MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే

IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే

India vs Afghanistan Test Match : అప్ఘానిస్తాన్ తో జరిగిన సింగిల్ టెస్ట్ లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. అయితే ఈ విజయం వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇక్కడ తెెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 08 2026, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అప్ఘాన్ పై ఇండియా ఘనవిజయం
Image Credit : hotstar

అప్ఘాన్ పై ఇండియా ఘనవిజయం

India vs Afghanistan Test : స్వదేశంలో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. పసికూన అప్ఘానిస్థాన్ పై అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది... దీంతో ఏకంగా ఇన్నింగ్ 300 తేడాతో భారీ గెలుపు నమోదుచేసింది. ఇండియన్ బ్యాటర్లు సెంచరీలు, హాఫ్ సెంచరీలతో అదరగొడితే బౌలర్లు టపటప వికెట్లు పడగొట్టారు. ఇలా టీమిండియా విజయం వెనకున్న టాప్ 5 రీజన్స్ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. టీమిండియా భారీ స్కోర్...
Image Credit : X/BCC

1. టీమిండియా భారీ స్కోర్...

చండీగఢ్ లోని మహారాజ యదువేంద్ర సింగ్ స్టేడియంలో అప్ఘానిస్థాన్ తో అతిథ్య టీమిండియా తలపడింది. శుభ్ మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి ఏకంగా 564 పరుగులు చేసింది. ఇంకో రెండు వికెట్లు మిగిలివుండగానే ఫస్ట్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. అంటే ఈ పరుగులు చాలు అప్ఘాన్ ను ఓడించడానికి అని టీమిండియా నిర్ణయించుకుంది. ఇలా ఒకే ఇన్నింగ్స్ లో 564/8 పరుగులు చేయడంతోనే టీమిండియా విజయం ఖాయమయ్యింది.

Related Articles

Related image1
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Related image2
IND vs AFG Test: ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ సెంచరీల వర్షం.. కెప్టెన్ గిల్‌ ఖాతాలో వరల్డ్ రికార్డ్
36
4. టీమిండియా బ్యాటర్స్ సెంచరీ, హాఫ్ సెంచరీల మోత..
Image Credit : X/BCC

4. టీమిండియా బ్యాటర్స్ సెంచరీ, హాఫ్ సెంచరీల మోత..

టీమిండియా బ్యాటింగ్ విభాగం ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఈ టెస్ట్ మరోసారి బైటపెట్టింది. ఆడిన ప్రతి బ్యాటర్ అయితే సెంచరీ లేదంటే హాఫ్ సెంచరీ సాధించారు. ఇలా ఓపెనర్ కెఎల్ రాహుల్ 100 పరుగులు (165 బంతుల్లో), కెప్టెన్ శుభ్ మన్ గిల్ 126 పరుగులు (177 బంతుల్లో) సెంచరీలు చేశారు. ఇక సాయి సుదర్శన్ 81 పరుగులు (104 బంతుల్లో), రిషబ్ పంత్ 81 పరుగులు (121 బంతుల్లో), వాషింగ్టన్ సుందర్ 52 పరుగులు (68 బంతుల్లో) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. యశస్వి జైస్వాల్ 24, మనవ్ సుతార్ 28, మహ్మద్ సిరాజ్ 22 పరుగులతో పరవాలేదనిపించారు. దీంతో టీమిండియా విజయం ఖాయమయ్యింది.

46
3. టీమిండియా బౌలర్ల హవా..
Image Credit : Getty

3. టీమిండియా బౌలర్ల హవా..

టీమిండియా బ్యాటర్లు కాదు బౌలర్లు కూడా అద్భుతాలు చేశారు. వరుసగా రెండు ఇన్సింగ్సుల్లో అప్ఘాన్ ను ఆలౌట్ చేసి భారీ విజయం అందించారు. అప్ఘాన్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో మనవ్ సుతార్ 6, ప్రసీద్ కృష్ణ 3 వికెట్లతో అదరగొట్టారు. వీరిద్దరు పోటీపడి వికెట్లు తీయడంతో కేవలం 152 పరుగులకే అప్ఘాన్ ఆలౌట్ అయ్యింది.

ఇక ఫాలోఆన్ ఆడిన అప్ఘాన్ ను మరోసారి తక్కువ పరుగులకే ఆలౌంట్ చేశారు టీమిండియా బౌలర్లు. ఈసారి వాషింగ్టన్ సుందర్ 4, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో రాణించారు. మనవ్ సుతార్ 1, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ తీశారు. దీంతో 112 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇలా కేవలం 264 పరుగులకే అప్ఘానిస్థాన్ 20 వికెట్లను పడగొట్టారు భారత బౌలర్లు... దీంతో 300 పరుగుల తేడాతో విజయం సాధించింది.

56
4. చేతులెత్తేసిన అప్ఘాన్ బౌలర్లు..
Image Credit : X/BCC

4. చేతులెత్తేసిన అప్ఘాన్ బౌలర్లు..

టీమిండియాను భారీ పరుగులు చేయకుండా అప్ఘాన్ బౌలర్లు అడ్డుకోలేకపోయారు. ఒకరి తర్వాత ఒకరు క్రీజులోకి వచ్చి అయితే సెంచరీ లేదంటే హాప్ సెంచరీలు బాదడంతోనే అప్ఘాన్ ఓటమి ఖాయమయ్యింది. భారత బ్యాటర్ల దెబ్బకు అప్ఘాన్ బౌలర్లు సెంచరీల పరుగులు సమర్పించారు... మహ్మద్ సలీమ్ సఫి 27 ఓవర్లు వేసి 140 పరుగులు, నంగేయలియా ఖరోటీ 23 ఓవర్లు వేసి 115 పరుగులు సమర్పించారు. ఇక రహ్మాన్ షరిఫీ 24 ఓవర్లలో 91, అజ్మతుల్లా ఒమర్జాయి 22 ఓవర్లలో 67, అబ్దుల్ మాలిక్ 7 ఓవర్లలో 43, అష్మతుల్లా షాహిది 24 ఓవర్లలో 91 పరుగులు ఇచ్చారు. ఇలా భారీ పరుగులు సమర్పించుకోవడంలో టీమిండియా భారీ విజయం సాధించింది.

66
5. ఫీల్డింగ్ లోనూ టీమిండియా భేష్...
Image Credit : Getty

5. ఫీల్డింగ్ లోనూ టీమిండియా భేష్...

బ్యాటింగ్, బౌలింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోనూ టీమిండియా అదరగొట్టింది. అప్ఘానిస్థాన్ బ్యాటర్లు క్రీజులో కుదురుకునే సమయం కూడా ఇవ్వకుండా వచ్చిన క్యాచ్ ను వచ్చినట్లు ఒడిసిపట్టారు. అలాగే పరుగులు ఇవ్వకుండా అద్భుత ఫీల్డింగ్ చేశారు. ఇలా అన్ని విభాగాల్లో రాణించడంతో టీమిండియా భారీ విజయం సాధించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Recommended image2
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Recommended image3
Vaibhav Suryavanshi: టీమిండియాలోకి వైభవ్.. ఒక్క మ్యాచ్‌కి ఎంత సంపాదిస్తాడో తెలుసా.?
Related Stories
Recommended image1
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Recommended image2
IND vs AFG Test: ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ సెంచరీల వర్షం.. కెప్టెన్ గిల్‌ ఖాతాలో వరల్డ్ రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved