MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !

IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !

India vs Namibia : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 12న నమీబియాతో జరగనున్న మ్యాచ్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. అభిషేక్ శర్మ అస్వస్థత, వాషింగ్టన్ సుందర్ రీఎంట్రీ వంటి కీలక మార్పులతో భారత్ బరిలోకి దిగనుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 09 2026, 07:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నమీబియాతో పోరుకు భారత్ రెడీ.. ప్లేయింగ్ 11లో వాషింగ్టన్ సుందర్ ఎంట్రీ?
Image Credit : Getty

నమీబియాతో పోరుకు భారత్ రెడీ.. ప్లేయింగ్ 11లో వాషింగ్టన్ సుందర్ ఎంట్రీ?

టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. అమెరికాపై ఘనవిజయంతో టోర్నీని ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, ఇప్పుడు తన తదుపరి పోరుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 12వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సూర్యకుమార్ అద్భుత ఇన్నింగ్స్.. అమెరికాపై విజయం
Image Credit : Getty

సూర్యకుమార్ అద్భుత ఇన్నింగ్స్.. అమెరికాపై విజయం

అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచితంగా పోరాడి జట్టును ఆదుకున్నాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. ఒక దశలో 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను సూర్య తన బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 161/9 పరుగులు చేయగా, అమెరికా 132 పరుగులకే పరిమితమైంది.

35
అభిషేక్ శర్మకు విశ్రాంతి.. సంజూ శామ్సన్‌కు ఛాన్స్?
Image Credit : Getty

అభిషేక్ శర్మకు విశ్రాంతి.. సంజూ శామ్సన్‌కు ఛాన్స్?

తొలి మ్యాచ్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. అయితే, అతను ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ, చిన్న జట్టు అయిన నమీబియాతో జరిగే మ్యాచ్‌లో అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వంటి వారు అమెరికాపై తక్కువ పరుగులకే పరిమితమైన నేపథ్యంలో శాంసన్ రాక జట్టుకు బలాన్నిస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.

45
వాషింగ్టన్ సుందర్ గ్రాండ్ కంబ్యాక్
Image Credit : Getty

వాషింగ్టన్ సుందర్ గ్రాండ్ కంబ్యాక్

గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన తమిళనాడు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మళ్లీ జట్టులోకి రానున్నాడు. అతను పూర్తిగా ఫిట్‌నెట్ సాధించాడని, ఢిల్లీలో నేరుగా జట్టుతో కలుస్తాడని కెప్టెన్ స్పష్టం చేశాడు. సుందర్ రాకతో ఆల్‌రౌండర్ శివమ్ దూబేపై వేటు పడే అవకాశం ఉంది. ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే అంచనాల నేపథ్యంలో, ఆఫ్ స్పిన్నర్ అయిన సుందర్ జట్టుకు కీలకం కానున్నాడు.

55
బుమ్రా వచ్చేస్తున్నాడు.. మహమ్మద్ సిరాజ్ అవుట్?
Image Credit : Getty

బుమ్రా వచ్చేస్తున్నాడు.. మహమ్మద్ సిరాజ్ అవుట్?

జ్వరం కారణంగా అమెరికా మ్యాచ్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. నమీబియాతో జరిగే పోరులో అతను బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, బుమ్రా జట్టులోకి వస్తే ఎవరిని తొలగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అమెరికాపై 3 వికెట్లు తీసి మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన మహమ్మద్ సిరాజ్ లేదా నిలకడగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్‌లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం సిరాజ్‌నే తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నమీబియాతో తలపడే భారత అంచనా తుది జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
T20 World Cup: పాకిస్థాన్ బాయ్‌కాట్ డ్రామాలో బిగ్ ట్విస్ట్.. ఐసీసీ మీటింగ్‌లో ఏం జరిగింది?
Recommended image2
Abhishek Sharma : తెలుగింటి అల్లుడి విధ్వంసం.. అభిషేక్ శర్మ ఎందుకు స్పెషలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved