MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • PAK vs SL : పిచ్చెక్కించిన షనక.. వణికిపోయిన షాహీన్ అఫ్రిది.. గెలిచినా ఏడ్చిన పాక్ ప్లేయర్లు!

PAK vs SL : పిచ్చెక్కించిన షనక.. వణికిపోయిన షాహీన్ అఫ్రిది.. గెలిచినా ఏడ్చిన పాక్ ప్లేయర్లు!

Pakistan vs Sri Lanka : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 మ్యాచ్ లో శ్రీలంకపై 5 పరుగుల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది. కానీ, నెట్ రన్ రేట్ సమీకరణాల వల్ల టోర్నీ నుండి అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక కెప్టెన్ షనక దుమ్మురేపాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 28 2026, 11:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పోరాడి గెలిచినా.. టోర్నీ నుండి ఇంటికి వెళ్ళక తప్పని పాక్
Image Credit : ANI

పోరాడి గెలిచినా.. టోర్నీ నుండి ఇంటికి వెళ్ళక తప్పని పాక్

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా పల్లెకెలెలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్ 5 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. అయితే, ఈ గెలుపు పాకిస్థాన్‌ను సెమీఫైనల్‌కు చేర్చలేకపోయింది. సెమీస్ చేరాలంటే శ్రీలంకను 147 పరుగులకే పరిమితం చేయాల్సిన స్థితిలో ఉన్న పాక్, ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమై టోర్నీ నుండి అవుట్ అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫర్హాన్, ఫకర్ విధ్వంసం: పాక్ భారీ స్కోరు
Image Credit : X/ICC

ఫర్హాన్, ఫకర్ విధ్వంసం: పాక్ భారీ స్కోరు

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (100), ఫకర్ జమాన్ (84) శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 15.5 ఓవర్లలోనే 176 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫర్హాన్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో తన కెరీర్‌లో రెండో టీ20 ప్రపంచ కప్ సెంచరీని నమోదు చేశాడు. ఫకర్ జమాన్ కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. చివరిలో శ్రీలంక బౌలర్ దిల్షాన్ మదుశంక 3 వికెట్లతో రాణించడంతో పాక్ మిగిలిన వికెట్లను త్వరగా కోల్పోయింది.

35
సెమీస్ లెక్కలు తేలాయి.. పాక్ ఆశలు గల్లంతు
Image Credit : ANI

సెమీస్ లెక్కలు తేలాయి.. పాక్ ఆశలు గల్లంతు

పాకిస్థాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే శ్రీలంకను 147 పరుగుల లోపే ఆలౌట్ చేయాలి లేదా కట్టడి చేయాలి. శ్రీలంక జట్టు 15.5 ఓవర్లలో 150 మార్కును దాటడంతోనే పాకిస్థాన్ అధికారికంగా టోర్నీ నుండి అవుట్ అయినట్టు ఖరారైంది. దీంతో న్యూజిలాండ్ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది. పాక్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ఈ విషయం తెలిసి కన్నీరు పెట్టుకోవడం కనిపించింది.

45
శ్రీలంక దీటైన జవాబు.. అసలంక పోరాటం
Image Credit : Getty

శ్రీలంక దీటైన జవాబు.. అసలంక పోరాటం

213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. నిస్సంక (3) త్వరగానే వెనుదిరిగినప్పటికీ, కమిల్ మిశ్ర (26) ఎదురుదాడి చేశాడు. ఆ తర్వాత చరిత్ అసలంక (25), పవన్ రత్నాయకే (58) అద్భుతంగా ఆడారు. రత్నాయకే 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధసెంచరీ సాధించి జట్టును విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేశాడు.

55
షనక మెరుపులు..వణికిన పాకిస్థాన్
Image Credit : Getty

షనక మెరుపులు..వణికిన పాకిస్థాన్

చివరి ఓవర్లలో దసున్ షనక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. షాహీన్ అఫ్రిది వేసిన చివరి ఓవర్లో శ్రీలంక విజయానికి 28 పరుగులు అవసరం కాగా, షనక వరుసగా 4, 6, 6, 6 బాదడంతో పాక్ శిబిరంలో వణుకు మొదలైంది. షనక కేవలం 31 బంతుల్లో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే ఆఖరి రెండు బంతుల్లో షాహీన్ అఫ్రిది కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక 20 ఓవర్లలో 207 పరుగులకు పరిమితమైంది.

బౌలింగ్‌లో అబ్రార్ మ్యాజిక్

పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. నసీమ్ షా కూడా ఒక వికెట్ తీసి ఆరంభంలోనే ఒత్తిడి పెంచాడు. షాహీన్ అఫ్రిదికి ఒక వికెట్ దక్కినప్పటికీ చివరి ఓవర్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. చివరికి పాకిస్థాన్ 5 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి, టోర్నీని విజయంతో ముగించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : కోహ్లీ రికార్డు బద్దలు.. 12 ఏళ్ల రికార్డు మటాష్ !
Recommended image2
IND vs WI : ధోనీ వారసుడికి దక్కని చోటు? విండీస్ మ్యాచ్‌కు టీమిండియా ప్లాన్ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved