- Home
- Life
- Spiritual
- కోటి రూపాయలు ఇచ్చినా సరే.. ఈ 7 ప్రదేశాలకు అస్సలు వెళ్లకండి. చాణక్య ఇలా ఎందుకు చెప్పారంటే
కోటి రూపాయలు ఇచ్చినా సరే.. ఈ 7 ప్రదేశాలకు అస్సలు వెళ్లకండి. చాణక్య ఇలా ఎందుకు చెప్పారంటే
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మానవ జీవనాన్ని లోతుగా విశ్లేషించిన మహానుభావుడు. వ్యక్తి జీవితంలో ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు అన్న విషయంపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ 7 చోట్లకు వెళ్లకూడదు.

ఎందుకు ఇలా చెప్పారు.?
ప్రతి పిలుపు గౌరవాన్ని సూచించదు. కొన్ని సందర్భాల్లో మన సమయం, శ్రమ, మనశ్శాంతి వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే చాణక్యుడు కొన్ని ప్రదేశాల విషయంలో ముందుగానే హెచ్చరిక చేశాడు. ఇవి వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే పరిస్థితులు అని ఆయన భావన.
చాణక్యుడు వెళ్లవద్దన్న ఏడు ప్రదేశాలు ఏంటి.?
అవమానం ఎదురయ్యే చోటు:
గౌరవాన్ని తగ్గించే మాటలు, ప్రవర్తన కనిపించే ప్రదేశానికి దూరంగా ఉండాలి. స్వాభిమానం కోల్పోతే జీవితం దిశ తప్పుతుంది.
అనవసర వాదనలు నడిచే చోటు:
వినే మనసు లేకుండా వాదనలే లక్ష్యంగా ఉండే ప్రదేశం మానసిక శక్తిని హరించేస్తుంది. అందుకే ఇలాంటి ప్రదేశాలకు, వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిది
చెడు సాంగత్యం ఉన్న ప్రదేశం:
దుష్ట ఆలోచనలు, కుట్రలు, అసత్య మార్గాలు కనిపించే చోటు మనకూ చెడు అలవాట్లు అలవడే ప్రమాదం ఉంటుంది.
నమ్మకం లేని చోట:
ధనం మాత్రమే కాదు, సమయం, నమ్మకం, శ్రమ కూడా విలువైనవే. వాటికి గౌరవం లేని చోటు దూరంగా ఉండాలి.
న్యాయం లేని అధికార కేంద్రాలు:
ధర్మం పాటించని అధికారుల దగ్గర పరిష్కారం దొరకదు. అక్కడికి వెళ్లడం వల్ల సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.
నేర్చుకునే ఆసక్తి లేని ప్రదేశం:
జ్ఞానం చెప్పినా వినని చెవులు ఉన్న చోటు మన ప్రయత్నాన్ని వృథా చేస్తుంది. అందుకే నేర్చుకునే అలవాటు లేని వారితో సాన్నిహిత్యం మంచిది కాదు.
స్వార్థంతో నిండిన సంబంధాలు:
అవసరం ఉన్నప్పుడే దగ్గరవుతూ, ఉపయోగం తీరాక దూరమయ్యే బంధాలు మన భావోద్వేగాలను గాయపరుస్తాయి. ఇలాంటి వారికి దూరండా ఉండాలి.
ఈ నీతి ద్వారా చాణక్యుడు చెప్పిన అసలు సందేశం
మన జీవితం విలువైనది. దాన్ని ఎవరికి, ఎక్కడ ఖర్చు చేయాలో ఆలోచన అవసరం. పిలుపు పెద్దదా? లేక మన ప్రశాంతత పెద్దదా? అన్న ప్రశ్నకు సమాధానం తెలిసినవాడే నిజమైన విజ్ఞుడు అని చాణక్యుడు సూచించాడు.
నేటి కాలంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యం
సోషల్ మీడియా, ఆఫీస్ రాజకీయాలు, నకిలీ బంధాలు నిండిన ఈ కాలంలో చాణక్య నీతి మరింత అవసరంగా మారింది. ప్రతి ఆహ్వానం ఆమోదించాల్సిన అవసరం లేదు. సంబంధం కన్నా స్వాభిమానం ముఖ్యం. సాంగత్యం కన్నా మనశ్శాంతి ముఖ్యం. అందుకే చాణక్యుడు పిలిచినా ఈ ఏడు చోట్లకు వెళ్లవద్దని స్పష్టంగా చెప్పాడు.

