MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Tilak Varma : తిలక్ వర్మకు బిగ్ షాక్.. కోహ్లీని చూసి నేర్చుకోకపోతే కెరీర్ క్లోజ్ !

Tilak Varma : తిలక్ వర్మకు బిగ్ షాక్.. కోహ్లీని చూసి నేర్చుకోకపోతే కెరీర్ క్లోజ్ !

Tilak Varma : దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత తిలక్ వర్మ ఫామ్‌పై మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీని చూసి నేర్చుకోవాలనీ, సహజ సిద్ధమైన ఆట తీరును మార్చుకోవద్దని సూచించారు. అసలు తిలక్ వర్మకు ఏమైంది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 24 2026, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎందుకు తిలక్ వర్మ విఫలమవుతున్నాడు? ఛేజ్ మాస్టర్ కావాలంటే అది ఉండాలి
Image Credit : Getty

ఎందుకు తిలక్ వర్మ విఫలమవుతున్నాడు? ఛేజ్ మాస్టర్ కావాలంటే అది ఉండాలి

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 పోరులో టీమ్ ఇండియా పరాజయం పాలవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారత బ్యాటింగ్ లైనప్ వైఫల్యం అభిమానులను నిరాశకు గురిచేసింది. 1 నుంచి 8వ నంబర్ వరకు నాణ్యమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ, దక్షిణాఫ్రికా నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోవడంపై మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ వరుసగా విఫలమవ్వడం చర్చనీయాంశంగా మారింది. తిలక్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న తరుణంలో మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అతడికి ఒక ప్రత్యేకమైన గురుమంత్రాన్ని అందించారు.

26
సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. సూర్యపై ట్రోల్స్
Image Credit : Getty

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. సూర్యపై ట్రోల్స్

దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలైన తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వైఖరిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య మాట్లాడిన తీరు అతివిశ్వాసంగా ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. జట్టు ఓటమికి బాధ్యత వహించాల్సింది పోయి, బడాయి మాటలు చెబుతున్నారంటూ అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, జట్టులో సమన్వయం లోపించిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Related image1
Team India అతిపెద్ద బలహీనత ఇదే.. వరల్డ్ కప్ గెలవాలంటే ఇది మారాల్సిందే
Related image2
నెక్ట్స్ మ్యాచ్ కాదు.. టీ20 వరల్డ్ కప్ నుండే అభిషేక్ ఔట్..? జట్టులోకి యంగ్ ప్లేయర్ ఎంట్రీ ఫిక్స్
36
తిలక్ వర్మకు కైఫ్ ప్రత్యేక సలహా
Image Credit : ANI

తిలక్ వర్మకు కైఫ్ ప్రత్యేక సలహా

యువ బ్యాటర్ తిలక్ వర్మ ఆటతీరుపై మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్ లో విశ్లేషించారు. తిలక్ ఎదుర్కొంటున్న అసలు సమస్య భారీ షాట్లు ఆడలేకపోవడం కాదని, బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చేయలేకపోవడమేనని కైఫ్ స్పష్టం చేశారు. బయట వినిపించే విమర్శలను పట్టించుకోకుండా, తన సహజ సిద్ధమైన ఆటపై దృష్టి సారించాలని సూచించారు. క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్‌ను నిర్మించే అలవాటు చేసుకోవాలని, అప్పుడే పాత ఫామ్ తిరిగి వస్తుందని కైఫ్ అభిప్రాయపడ్డారు.

46
కోహ్లీని చూసి నేర్చుకో
Image Credit : AFP

కోహ్లీని చూసి నేర్చుకో

బ్యాటింగ్‌లో నిలకడ సాధించాలంటే విరాట్ కోహ్లీని రోల్ మోడల్‌గా తీసుకోవాలని తిలక్ వర్మకు కైఫ్ సూచించారు. "తిలక్.. నీవు కోహ్లీ లాగా ఆడటం నేర్చుకోవాలి. ఇతరులు చెబుతున్నారని నీ సహజమైన ఆటను మార్చుకుని, భారీ షాట్ల కోసం ప్రయత్నించి వికెట్ పారేసుకోవద్దు. అలా చేస్తే నీవు ఎప్పటికీ మెరుగైన ఆటగాడివి కాలేవు. నీ ఆలోచనలకు అనుగుణంగా బ్యాటింగ్ చేయి. గొప్ప ఛేజ్ మాస్టర్ కావాలంటే ముందుగా 20 ఓవర్ల పాటు క్రీజులో నిలబడటం నేర్చుకోవాలి" అని కైఫ్ అన్నారు.

56
మేనేజ్‌మెంట్‌దే అసలు బాధ్యత
Image Credit : Getty

మేనేజ్‌మెంట్‌దే అసలు బాధ్యత

ఆటగాళ్ల వైఫల్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ పాత్ర కూడా ఉంటుందని కైఫ్ అభిప్రాయపడ్డారు. "స్ట్రైక్ రేట్ పెంచాలనే ఒత్తిడిలో తిలక్ అవుట్ అవుతున్నాడు. మేనేజ్‌మెంట్ చెప్పినట్లు చేయడం ఆటగాడి బాధ్యత, కానీ ఆటగాడికి తన నేచురల్ గేమ్ ఆడే స్వేచ్ఛను ఇవ్వడం మేనేజ్‌మెంట్ బాధ్యత. తిలక్ తన సొంత శైలిలో ఆడితే తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే అతను మ్యాచ్‌ను ముగించగలడు. బలవంతంగా వేగంగా ఆడమని ఒత్తిడి చేయడం వల్లే అతను విఫలమవుతున్నాడు" అని కైఫ్ విశ్లేషించారు.

66
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
Image Credit : Getty

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ప్రస్తుత టీ20 ప్రపంచ కప్‌లో తిలక్ వర్మ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో స్ట్రైక్ రేట్ 118గా ఉంది. టీమ్ ఇండియా భారీ ఆశలు పెట్టుకున్న ఈ యువ ఆటగాడు కీలక దశలో విఫలమవ్వడం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. కైఫ్ ఇచ్చిన ఈ సలహాలను పాటించి తిలక్ తన తర్వాతి మ్యాచ్‌ల్లో పుంజుకుంటాడో లేదో వేచి చూడాలి. అయితే, రాబోయే మ్యాచ్ లలో తిలక్ ను జట్టు నుంచి తప్పించే అవకాశముందని కూడా పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీని కోసం టీమిండియా మరో ప్లాన్ ను కూడా సిద్ధం చేసిందని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక స్కోర్లు.. చ‌రిత్ర‌లో టాప్ 10 టీమ్స్ ఇవే
Recommended image2
T20 World Cup : జింబాబ్వేపై విండీస్ విజయం.. ఇక టీమిండియా సెమీస్ కు చేరే మార్గాలివే..?
Recommended image3
0,0,0 రన్స్ తో హ్యాట్రిక్ డకౌట్స్.. అయినా అభిషేక్ నే ఎందుకు ఆడిస్తున్నారో తెలుసా? టాప్ రీజన్స్
Related Stories
Recommended image1
Team India అతిపెద్ద బలహీనత ఇదే.. వరల్డ్ కప్ గెలవాలంటే ఇది మారాల్సిందే
Recommended image2
నెక్ట్స్ మ్యాచ్ కాదు.. టీ20 వరల్డ్ కప్ నుండే అభిషేక్ ఔట్..? జట్టులోకి యంగ్ ప్లేయర్ ఎంట్రీ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved