MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • T20 World Cup 2026 : అభిషేక్ ఔట్? సంజూ ఇన్.. టీమిండియాలో భారీ మార్పులు

T20 World Cup 2026 : అభిషేక్ ఔట్? సంజూ ఇన్.. టీమిండియాలో భారీ మార్పులు

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. వరుసగా మూడు సార్లు డకౌట్ అయిన ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 19 2026, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అహ్మదాబాద్ లో రణరంగం.. ప్రతీకారం తీర్చుకునేందుకు సూర్యసేన సిద్ధం
Image Credit : ANI

అహ్మదాబాద్ లో రణరంగం.. ప్రతీకారం తీర్చుకునేందుకు సూర్యసేన సిద్ధం

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్, నెదర్లాండ్స్‌పై ఘనవిజయం సాధించి సూపర్-8 దశలోకి దూసుకెళ్లింది. ఫిబ్రవరి 22, ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత్ తన మొదటి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ కీలక పోరుకు ముందు ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హ్యాట్రిక్ డకౌట్లతో అభిషేక్ శర్మ చెత్త రికార్డు
Image Credit : Getty

హ్యాట్రిక్ డకౌట్లతో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ ప్రపంచకప్‌లో ఘోరమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో అతను వరుసగా మూడు సార్లు సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం మూడు బంతులు ఆడి ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన భారత తొలి ఆటగాడిగా అభిషేక్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. పవర్‌ప్లేలో జట్టుకు దూకుడైన ఆరంభాన్ని ఇవ్వాల్సిన ఓపెనర్ ఇలా వరుసగా విఫలం కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

36
సంజూ శాంసన్‌కు లైఫ్ లైన్ దొరికేనా?
Image Credit : Getty

సంజూ శాంసన్‌కు లైఫ్ లైన్ దొరికేనా?

అభిషేక్ శర్మ వరుస వైఫల్యాల నేపథ్యంలో సంజూ శాంసన్‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. గతంలో అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా దూరమైనప్పుడు నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో శాంసన్‌కు అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లో సంజూ కేవలం 8 బంతుల్లోనే 22 పరుగులు చేసి తన మార్కును చూపించాడు. 

ముఖ్యంగా దక్షిణాఫ్రికాపై సంజూ శాంసన్‌కు మెరుగైన రికార్డు ఉంది. సౌతాఫ్రికాతో ఆడిన 5 టీ20 మ్యాచ్‌ల్లో అతను 63.25 సగటుతో, 190.22 స్ట్రైక్ రేట్‌తో 253 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉండటం విశేషం. ఈ గణాంకాలు సెలెక్టర్లను ఆలోచనలో పడేస్తున్నాయి.

46
తుది జట్టులోకి అక్షర్ పటేల్ రీఎంట్రీ
Image Credit : Getty

తుది జట్టులోకి అక్షర్ పటేల్ రీఎంట్రీ

సౌతాఫ్రికాతో జరగనున్న కీలక మ్యాచ్ కోసం భారత జట్టులో కొన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్ స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు దూరమైన అక్షర్, సూపర్-8 వంటి పెద్ద మ్యాచుల్లో కీలకం కానున్నాడు.

 ఇక శివమ్ దూబే బౌలింగ్‌లో రాణిస్తుండటంతో భారత్ ఆరో బౌలింగ్ ఆప్షన్‌ను కలిగి ఉంది. దీంతో రింకూ సింగ్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తుండటం భారత్‌కు పెద్ద ఊరట.

56
భారత బౌలింగ్ విభాగంలో సవాళ్లు
Image Credit : Getty

భారత బౌలింగ్ విభాగంలో సవాళ్లు

భారత్ వరుస విజయాలు సాధిస్తున్నప్పటికీ, బౌలింగ్ విభాగంలో కొంత అనిశ్చితి కనిపిస్తోంది. వరుణ్ చక్రవర్తి మినహా మిగిలిన బౌలర్లు నిలకడగా రాణించలేకపోతున్నారు. జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంది. 

సూపర్-8 దశలో సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ వంటి బలమైన జట్లతో తలపడాల్సి ఉన్నందున బౌలర్ల ప్రదర్శన అత్యంత కీలకం కానుంది. ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో, మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది.

66
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు భారత్ తుది జట్టు అంచనా
Image Credit : Getty

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు భారత్ తుది జట్టు అంచనా

అభిషేక్ శర్మ/సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Recommended image2
Smriti Mandhana: బిగ్గెస్ట్ మైల్‌స్టోన్.. ప్రపంచంలో మొదటి ప్లేయర్‌గా స్మృతి మంధాన సరికొత్త రికార్డు
Recommended image3
Asian Games 2026: ఒకే రోజు రెండు సిల్వర్ మెడల్స్ కొట్టిన భారత షూటర్.. ఎవరీ ఎలావెనిల్ వలరివాన్?
Related Stories
Recommended image1
T20 World Cup 2026 సూపర్ 8 రచ్చ.. భారత్ మ్యాచ్‌లు ఎప్పుడు? పూర్తి షెడ్యూల్
Recommended image2
T20 World Cup : రోహిత్, ధోనీలకు సాధ్యం కానిది సూర్యకుమార్ సాధించాడు భయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved