవపరచడం వంటి పనులు చేస్తే అది నేరం. నేరం రుజువైతే జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి పోలీసులు ఈ వేడుకలకు సంబంధించిన వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు లభిస్తే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా త్వరలోనే ఐపీఎల్ లో ఆడనున్నాడు. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ లోపు ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image3
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Related Stories
Recommended image1
Team India : వీరు కదా అసలైన హీరోలు.. గంభీర్ నమ్మిన పంచ పాండవులు !
Recommended image2
పాకిస్థాన్ పై వరుణ్ చక్రవర్తి మాస్ ట్రోలింగ్.. !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved