MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే

India : వైజాగ్ లో జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. షెఫాలీ వర్మ 69 పరుగులతో వీరవిహారం చేయడంతో సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 23 2025, 11:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కేవలం 11.5 ఓవర్లలోనే ఖేల్ ఖతం.. షెఫాలీ దెబ్బకు లంక విలవిల
Image Credit : X/BCCIWomen

కేవలం 11.5 ఓవర్లలోనే ఖేల్ ఖతం.. షెఫాలీ దెబ్బకు లంక విలవిల

శ్రీలంక మహిళల జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మంగళవారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ (ACA-VDCA) క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది.

ఈ గెలుపుతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ విజయం ఏకపక్షంగా మారింది. శ్రీలంక నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 11.5 ఓవర్లలోనే ఛేదించి సత్తా చాటింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
షెఫాలీ వర్మ సుడిగాలి ఇన్నింగ్స్
Image Credit : X/BCCIWomen

షెఫాలీ వర్మ సుడిగాలి ఇన్నింగ్స్

భారత విజయంలో స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షెఫాలీ, మైదానంలో పరుగుల వరద పారించింది. ఆమె కేవలం 34 బంతుల్లోనే 69 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఇందులో 11 ఫోర్లు, ఒక భారీ సిక్స్ ఉన్నాయి.

షెఫాలీ వర్మ స్ట్రైక్ రేట్ ఏకంగా 202.94గా నమోదైంది. కేవలం 27 బంతుల్లోనే ఆమె తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. షెఫాలీ దూకుడు ముందు శ్రీలంక బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఆమె క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల మోత మోగింది. జట్టును విజయ తీరాలకు చేర్చిన తర్వాతే ఆమె మైదానం వీడింది.

Related Articles

Related image1
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర
Related image2
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
36
తేలిపోయిన శ్రీలంక బ్యాటింగ్
Image Credit : X/BCCIWomen

తేలిపోయిన శ్రీలంక బ్యాటింగ్

అంతకుముందు, భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి మరోసారి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని బౌలర్లు వమ్ము చేయలేదు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగింది.

శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ గుణరత్నే వికెట్ కోల్పోవడంతో లంక కష్టాల్లో పడింది. కెప్టెన్ చమారి అటపట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ, భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతుల ముందు ఎక్కువ సేపు నిలవలేకపోయింది. 38 పరుగుల వద్ద రెండో వికెట్ పడటంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది.

46
భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన
Image Credit : X/BCCIWomen

భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన

భారత బౌలింగ్ దళం ఈ మ్యాచ్‌లోనూ కలిసికట్టుగా రాణించింది. స్పిన్నర్ ఎన్. శ్రీచరణి అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె తన 4 ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టింది. అంతేకాకుండా, రెండు అద్భుతమైన క్యాచ్‌లు అందుకోవడంతో పాటు ఒక రనౌట్ కూడా చేసి ఫీల్డింగ్‌లోనూ మెరిసింది.

మరోవైపు, తన రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడుతున్న యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ కూడా ఆకట్టుకుంది. ఆమె 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. క్రాంతి గౌడ్, స్నేహ రాణా చెరో వికెట్ పడగొట్టారు. బౌలర్ల ధాటికి శ్రీలంక ఏ దశలోనూ భారీ స్కోరు చేసేలా కనిపించలేదు.

56
లక్ష్య ఛేదనలో భారత ఆధిపత్యం
Image Credit : X/BCCIWomen

లక్ష్య ఛేదనలో భారత ఆధిపత్యం

129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను వేగంగా ముందుకు నడిపించారు. అయితే, నాలుగో ఓవర్‌లో స్మృతి మంధాన (14 పరుగులు) ఔట్ అయ్యింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్, షెఫాలీతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. వీరిద్దరూ ఓవర్‌కు 10 పరుగుల సగటుతో రన్స్ రాబట్టారు. జట్టు స్కోరు 87 పరుగుల వద్ద జెమీమా ఔట్ కాగా, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (10 పరుగులు) ఎక్కువ సేపు నిలవలేకపోయింది. కానీ షెఫాలీ మాత్రం చివరి వరకు ఉండి మ్యాచ్‌ను ముగించింది. 12వ ఓవర్‌లోనే భారత్ విజయం సాధించింది.

66
సిరీస్ విజయం దిశగా భారత్..
Image Credit : X/BCCIWomen

సిరీస్ విజయం దిశగా భారత్..

ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో నిలిచింది. మొదటి మ్యాచ్‌లోనూ భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్‌ను భారత జట్టు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

ఇరు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ శుక్రవారం, డిసెంబర్ 26న తిరువనంతపురంలో జరగనుంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని హర్మన్‌ప్రీత్ సేన భావిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
మహిళల క్రికెట్
విశాఖపట్నం

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర
Recommended image2
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved