MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Team India: వీళ్లే ఇంత డేంజర్ అయితే.. టీమిండియాలోకి ఆ పిచ్చోడు వస్తే ఇక నెత్తిన గుడ్డే

Team India: వీళ్లే ఇంత డేంజర్ అయితే.. టీమిండియాలోకి ఆ పిచ్చోడు వస్తే ఇక నెత్తిన గుడ్డే

Team India: 2026 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ సగర్వంగా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ అద్భుత విజయంపై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ బౌలర్ షాన్ పొల్లాక్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత బ్యాటింగ్ లైనప్ ప్రస్తుతం ప్రపంచంలోనే..

1 Min read
Author : Pavithra D
Published : Mar 12 2026, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
11 మంది సమష్టి కృషి
Image Credit : BCCI\Twitter

11 మంది సమష్టి కృషి

2026 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయం కేవలం ఒకరిద్దరు ఆటగాళ్ల వల్ల కాకుండా, జట్టులోని 11 మంది సమష్టి కృషితో సాధ్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పోరాడి గెలిచిన వైనం
Image Credit : Team India\BCCI

పోరాడి గెలిచిన వైనం

టోర్నీ ఆరంభంలో భారత్ కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, సూపర్-8 దశ నుండి తన అసలు సిసలు విశ్వరూపాన్ని ప్రదర్శించింది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను, ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చిత్తు చేసింది. గత 18 నెలలుగా భారత బ్యాటింగ్ లైనప్ సాధించిన పరిణతి ఈ టోర్నీలో స్పష్టంగా కనిపించింది.

35
షాన్ పొల్లాక్ ప్రశంసలు
Image Credit : X/BCCI

షాన్ పొల్లాక్ ప్రశంసలు

భారత్ విజయంపై స్పందించిన దక్షిణాఫ్రికా మాజీ పేసర్ షాన్ పొల్లాక్, టీం ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను చూసి ప్రపంచ జట్లు భయపడుతున్నాయని అన్నారు. "భారత బ్యాటర్లను ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా వారు చెలరేగిపోతున్నారు. ఎనిమిది మంది ఆటగాళ్లు 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్‌ చేయడం అసాధారణం" అని ఆయన కొనియాడారు. ఇలాంటి భీకరమైన బ్యాటింగ్ లైనప్‌ను ఎదుర్కోవడం ఏ బౌలర్‌కైనా కష్టతరమైన పనే అని పొల్లాక్ అభిప్రాయపడ్డారు.

45
భవిష్యత్తు ఆశాకిరణం - వైభవ్ సూర్యవంశీ
Image Credit : BCCI\Twitter

భవిష్యత్తు ఆశాకిరణం - వైభవ్ సూర్యవంశీ

టీం ఇండియా బెంచ్ స్ట్రెంత్ గురించి ప్రస్తావిస్తూ, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి పొల్లాక్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న వైభవ్ వంటి హిట్టర్లు జట్టులోకి వస్తే భారత్ మరింత పటిష్టంగా మారుతుందని చెప్పారు.

55
తిరుగులేని శక్తిగా  భారత్
Image Credit : X/BCCI

తిరుగులేని శక్తిగా భారత్

ప్రస్తుత ఫామ్, యువ రక్తాన్ని చూస్తుంటే, మరో ఐదేళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌లో టీం ఇండియా ఆధిపత్యం కొనసాగుతుందని ఆయన జోస్యం చెప్పారు. మొత్తానికి, టీం ఇండియా ప్రదర్శన ప్రపంచ క్రికెట్‌లో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. అటు అనుభవం, ఇటు యువ హిట్టర్ల కలయికతో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
Team India : వీరు కదా అసలైన హీరోలు.. గంభీర్ నమ్మిన పంచ పాండవులు !
Recommended image2
Team India : టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసిన గౌతమ్ గంభీర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved