MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • T20 World Cup : రోహిత్, ధోనీలకు సాధ్యం కానిది సూర్యకుమార్ సాధించాడు భయ్యా

T20 World Cup : రోహిత్, ధోనీలకు సాధ్యం కానిది సూర్యకుమార్ సాధించాడు భయ్యా

Suryakumar Yadav : టీ20ల్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ విన్ పర్సంటేజ్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 19 2026, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ధోనీ, రోహిత్ కంటే సూర్యనే తోపు.. కెప్టెన్సీలో ఆ ముగ్గురినీ పడగొట్టేసిన సూర్య
Image Credit : Getty

ధోనీ, రోహిత్ కంటే సూర్యనే తోపు.. కెప్టెన్సీలో ఆ ముగ్గురినీ పడగొట్టేసిన సూర్య

భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. టీమిండియా టీ20 సారథిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సూర్యకుమార్ యాదవ్ విజయ పరంపరను కొనసాగిస్తున్నాడు. మైదానంలో బ్యాట్‌తోనే కాకుండా, కెప్టెన్సీలోనూ తనదైన ముద్ర వేస్తూ దిగ్గజాల రికార్డులను తిరగరాస్తున్నాడు.

తాజాగా టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో సూర్య ఖాతాలో ఒక గొప్ప రికార్డు వచ్చి చేరింది. భారత క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కూడా సాధ్యం కాని ఘనతను సూర్యకుమార్ యాదవ్ సొంతం చేసుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ప్రపంచంలోనే నంబర్ వన్ కెప్టెన్‌గా సూర్య
Image Credit : Getty

ప్రపంచంలోనే నంబర్ వన్ కెప్టెన్‌గా సూర్య

టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాల శాతం కలిగిన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతను టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో భారత్ గెలిచిన వెంటనే సూర్య విన్ పర్సంటేజ్ 80.85కు చేరుకుంది. ఇప్పటి వరకు రోహిత్ శర్మ పేరిట ఉన్న 80.65 శాతాన్ని సూర్య అధిగమించాడు. ప్రపంచ వ్యాప్తంగా కనీసం 40 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్లలో సూర్యకుమార్ ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచాడు.

Related Articles

Related image1
Abhishek Sharma : సున్నాల హ్యాట్రిక్.. అభిషేక్ శర్మకు ఏమైంది?
Related image2
IND vs NED : దూబే శివతాండవం.. చక్రవర్తి స్పిన్ మాయకు నెదర్లాండ్స్‌ విలవిల
36
రోహిత్ శర్మ రికార్డు బద్ధలు
Image Credit : Getty

రోహిత్ శర్మ రికార్డు బద్ధలు

భారత జట్టును విజయవంతంగా నడిపించిన రోహిత్ శర్మ, మొత్తం 62 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా, అందులో 50 విజయాలు అందించాడు. 12 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. అయితే, సూర్యకుమార్ యాదవ్ కేవలం 47 మ్యాచ్‌ల్లోనే 38 విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. సూర్య కెప్టెన్సీలో భారత్ కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. దీంతో గణాంకాల పరంగా రోహిత్ శర్మ కంటే సూర్య ఎంతో మెరుగైన స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ (80.39%) ఉన్నాడు.

46
ఆసియా కప్ నుంచి వరల్డ్ కప్ దాకా..
Image Credit : Getty

ఆసియా కప్ నుంచి వరల్డ్ కప్ దాకా..

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తర్వాత భారత జట్టు వెనక్కి తిరిగి చూడలేదు. 2024లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సూర్య, అద్భుతమైన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అతని నాయకత్వంలోనే టీమిండియా ఆసియా కప్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ అదే జోరును కొనసాగిస్తోంది. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఘన విజయాలను సాధించి అజేయంగా నిలిచింది.

56
టీ20 ప్రపంచకప్‌లో అజేయ ప్రస్థానం
Image Credit : Getty

టీ20 ప్రపంచకప్‌లో అజేయ ప్రస్థానం

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా గ్రూప్ దశను ఘనంగా ముగించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి సూపర్-8 దశకు చేరుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో సూర్య సేన కలిసికట్టుగా రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొడుతూ విజయాలు అందుకుంది.

సూపర్-8లో భారత్ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండింటిలో విజయం సాధిస్తే టీమిండియా నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. సూర్య ఫామ్ చూస్తుంటే ఈసారి ప్రపంచకప్ భారత్ గెలవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

66
కెప్టెన్సీలో రికార్డుల మోత మోగిస్తున్న సూర్య
Image Credit : Getty

కెప్టెన్సీలో రికార్డుల మోత మోగిస్తున్న సూర్య

ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వంటి మేటి కెప్టెన్ల రికార్డులను దాటడం సామాన్యమైన విషయం కాదు. కానీ, సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో జట్టును నడిపిస్తూ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మైదానంలో ప్రశాంతంగా ఉంటూనే, వ్యూహాత్మక మార్పులతో ప్రత్యర్థులను దెబ్బకొట్టడంలో సూర్య సక్సెస్ అవుతున్నాడు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 38 విజయాలను అందించడం అతని నాయకత్వ పటిమకు నిదర్శనం. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక విన్ పర్సంటేజ్ కలిగిన కెప్టెన్‌గా సూర్య పేరు ఇప్పుడు శాశ్వతంగా నిలిచిపోనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
క్రికెట్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image3
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Related Stories
Recommended image1
Abhishek Sharma : సున్నాల హ్యాట్రిక్.. అభిషేక్ శర్మకు ఏమైంది?
Recommended image2
IND vs NED : దూబే శివతాండవం.. చక్రవర్తి స్పిన్ మాయకు నెదర్లాండ్స్‌ విలవిల
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved