MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • IND vs ENG: ఫైనల్ చేరాలంటే ఈ మార్పులు తప్పవు.. టీమిండియా నయా ఆర్మీ ఇదే !

IND vs ENG: ఫైనల్ చేరాలంటే ఈ మార్పులు తప్పవు.. టీమిండియా నయా ఆర్మీ ఇదే !

IND vs ENG : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ కోసం భారత్ సిద్ధమవుతోంది. అయితే, ఈ బిగ్ ఫైట్ కోసం టీమ్ ఇండియాలో విజయం సాధించాలంటే 3 మార్పులు చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 03 2026, 07:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వాంఖడేలో భారత్ vs ఇంగ్లాండ్ హైవోల్టేజ్ పోరు.. టీమిండియాలో ఊహించని మార్పులు
Image Credit : Getty

వాంఖడేలో భారత్ vs ఇంగ్లాండ్ హైవోల్టేజ్ పోరు.. టీమిండియాలో ఊహించని మార్పులు

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన సూపర్-8 చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అద్భుత విజయం సాధించిన భారత్, ఇప్పుడు సెమీ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. మార్చి 5, గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరాలని భారత్ పట్టుదలగా ఉంది. అయితే, బలమైన ఇంగ్లాండ్ జట్టును ఎదుర్కోవడానికి టీమ్ మేనేజ్‌మెంట్ మూడు కీలక వ్యూహాత్మక మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సంజూ శాంసన్ మెరుపులు.. సెమీస్‌లో భారత్
Image Credit : Getty

సంజూ శాంసన్ మెరుపులు.. సెమీస్‌లో భారత్

సూపర్-8లో వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 97 పరుగులు చేసి భారత్‌ను గెలిపించారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇది అత్యుత్తమ రన్ ఛేజ్ కావడం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ ఆరోసారి టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు తన మూడు సూపర్-8 మ్యాచ్‌లలోనూ విజయం సాధించి అగ్రస్థానంతో సెమీస్‌కు వచ్చింది.

36
అభిషేక్ శర్మ స్థానంలో రింకూ సింగ్?
Image Credit : ANI

అభిషేక్ శర్మ స్థానంలో రింకూ సింగ్?

యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. మూడు సార్లు డకౌట్ అయిన అతను, వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కూడా కేవలం 10 పరుగులకే వెనుదిరిగారు. సెమీ ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన రింకూ సింగ్‌ను జట్టులోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రింకూ జట్టులోకి వస్తే, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫినిషర్‌గా రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలతో భారత బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం అవుతుంది.

46
వరుణ్ చక్రవర్తి బదులు కుల్దీప్ యాదవ్
Image Credit : AFP

వరుణ్ చక్రవర్తి బదులు కుల్దీప్ యాదవ్

ఈ టోర్నీలో వరుణ్ చక్రవర్తి ఇప్పటివరకు 12 వికెట్లు తీసినప్పటికీ, గత మూడు మ్యాచ్‌లలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లలో అతను 40కి పైగా పరుగులు ఇచ్చారు. ప్రత్యర్థి బ్యాటర్లు అతని బౌలింగ్‌ను సులభంగా ఎదుర్కొంటున్న తరుణంలో, మాయా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవడం మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్లు లెగ్ స్పిన్ ఆడటంలో తడబడతారు కాబట్టి, కుల్దీప్ కీలకం కానున్నారు.

56
అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మహమ్మద్ సిరాజ్
Image Credit : Getty

అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మహమ్మద్ సిరాజ్

పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ టోర్నీలో పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమయ్యారు. దీనితో డెత్ ఓవర్లలో అనుభవం ఉన్న మహమ్మద్ సిరాజ్‌ను సెమీస్‌లో ఆడించే అవకాశం ఉంది. వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ 3/29తో రాణించారు. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిరాజ్ జట్టులోకి వస్తే భారత బౌలింగ్ విభాగం మరింత బలంగా మారుతుంది.

66
IND vs ENG సెమీ ఫైనల్ పోరుకు ముంబై రెడీ
Image Credit : Getty

IND vs ENG సెమీ ఫైనల్ పోరుకు ముంబై రెడీ

భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ మార్చి 5న ముంబైలో జరుగుతుంది. అంతకంటే ముందు, మార్చి 4న కోల్‌కతాలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరగనుంది. వాంఖడేలో టాస్ గెలిచిన జట్టుకు సానుకూలత ఉండే అవకాశం ఉంది. మరి ఈ మూడు కీలక మార్పులతో టీమిండియా ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరుతుందో లేదో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Related Stories
Recommended image1
Sanju Samson: టీమిండియాకు బిగ్ షాక్.. సంజూ శాంసన్ పై బ్యాన్? ‎
Recommended image2
T20 World Cup 2026 సెమీ ఫైనల్: మ్యాచ్ వర్షంతో రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved