పురుషుల కంటే ఆడవాళ్లకే తక్కువ భావప్రాప్తి.. కారణమేంటంటే?
పురుషులు సెక్స్ లో పాల్గొన్న ప్రతి సారి క్లైమాక్స్ కు చేరుకుంటారు. కానీ మహిళల విషయంలో ఇలా జరగదు. ఆడవారు ప్రతిసారి భావప్రాప్తిని పొందలేరు. దీనికి కారణమేంటంటే?
చాలా మందికి సెక్స్ లో ఉద్వేగం ఇతర భావోద్వేగాల కంటే మంచి అనుభూతిని కలిగిస్తుంది. వివరించలేని ఆనందాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి ఉద్వేగం విషయానికొస్తే మహిళలు పురుషుల కంటే చాలా భిన్నమైన ఫ్రీక్వెన్సీ, ప్రభావాన్ని పొందుతారట. అంటే పురుషుల్లాగ సెక్స్ లో పాల్గొన్న ప్రతిసారి భావోద్వేగాన్ని పొందలేరు. ఇలా ఎందుకు జరుగుతుందంటే?
ఉద్వేగం మహిళలకు ఎందుకు భిన్నంగా ఉంటుంది?
దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కొన్ని సాధారణ కారకాలు: లైంగిక కోరికలు తగ్గడం, నొప్పి లేదా మానసిక ఆరోగ్యం బాగాలేకపోవడం. అయితే మహిళల్లో భావప్రాప్తి ఆనందాన్ని తక్కువగా పొందడం వెనుకున్న కారణాలను పరిశీలించే ఎన్నో అధ్యయనాలు కూడా ఉన్నాయి.
ఉద్వేగాన్ని పొందకపోవడానికి ఒత్తిడి, ఆందోళనలు ప్రధానకారణాలని పలు అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. జర్నల్ ఆఫ్ సెక్స్ అండ్ మారిటల్ థెరపీ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. 58 శాతం మంది మహిళలు ఒత్తిడి, ఆందోళన లేదా రెండింటి కలయిక కారణంగా భావప్రాప్తిని చేరుకోవడంలో విఫలమవుతున్నారని నివేదించారు.
ఇదే అధ్యయనంలో 48 శాతం మంది మహిళలు ఉద్వేగం లేదా ఉద్దీపన లేకపోవడం వల్ల తక్కువ ఉద్వేగాన్ని అనుభవిస్తారని కనుగొన్నారు. నెగిటీవ్ బాడీ ఇమేజ్ వంటి ఇతర అంశాలు కూడా 28 శాతం మంది మహిళల తక్కువ భావప్రాప్తికి కారణమయ్యాయి. దీనికి తోడు నొప్పి, లూబ్రికేట్ లేకపోవడం వల్ల 25 నుంచి 24 శాతం మంది మహిళలు భావప్రాప్తికి చేరుకోలేకపోతున్నారని అధ్యయనం వెల్లడించింది.
అయితే పైన పేర్కొన్న కొన్ని అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని అధ్యయనం నొక్కి చెప్పింది. ఉదాహరణకు మీరు ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు సెక్స్ పట్ల కోరికలు మొత్తమే రావు. నిజానికి ఒత్తిడి, ఆందోళన ఇప్పటికే ఉద్వేగం లేకపోవడంతో ముడిపడి ఉన్నాయి. దీనికితోడు బాడీ ఇమేజ్ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న మహిళలు కూడా ఒత్తిడి, ఆందోళనలకు ఎక్కువగా గురవుతారు.
మరో అధ్యయనం ప్రకారం..
జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. లైంగిక ధోరణి కూడా భావప్రాప్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. స్ట్రెయిట్ లేదా స్వలింగ సంపర్క మహిళల్లో 62 శాతం మంది మాత్రమే భావప్రాప్తికి చేరుకుంటారు. కానీ స్వలింగ సంపర్క మహిళలు భావప్రాప్తిని సాధించే రేటు 75 శాతం. అయితే మహిళలు ఎందుకు తక్కువ భావప్రాప్తిని అనుభవిస్తారనేదానికి ఒకే సమాధానం లేదు. కానీ దీనికి పైన పేర్కొన్న అంశాలు కూడా కారణమవుతాయంటున్నారు నిపుణులు.