- Home
- Astrology
- Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి స్వార్థం ఎక్కువ.. జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు!
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి స్వార్థం ఎక్కువ.. జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు!
సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ బట్టి వ్యక్తుల స్వభావం మారుతూ ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు నిస్వార్థంగా ఉంటే.. మరికొన్ని తేదీల్లో పుట్టిన వారికి విపరీతమైన స్వార్థం ఉంటుంది. అలాంటి వారితో జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు.

ఏ తేదీల్లో పుట్టిన వారు స్వార్థపరులు?
సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల లక్షణాలను అంచనా వేయచ్చు. కొన్ని తేదీల్లో పుట్టినవారు నిజాయతీగా ఉంటారు. మరికొన్ని తేదీల్లో పుట్టినవారు నిస్వార్థంగా ఉంటారు. ఇంకొన్ని తేదీల్లో జన్మించిన వారు స్వార్థంగా ఆలోచిస్తారు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు స్వార్థంతో ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.
8, 17, 26 తేదీల్లో పుట్టినవారు..
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు స్వార్థంగా ఉంటారట. ఈ తేదీల్లో పుట్టినవారికి శని పాలకుడిగా ఉంటాడు. వీరు ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. భావోద్వేగాల కంటే లాజిక్ కి ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. దీర్ఘకాల స్థిరత్వం కోరుకుంటారు. అందుకోసం కొన్నిసార్లు స్వార్థంగా ఆలోచిస్తారు.
7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు..
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారిపై కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు అంతర్ముఖులు. ఏ విషయాన్ని అంత తొందరగా బయటపెట్టరు. వారు నమ్మే దారిలోనే నడుస్తారు. ఇతరుల భావాల గురించి ఏమాత్రం పట్టించుకోరు. ఈ తేదీల్లో పుట్టినవారు ఏ పనిలోనైనా.. వారికి మేలు జరిగిందా లేదా అనేదే చూసుకుంటారు. దానివల్ల ఇతరులకు నష్టం కలిగినా పెద్దగా పట్టించుకోరు.
1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు..
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారిపై సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టినవారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వారి అభిప్రాయానికే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. స్వార్థంగా ఆలోచిస్తారు. వారి ప్రయోజనం చూసుకున్నాకే మిగతా వారి గురించి ఆలోచిస్తారు.
గమనిక
ఈ సమాచారం... పాఠకుల ఆసక్తి మేరకు పలువురు పండితుల సూచనల ఆధారంగా అందించింది మాత్రమే. ఒక వ్యక్తి స్వార్థంగా మారటం వెనక మానసిక పరిస్థితి, పరిసరాలు, అనుభవాలు, కుటుంబ పరిస్థితులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోవాలి.