Zodiac Sign: ఈ రెండు రాశులవారు పెళ్లి చేసుకుంటే ఇంట్లో రోజూ గొడవలే!
పెళ్లి బంధం చాలా ప్రత్యేకమైనది. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి బతకడానికి వారి మధ్య సఖ్యత చాలా అవసరం. అయితే జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశులవారి మధ్య బంధం అస్సలు నిలబడదట. వారెప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారట. మరి ఏ రెండు రాశులవారికి పడదో ఇక్కడ చూద్దాం.

మంచి జంటలుగా ఉండలేని రాశులు..
పెళ్లి జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తేనే సంతోషంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు ఇద్దరి గుణాలు బాగున్నా వారి మధ్య బంధం చెడిపోతుంటుంది. దీనికి కారణం వారి రాశిచక్రాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల జంటలు.. విలువలు, ప్రాధాన్యతల్లో తేడాల వల్ల చాలా సవాళ్లను ఎదుర్కొంటారు. అలాంటి జంటల మధ్య ఏ విషయంలోనూ పొసగదు. మరి ఏ రాశులవారు మంచి జంటలుగా ఉండలేరో ఇక్కడ తెలుసుకుందాం.
మేష, కర్కాటక రాశులు:
మేష రాశి వారు బలమైన, స్వతంత్ర స్వభావం కలిగిన వ్యక్తులు. కానీ కర్కాటక రాశి వారు సున్నితమైన, భావోద్వేగ స్వభావం కలిగినవారు. ఇద్దరి వ్యతిరేక గుణాల వల్ల ఈ జంట మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది.
వీరి స్వభావం ఎలా ఉంటుందంటే?
జ్యోతిష్య ప్రకారం మేష రాశి వారు ఏ విషయాన్ని అయినా నేరుగా మాట్లాడటం వల్ల కర్కాటక రాశి వారు బాధ పడచ్చు. ఇది అపార్థాలకు దారితీయచ్చు. వీరు మాట్లాడే విధానం, భావోద్వేగ స్వభావంలో తేడాలు ఉండటం వల్ల వీరి మధ్య బంధం ఎక్కువకాలం నిలబడదు.
వృషభ, కుంభ రాశులు:
వృషభ రాశి వారు స్థిరత్వం, సంప్రదాయాన్ని గౌరవిస్తారు. కానీ కుంభ రాశి వారు స్వతంత్రంగా ఉంటారు. సంప్రదాయాలను పెద్దగా నమ్మరు. ఈ కారణంగా ఈ రెండు రాశుల జంటలు పెళ్లి బంధంలో ఇబ్బంది పడతారు.
ఈ రాశుల మధ్య తేడాలు..
వృషభ రాశి వారు సంబంధంలో భద్రత కోరుకుంటారు. కుంభ రాశి వారు స్వేచ్ఛ కోరుకుంటారు. ఈ రాశివారి అనూహ్య, భిన్న స్వభావం వృషభ రాశివారికి ఇబ్బంది కలిగిస్తుంది. ప్రాధాన్యతలు, జీవనశైలిలో తేడాల గురించి ఈ రాశుల జంటల మధ్య ప్రతిరోజూ గొడవ జరిగే అవకాశం ఉంది.
మిథున, కన్య రాశులు:
మిథున రాశి వారు సామాజికంగా ఉంటారు. ఏ పరిస్థితికైనా సర్దుకుపోతారు. కానీ కన్య రాశి వారు ఆచరణాత్మకంగా ఉంటారు. ప్రతిదీ ఆలోచించి చేస్తారు. ఈ కారణంగా ఈ జంట మధ్య బంధం బీటలు వారే అవకాశం ఉంది. కన్య రాశి వారి విమర్శనాత్మక స్వభావం.. మిథున రాశి వారిపై ప్రభావం చూపవచ్చు.
సింహ, వృశ్చిక రాశులు:
సింహ రాశి వారు.. అందరూ తమనే గమనించాలి. తమనే పొగడాలనే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కానీ కర్కాటక రాశి వారు రహస్యం, లోతైన భావోద్వేగ సంబంధానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ కారణంగా ఈ రాశులవారి మధ్య చాలాసార్లు భిన్నాభిప్రాయాలు తలెత్తవచ్చు.
తుల, మకర రాశులు:
తుల రాశి వారు సంబంధాల్లో సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తారు. సామాజికంగా ఉండటానికి ఇష్టపడతారు. కానీ మకర రాశి వారు వారి పని, భవిష్యత్ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రాధాన్యతల్లో తేడాల వల్ల ఈ జంట మధ్య కొన్నిసార్లు బంధం బీటలు వారే అవకాశం ఉంది.