MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Team India : వీరు కదా అసలైన హీరోలు.. గంభీర్ నమ్మిన పంచ పాండవులు !

Team India : వీరు కదా అసలైన హీరోలు.. గంభీర్ నమ్మిన పంచ పాండవులు !

Team India : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా ఘనవిజయం సాధించడంలో మన కుర్రాళ్లు అదిరిపోయే ఆటతో దుమ్మురేపారు. అక్షర్ పటేల్, శివమ్ దూబే, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు.. ఇలా జట్టులోని ప్లేయర్లు కీలక పాత్ర పోషించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 09 2026, 11:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టీమిండియాలో పంచ పాండవులు
Image Credit : Getty

టీమిండియాలో పంచ పాండవులు

టీ20 ప్రపంచకప్ 2026 విజయం కేవలం ఒక ట్రోఫీకి మాత్రమే పరిమితం కాలేదు. ఇది టీమ్ ఇండియాలోని ఐదుగురు అన్సంగ్ హీరోల అద్భుత పోరాట పటిమకు నిదర్శనం. జట్టుకు అవసరమైన ప్రతిసారీ మైదానంలోకి దిగి, తమ వ్యూహాత్మక ప్రదర్శనతో భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టారు. అక్షర్ పటేల్, శివమ్ దూబే, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ.. ఈ ఐదుగురి ధాటికి ప్రత్యర్థి జట్లు కుప్పకూలాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఆల్ రౌండ్ ప్రదర్శన
Image Credit : Getty

వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఆల్ రౌండ్ ప్రదర్శన

శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుండి తప్పించడం కష్టమైన నిర్ణయమైనప్పటికీ, కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు సమతుల్యతకే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ తన బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించారు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను కట్టడి చేశారు. ఈ టోర్నమెంట్‌లో అక్షర్ పటేల్ మొత్తం 7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టి జట్టుకు వెన్నెముకగా నిలిచారు. బౌలింగ్‌లోనే కాకుండా జట్టు సమతుల్యతను కాపాడటంలో ఆయన పాత్ర మరువలేనిది.

36
శివమ్ దూబే పవర్ హిట్టింగ్.. బౌలింగ్‌లోనూ మెరుపులు
Image Credit : ANI

శివమ్ దూబే పవర్ హిట్టింగ్.. బౌలింగ్‌లోనూ మెరుపులు

శివమ్ దూబే తన భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో ఆయన అందించిన సహకారం టీమ్ ఇండియా భారీ స్కోరు సాధించడానికి తోడ్పడింది. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా, అవసరమైన సమయంలో 5 వికెట్లు తీసి ఆల్ రౌండర్ పాత్రను పోషించారు. దూబే 8 ఇన్నింగ్స్‌ల్లో 169.06 స్ట్రైక్ రేట్‌తో 235 పరుగులు చేశారు. ఇందులో మొత్తం 17 సిక్సర్లు ఉండటం గమనార్హం.

46
సంజూ శాంసన్ సిక్సర్ల సునామీ
Image Credit : Getty

సంజూ శాంసన్ సిక్సర్ల సునామీ

వికెట్ కీపర్, ఓపెనర్‌గా సంజూ శాంసన్ టీమ్ ఇండియాకు భారీ స్కోర్ల పునాది వేశారు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో సంజూ ఆడిన దూకుడు ఇన్నింగ్స్ ప్రత్యర్థి బౌలర్లను ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ టోర్నమెంట్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్ 199.37 అత్యధిక స్ట్రైక్ రేట్‌తో 321 పరుగులు బాదారు. టీమ్ ఇండియా తరపున ఈ టోర్నీలో ఇవే అత్యధిక పరుగులు. ఆయన బ్యాట్ నుంచి ఏకంగా 24 సిక్సర్లు వచ్చాయి.

56
ఇషాన్ కిషన్ ఫ్లెక్సిబిలిటీ.. మెరుపు బ్యాటింగ్
Image Credit : Getty

ఇషాన్ కిషన్ ఫ్లెక్సిబిలిటీ.. మెరుపు బ్యాటింగ్

జట్టులో ఇషాన్ కిషన్ ఉండటం వల్ల బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌లో టీమ్ ఇండియాకు అదనపు బలం చేకూరింది. సంజూ, ఇషాన్ ద్వయం జట్టుకు ఇద్దరు వికెట్ కీపర్ల ఆప్షన్‌ను అందించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుతమైన క్యాచ్‌లు పట్టడమే కాకుండా, తన దూకుడుతో జట్టు స్కోరును పెంచారు. 9 మ్యాచ్‌ల్లో 193.29 స్ట్రైక్ రేట్‌తో 317 పరుగులు చేసిన ఇషాన్, మొత్తం 18 సిక్సర్లు కొట్టారు.

66
అభిషేక్ శర్మ విధ్వంసకర ఆరంభం
Image Credit : Getty

అభిషేక్ శర్మ విధ్వంసకర ఆరంభం

ఓపెనర్ అభిషేక్ శర్మపై గంభీర్ ఉంచిన నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు. ఫామ్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో అభిషేక్ తన సత్తా చాటారు. ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి 247.61 స్ట్రైక్ రేట్‌తో భారత్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇన్నింగ్స్ జట్టు భారీ స్కోరు సాధించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. ఇలా ఈ ఐదుగురు వీరులు సమష్టిగా పోరాడి భారత్‌కు ప్రపంచకప్‌ను అందించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
India Cricket Fearless Era : అప్పుడు విలన్లు.. ఇప్పుడు హీరోలు ! అసలు మాస్టర్ మైండ్ కథ ఇది !
Recommended image2
T20 World Cup 2026 ఛాంపియన్‌గా భారత్.. విన్నింగ్ మూమెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved