MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • నెక్ట్స్ మ్యాచ్ కాదు.. టీ20 వరల్డ్ కప్ నుండే అభిషేక్ ఔట్..? జట్టులోకి యంగ్ ప్లేయర్ ఎంట్రీ ఫిక్స్

నెక్ట్స్ మ్యాచ్ కాదు.. టీ20 వరల్డ్ కప్ నుండే అభిషేక్ ఔట్..? జట్టులోకి యంగ్ ప్లేయర్ ఎంట్రీ ఫిక్స్

ICC Men's T20 World Cup 2026 :  టీమిండియా మేనేజ్మెంట్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేశాడు అభిషేక్ వర్మ. అందుకే అతడికి తర్వాతి మ్యాచ్ నుండి కాదు ఏకంగా టీ20 వరల్డ్ కప్ 2026 నుండే పక్కనబెట్టేస్తున్నారట.

3 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 23 2026, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇక అభిషేక్ ఖేల్ ఖతం...
Image Credit : Getty

ఇక అభిషేక్ ఖేల్ ఖతం...

T20 World Cup 2026 : ఒక్క ఓటమి… టీమిండియా అభిమానుల్లో కలవరాన్ని పెంచింది. స్వదేశంలో జరుగుతున్న ఐసిసి టీ20 వరల్డ్ కప్ 2026 లో టీమిండియా ఆరంభం అదిరింది... ఓటమన్నదే లేకుండా గ్రూప్ స్టేజ్ నుండి సూపర్-8 చేరింది. ఇలా టీం గెలుపుబాటలో నడిచినంతకాలం ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా డకౌట్ అవుతున్నా అవకాశాలు దక్కాయి. కానీ సూపర్-8 లో సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత పరిస్థితులన్నీ మారాయి. అందరి వేళ్లు అభిషేక్ వైపు చూపిస్తున్నాయి... దీంతో ఇక ఈ టీ20 వరల్డ్ కప్ లో అతడి ప్రయాణం ముగిసినట్లే అని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

25
జింబాబ్వే మ్యాచ్ కు అభిషేక్ దూరం..
Image Credit : Getty

జింబాబ్వే మ్యాచ్ కు అభిషేక్ దూరం..

ఫామ్ కొల్పోయి వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మను పక్కనబెట్టే ఆలోచనలో టీమిండియా మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడికి ఎక్కువ అవకాశాలు ఇచ్చామని భావిస్తున్నారట... అందుకే సూపర్-8 లో కీలకమైన జింబాబ్వే మ్యాచ్ లో ఇతడిని ఆడించకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇదే కరెస్ట్ డెసిషన్ గా భావించి అభిషేక్ ను డ్రెస్సింగ్ రూంకే పరిమితం చేసేందుకు సిద్దమయ్యాడట. 

Related Articles

Related image1
IND vs SA : సూపర్ 8 లో భారత జట్టు ఓటమికి కారణాలు ఇవే
Related image2
IND vs SA : 167+ స్ట్రైక్ రేట్ తో 448 రన్స్.. భారత్ ను భయపెడుతున్న సౌతాఫ్రికా స్టార్
35
సంజు శాంసన్ కు అవకాశం..
Image Credit : Getty

సంజు శాంసన్ కు అవకాశం..

సూపర్-8 లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే అభిషేక్‌కు బదులు సంజూ శాంసన్‌ను ఆడిస్తారనే ప్రచారం జరిగింది. కానీ కెప్టెన్ సూర్యకుమార్ ఎంతో నమ్మకంతో అభిషేక్‌కు మరో అవకాశం ఇచ్చాడు. కానీ అతడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు... తన వికెట్‌ను చాలా సులభంగా పారేసుకున్నాడు.

జూన్ 26న చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో జింబాబ్వేతో భారత్ తర్వాతి సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్ పరువు పోవడమే కాదు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే ఈ కీలక పోరులో అభిషేక్ శర్మను పక్కనపెడుతున్నారు.. అతని స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వరల్డ్ కప్ 2026లో ఇప్పటివరకు అభిషేక్ నాలుగు మ్యాచుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు... కానీ సంజూ శాంసన్ ఒకే మ్యాచ్‌లో 22 పరుగులు చేశాడు.

45
అలాగైతే అభిషేక్ టీ20 వరల్డ్ కప్ జర్నీ ముగిసినట్లే...
Image Credit : Getty

అలాగైతే అభిషేక్ టీ20 వరల్డ్ కప్ జర్నీ ముగిసినట్లే...

జింబాబ్వే మ్యాచ్ లో సంజూ శాంసన్ ఓపెనర్ గా బరిలోకి దిగి రాణించాడో... అభిషేక్ శర్మ వరల్డ్ కప్ 2026 నుండి తప్పుకున్నట్లే. అతడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉండదు... వరల్డ్ కప్ టోర్నీ మొత్తం సంజూ శాంసన్ నే ఆడిస్తారు.

అయితే ఒకవేళ శాంసన్ కూడా వరుసగా విఫలమైతే సెమీఫైనల్ లేదంటే ఫైనల్లో అభిషేక్ కు అవకాశం దక్కవచ్చు. కానీ జింబాబ్వేతో ఓడితే వరల్డ్ కప్ నుండే టీమిండియా ఔట్ అవుతుంది... అలా జరక్కుండా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అభిషేక్ ను ఇప్పటికయితే పక్కనబెడుతున్నారు. ఇది తాత్కాలికమా లేక ఈ వరల్డ్ కప్ మొత్తం ఇక బయటే ఉంటాడా అన్నది టీమిండియా గెలుపోటములు నిర్ణయిస్తాయి.

55
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి... సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
Image Credit : Getty

సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి... సెమీస్ అవకాశాలు సంక్లిష్టం

టీ20 ప్రపంచకప్ 2026 లో టీమిండియా మొదటి సూపర్ 8 మ్యాచ్‌ ఆడింది. అహ్మదాబాద్ స్టేడియంలో దక్షిణాఫ్రికా అద్భుతంగా రాణించింది.. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లో సత్తాచాటి 76 పరుగుల తేడాతో భారత్ కు ఘోర ఓటమిని రుచిచూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 187 పరుగులు చేయగా, భారత జట్టు 111 పరుగులకే ఆలౌట్ అయింది.

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ విఫలమయ్యారు. భారీ అంచనాలున్న అభిషేక్ శర్మ కూడా కేవలం 15 పరుగులకే ఔటయ్యాడు. శివమ్ ధూబే 42 పరుగులతో కొద్దిసేపు పోరాటం చేశాడు... కానీ విజయాన్ని అందించేస్థాయిలో ఆడలేకపోయాడు. హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ లు కూడా చేతులెత్తేయడంతో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. 

దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇకపై భారత జట్టు సూపర్ 8 లో ఆడబోయే మిగతా రెండు మ్యాచులు తప్పకుండా గెలవాల్సిందే... అప్పుడే సెమీస్ కు చేరుకుంది. ఏ ఒక్క మ్యాచ్ ఓడినా స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ ను అందుకునే అవకాశం కోల్పోయినట్లే. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
మైదానంలో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. టీమిండియాపై పాక్ జట్టుదే పైచేయి
Recommended image2
సూపర్ 8 తొలి మ్యాచ్‌లోనే పాక్‌కు ఝలక్.! సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిందే
Recommended image3
India vs South Africa : ఓపెనర్లు ఫ్లాప్.. మిడిల్ ఆర్డర్ డీలా ! ముంచేశారు భయ్యా
Related Stories
Recommended image1
IND vs SA : సూపర్ 8 లో భారత జట్టు ఓటమికి కారణాలు ఇవే
Recommended image2
IND vs SA : 167+ స్ట్రైక్ రేట్ తో 448 రన్స్.. భారత్ ను భయపెడుతున్న సౌతాఫ్రికా స్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved