విఘ్నేష్ శివన్ ఆస్తుల వివరాలు... నయనతార భర్త ఎంత సంపాధించాడో తెలుసా..?
ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హీరోయిన్ నయనతార భర్త, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆస్తులు ఎన్ని..? అతను ఎంత సంపాధిస్తున్నాడో తెలుసా..?
విఘ్నేష్ శివన్ 2012లో సింబు నటించిన 'పోడ పోడి' సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి, 'నానుం రౌడీ ధాన్' మూవీతో పేరు తెచ్చుకున్నారు. 'తాన సెరంద కూట్టం', 'కాతువాకుల రెండు కాదల్' చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు.
Also Read: కీర్తి సురేష్ - శివకార్తికేయన్ లవ్ స్టోరీ నిజమేనా..? బ్రేకప్ కి కారణం ఎంటో తెలుసా !
దర్శకత్వం మాత్రమే కాదు.. మల్టీ టాలెంట్ చూపించాడు విఘ్నేష్. డైెరెక్షన్ కాకుండా, విఘ్నేష్ శివన్ 'వేలైల్లా పట్టధారి'లో నటించారు. అజిత్, విజయ్, రజనీకాంత్, సూర్య వంటి స్టార్లకు అనేక హిట్ పాటలు రాశారు.
Also Read: రాజమౌళిని పోరా అంటూ అవమానించింది ఎవరు, జక్కన్న మర్చిపోలేని సంఘటన
నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా కంటే.. నయనతార భర్తగానే ఎక్కువ పేమస్ అవుతున్నాడు ఈ కుర్ర డైరెక్టర్. నానుం రౌడీ ధాన్' సెట్స్‌లో ప్రేమలో పడి, ఏడేళ్లు సహజీవనం తర్వాత 2022లో వివాహం చేసుకున్నారు.
Also Read: జపాన్ -చైనాలో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?
పెళ్లైన నాలుగు నెలల తర్వాత, విఘ్నేష్ శివన్, నయనతార సరోగసీ ద్వారా కవల పిల్లలు పొందారు. వారి పేర్లు ఉయిర్, ఉలగ్. పెళ్లి తర్వాత ఇద్దరూ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు.
విఘ్నేష్ శివన్ మొదట అజిత్ సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉండగా, క్రియేటివ్ భేదాల కారణంగా మాగిజ్ తిరుమేనిని నియమించారు. 'విడా ముయార్చి' అనే ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.
అజిత్ ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించిన తర్వాత, విఘ్నేష్ శివన్ ప్రదీప్ రంగనాథన్, కీర్తి శెట్టి, గౌరీ కిషన్, ఎస్.జె. సూర్య నటించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వచ్చే వేసవిలో విడుదల కానుంది.
ఇది ఇలా ఉంటే.. నయనతార ఆస్తులు, సంపాదన గురించి చాలా సార్లు చాలా విషయాలు తెలుసుకున్నాం. కాని ఆమె భర్త విఘ్నేష్ ఆస్తుల గురించి మాతరం చాలా తక్కువగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన ఆస్తుల విలువ దాదాపు 50 కోట్లు ఉంటుందని అంచనా.
విఘ్నేష్ శివన్ ఒక్కో సినిమాకి 3 కోట్ల రూపాయలు, ఒక్కో పాటకు 3 లక్షల రూపాయలు సంపాదిస్తారని చెబుతున్నారు. రౌడీ పిక్చర్స్, 9స్కిన్‌తో సహా నయనతారతో కలిసి వివిధ వ్యాపారాల్లో ఉన్నారు. డివైన్ ఫుడ్స్‌తో సహా 15 కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు.