MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricketers Love stories : క్రికెట్ కింగ్స్.. బాలీవుడ్ క్వీన్స్ ! ఈ క్రేజీ జంటల గురించి మీకు తెలుసా?

Cricketers Love stories : క్రికెట్ కింగ్స్.. బాలీవుడ్ క్వీన్స్ ! ఈ క్రేజీ జంటల గురించి మీకు తెలుసా?

Cricket and Bollywood Love Stories : క్రికెట్, బాలీవుడ్ మధ్య విడదీయలేని బంధం ఉంది. విరాట్ కోహ్లీ నుంచి కేఎల్ రాహుల్ వరకు బాలీవుడ్ భామలను పెళ్లాడిన ప్రముఖ క్రికెటర్ల లవ్ స్టోరీల వివరాలు మీకోసం..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 11 2026, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
వెండితెర భామల మనసు గెలిచిన టీమిండియా స్టార్ క్రికెటర్లు వీరే
Image Credit : our own

వెండితెర భామల మనసు గెలిచిన టీమిండియా స్టార్ క్రికెటర్లు వీరే

ఇండియాలో మస్తు క్రేజ్ ఉన్న రంగాలు రెండే రెండు. ఒకటి క్రికెట్, రెండోది సినిమా. ఈ రెండింటి మధ్య విడదీయలేని అనుబంధం దశాబ్దాలుగా కొనసాగుతోంది. మైదానంలో పరుగుల వర్షం కురిపించే క్రికెటర్లు, వెండితెరపై మెరిసే అందాల భామల ప్రేమలో పడటం కొత్తేమీ కాదు. పటౌడీ కాలం నుండి నేటి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వరకు ఎందరో ఆటగాళ్లు బాలీవుడ్ హీరోయిన్లను వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లాడి, కొత్త జీవితాన్ని ప్రారంభించిన టాప్ 5 క్రికెటర్ల లిస్టు గమనిస్తే..

27
1. విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ
Image Credit : Instagram/fan page

1. విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శర్మల జోడీ అత్యంత ప్రజాదరణ పొందింది. వీరిద్దరూ 2013లో ఒక షాంపూ యాడ్ షూటింగ్ సమయంలో మొదటిసారి కలుసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల పాటు రహస్యంగా ప్రేమలో ఉన్న ఈ జంట, 2017 డిసెంబర్ 11న ఇటలీలోని టస్కానీలో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె వామిక (2021లో జననం), కుమారుడు అకాయ్ (2024లో జననం) ఉన్నారు. వీరిద్దరినీ అభిమానులు ముద్దుగా విరుష్క అని పిలుచుకుంటారు.

Related Articles

Related image1
IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !
Related image2
IND vs PAK : జై షా మైండ్ గేమ్.. దెబ్బకు ఏకాకిగా మారిన పాకిస్తాన్.. మైండ్ బ్లాక్ అంతే మరి !
37
2. కేఎల్ రాహుల్ - అతియా శెట్టి
Image Credit : Asianet News

2. కేఎల్ రాహుల్ - అతియా శెట్టి

ప్రస్తుత భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిల వివాహం 2023 జనవరి 23న జరిగింది. 2019లో ఒక ఉమ్మడి స్నేహితుడి ద్వారా వీరి పరిచయం ఏర్పడింది. సుమారు నాలుగేళ్ల డేటింగ్ తర్వాత, ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఇటీవల 2024 మార్చిలో ఈ జంటకు ఇవారా విపుల రాహుల్ అనే కుమార్తె జన్మించింది. అతియా తరచుగా స్టేడియంలో రాహుల్‌ను ఉత్సాహపరుస్తూ కనిపిస్తుంటుంది.

47
3. యువరాజ్ సింగ్ - హేజల్ కీచ్
Image Credit : our own

3. యువరాజ్ సింగ్ - హేజల్ కీచ్

సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్, బాడీగార్డ్ సినిమా ఫేమ్ హేజల్ కీచ్ ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంటుంది. హేజల్ మనసు గెలవడానికి యువరాజ్ చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. ఒక ఉమ్మడి స్నేహితుడి పార్టీలో కలిసిన వీరు, ఆ తర్వాత కొన్నాళ్లు డేటింగ్ చేశారు. 2015 నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, 2016లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి కుమారుడు ఓరియన్ (2022), కుమార్తె ఆరా (2023) ఉన్నారు. హేజల్ బ్రిటన్-మారిషస్ సంతతికి చెందిన నటి కావడం విశేషం.

57
4. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ - షర్మిల ఠాగూర్
Image Credit : our own

4. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ - షర్మిల ఠాగూర్

క్రికెట్-బాలీవుడ్ బంధానికి పునాది వేసిన జంటగా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (టైగర్ పటౌడీ), షర్మిల ఠాగూర్ నిలుస్తారు. 1965లో ఢిల్లీలో జరిగిన ఒక పార్టీలో వీరి పరిచయం జరిగింది. వేర్వేరు మతాలు, సంస్కృతులు అయినప్పటికీ, అన్ని అడ్డంకులను అధిగమించి 1968 డిసెంబర్ 27న వివాహం చేసుకున్నారు. వీరి సంతానమే ప్రముఖ నటులు సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్, సబా అలీ ఖాన్. టైగర్ పటౌడీ 2011లో కన్నుమూశారు.

67
5. హర్భజన్ సింగ్ - గీతా బస్రా
Image Credit : our own

5. హర్భజన్ సింగ్ - గీతా బస్రా

టర్బనేటర్ హర్భజన్ సింగ్ ది ట్రైన్ చిత్రంలోని ఒక పాటలో గీతా బస్రాను చూసి ఫిదా అయ్యారు. సుమారు ఒక నెల రోజుల పాటు ఆమె వెంటపడి స్నేహం సంపాదించారు. 2015లో పంజాబ్‌లోని జలంధర్‌లో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె హినాయ హీర్ ప్లాహా (2016), కుమారుడు జోవన్ వీర్ సింగ్ ప్లాహా (2021) ఉన్నారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తమ కుటుంబ విశేషాలను పంచుకుంటారు.

77
ఇతర ప్రముఖ జంటలు కూడా ఉన్నాయి..
Image Credit : our own

ఇతర ప్రముఖ జంటలు కూడా ఉన్నాయి..

• జహీర్ ఖాన్ - సాగరిక ఘాట్గే: చక్ దే ఇండియా నటి సాగరికను టీమిండియా ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ 2017లో వివాహం చేసుకున్నారు. వీరికి 2024 ఏప్రిల్‌లో ఫతేసింగ్ ఖాన్ అనే కుమారుడు జన్మించాడు.

• మహమ్మద్ అజారుద్దీన్ - సంగీత బిజ్లానీ: మాజీ కెప్టెన్ అజారుద్దీన్ 1996లో నటి సంగీత బిజ్లానీని వివాహం చేసుకున్నారు. అయితే వీరి 14 ఏళ్ల బంధం 2010లో విడాకులతో ముగిసింది.

• మొహ్సిన్ ఖాన్ - రీనా రాయ్: పాకిస్థాన్ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్ భారత నటి రీనా రాయ్‌ను 1983లో పెళ్లాడారు. వీరికి సనా ఖాన్ అనే కుమార్తె ఉంది. కానీ 1992లో వీరు విడిపోయారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
24 గంటల్లో 4గురు అవుట్.! టీ20 వరల్డ్‌కప్‌లో ఆ జట్లకు టెన్షన్.. టెన్షన్..
Recommended image2
ఎవడు మమ్మీ వీడు.! కేవలం 44 బంతుల్లోనే కాటేరమ్మ కొడుకు రికార్డు బద్దలు కొట్టేశాడు.. ఎవరంటే.?
Recommended image3
T20 World Cup 2026 నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు ఔట్.. బ్రేస్‌వెల్, హసరంగకు ఏమైంది?
Related Stories
Recommended image1
IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !
Recommended image2
IND vs PAK : జై షా మైండ్ గేమ్.. దెబ్బకు ఏకాకిగా మారిన పాకిస్తాన్.. మైండ్ బ్లాక్ అంతే మరి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved