MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • IND vs ZIM : జింబాబ్వేతో మ్యాచ్.. భారత్‌కు చావో రేవో ! ముగ్గురు స్టార్లు ఔట్

IND vs ZIM : జింబాబ్వేతో మ్యాచ్.. భారత్‌కు చావో రేవో ! ముగ్గురు స్టార్లు ఔట్

India vs Zimbabwe: టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై భారత్ తప్పక గెలవాలి. ఈ కీలక మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో సంజు శాంసన్‌తో పాటు ముగ్గురు కొత్త ప్లేయర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 25 2026, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారత్ vs జింబాబ్వే: సెమీస్ కోసం టీమ్ ఇండియా వ్యూహాం ఇదే
Image Credit : ANI

భారత్ vs జింబాబ్వే: సెమీస్ కోసం టీమ్ ఇండియా వ్యూహాం ఇదే

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన భారత్‌కు, సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో విజయం పక్కా కావాలి. ఇది భారత్‌కు చావో రేవో లాంటి పోరు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే, టోర్నీ నుంచి అవుట్ అయి ఇంటికి వస్తుంది. మరోవైపు, తమ మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయిన జింబాబ్వే కూడా సెమీస్ రేసులో ఉండాలంటే గెలవాల్సిన పరిస్థితిలో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భారత జట్టులో భారీ మార్పులు: ముగ్గురు ప్లేయర్లు అవుట్?
Image Credit : ANI

భారత జట్టులో భారీ మార్పులు: ముగ్గురు ప్లేయర్లు అవుట్?

చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. గత మ్యాచ్‌లో విఫలమైన ముగ్గురు కీలక ఆటగాళ్లను పక్కన పెట్టాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ విభాగం, టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌పై దృష్టి సారించారు.

36
సుందర్ స్థానంలో అక్షర్ పటేల్
Image Credit : Getty

సుందర్ స్థానంలో అక్షర్ పటేల్

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను తిరిగి జట్టులోకి తీసుకురానున్నారు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలించినప్పటికీ, జింబాబ్వే టాప్ ఆర్డర్‌లో ఏడుగురిలో ఐదుగురు కుడిచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. ఈ సమీకరణం దృష్ట్యా ఆఫ్ స్పిన్నర్ సుందర్ కంటే ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ ప్రభావం చూపుతారని జట్టు భావిస్తోంది.

46
రింకూ సింగ్ దూరం.. కుల్దీప్ యాదవ్‌కు అవకాశం
Image Credit : Getty

రింకూ సింగ్ దూరం.. కుల్దీప్ యాదవ్‌కు అవకాశం

ఫినిషర్ పాత్రలో బరిలోకి దిగుతున్న రింకూ సింగ్ గత ఐదు మ్యాచ్‌లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో 29 బంతులు ఎదుర్కొన్న అతను కేవలం 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతేకాకుండా, రింకూ తండ్రి అనారోగ్య కారణాల వల్ల అతను అత్యవసరంగా ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండకపోవచ్చు. రింకూ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. చెన్నై స్పిన్ ట్రాక్‌పై కుల్దీప్ కీలకం కానున్నాడు.

56
తిలక్ వర్మ అవుట్.. సంజూ శాంసన్ ఇన్
Image Credit : Getty

తిలక్ వర్మ అవుట్.. సంజూ శాంసన్ ఇన్

తక్కువ స్ట్రైక్ రేట్, దూకుడు లేని ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న తిలక్ వర్మపై వేటు పడే అవకాశం ఉంది. మూడో నంబర్‌లో ఎడమచేతి వాటం బ్యాటర్ తిలక్‌కు బదులుగా కుడిచేతి వాటం బ్యాటర్ సంజూ శాంసన్‌ను ఆడించాలని మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. సంజూను ఓపెనర్‌గా పంపిస్తే, ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడతాడు. ప్రత్యర్థి జట్టులోని ఆఫ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడానికి సంజూ సరైన ఎంపిక అని భారత్ నమ్ముతోంది.

66
బౌలింగ్ దళం.. పిచ్ అంచనాలు ఇవే
Image Credit : Getty

బౌలింగ్ దళం.. పిచ్ అంచనాలు ఇవే

చెన్నై పిచ్ సాంప్రదాయకంగా స్పిన్నర్లకు స్వర్గధామం. వరుణ్ చక్రవర్తికి ఇది హోమ్ గ్రౌండ్ కావడం విశేషం. వరుణ్, కుల్దీప్, అక్షర్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లతో జింబాబ్వేను దెబ్బకొట్టాలని భారత్ ప్లాన్ చేస్తోంది. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద ఊరట. గత మ్యాచ్‌లో ఇతర బౌలర్లు విఫలమైనా బుమ్రా మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం గెలవడమే కాకుండా, నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవడానికి భారీ విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.

జింబాబ్వే తో ఫైట్.. భారత ప్రాబబుల్ ఎలెవన్

సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
T20 World Cup 2026: హ్యారీ బ్రూక్ vs సూర్యకుమార్ యాదవ్‌.. వీరి మధ్య తేడా ఇదే !
Recommended image2
Team India : టీమిండియాకు జింబాబ్వే ఓటమి కష్టాలు.. సెమీస్ చేరాలంటే ఇది జరగాలి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved