MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Relationship
  • Relationship Psychology: కొందరు అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ నే ఎందుకు ఇష్టపడతారు? సైకాలజీ ఏం చెప్తోంది?

Relationship Psychology: కొందరు అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ నే ఎందుకు ఇష్టపడతారు? సైకాలజీ ఏం చెప్తోంది?

కొందరు అమ్మాయిలు నమ్మకమైన, మంచిగా మాట్లాడే, కేర్ చేసే అబ్బాయిలకన్నా.. బ్యాడ్ బాయ్స్ నే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకు అమ్మాయిలు ఇలా థ్రిల్, రిస్క్, ఆకర్షణను ఎక్కువగా కోరుకుంటారు? ఇలాంటి అమ్మాయిల గురించి సైకాలజీ ఏం చెప్తోందో ఇక్కడ  తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Jan 30 2026, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Relationship Psychology
Image Credit : freepik

Relationship Psychology

ఎందుకు కొందరు అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ నే ఇష్టపడతారనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఎలాంటి నియమాలు పట్టించుకోని, రఫ్‌గా , కొంచెం డేంజరస్‌గా అనిపించే అబ్బాయిల వైపు కొందరు అమ్మాయిలు ఆకర్షితులవుతుంటారు. అసలు ఈ తరహా ఆకర్షణ ఎందుకు ఏర్పడుతుంది. సైకాలజీ విశ్లేషణలు ఏం చెబుతున్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అలాంటి వ్యక్తుల వైపు..
Image Credit : X

అలాంటి వ్యక్తుల వైపు..

సైకాలజీ ప్రకారం కొందరు బాయ్స్ అతి ఆత్మవిశ్వాసంతో ఉండటం, వారికి నచ్చినట్టు ప్రవర్తించడం, ఇతరుల అభిప్రాయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఈ లక్షణాలు కొంతమంది అమ్మాయిలకు బలమైన వ్యక్తిత్వంలా కనిపిస్తాయి. మనిషి మెదడు సహజంగానే శక్తిమంతంగా, ఆధిపత్యంగా కనిపించే వ్యక్తుల వైపు ఆకర్షితమవుతుందని సైకాలజీ చెబుతుంది. అందుకే కొంతమంది అమ్మాయిలకు బ్యాడ్ బాయ్స్ చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తారు.

37
ఎమోషనల్ ఎక్సైట్మెంట్
Image Credit : Getty

ఎమోషనల్ ఎక్సైట్మెంట్

ఇంకో ముఖ్యమైన కారణం ఎమోషనల్ ఎక్సైట్మెంట్. బ్యాడ్ బాయ్స్‌తో ఉండటం ఎప్పుడూ ఊహించని అనుభవంగా ఉంటుంది. వారి ప్రవర్తనలో అనిశ్చితి, రిస్క్, థ్రిల్ ఉంటాయి. సైకాలజీ నిపుణుల ప్రకారం మన మెదడు బోర్ అనిపించే పరిస్థితులను ఇష్టపడదు. అందుకే కొందరు అమ్మాయిలకు స్థిరమైన, ప్రశాంతమైన వ్యక్తుల కంటే బ్యాడ్ బాయ్స్ ఆసక్తికరంగా అనిపిస్తారు.

47
అన్‌ప్రెడిక్టబుల్ వ్యక్తులు
Image Credit : Gemini AI

అన్‌ప్రెడిక్టబుల్ వ్యక్తులు

చిన్ననాటి అనుభవాలు కూడా ఈ ఆకర్షణకు కారణమవుతాయని సైకాలజీ చెబుతోంది. ఒక అమ్మాయి బాల్యంలో భావోద్వేగ నిర్లక్ష్యం, తండ్రితో లేదా కుటుంబంతో అసురక్షిత అనుబంధాన్ని కలిగి ఉంటే, ఆమెకు అన్‌ప్రెడిక్టబుల్ వ్యక్తులు నచ్చవచ్చు. ఇలాంటి అమ్మాయిలు డ్రామా, ఎమోషనల్ హై అండ్ లో ఉన్న సంబంధాలనే ప్రేమగా పొరబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

57
మార్చగలమనే నమ్మకం..
Image Credit : freepik

మార్చగలమనే నమ్మకం..

సైకాలజీ నిపుణుల ప్రకారం కొంతమంది అమ్మాయిలకు బ్యాడ్ బాయ్ లోని లోపాలను సరిదిద్దగలననే నమ్మకం ఉంటుంది. ఇది వారికి ఒక ఎమోషనల్ ఛాలెంజ్‌గా అనిపిస్తుంది. అతను తన కోసం మారతాడని నమ్మడం వారికి ప్రత్యేకమైన స్థానం దక్కిన ఫీలింగ్ ని ఇస్తుంది. కానీ చాలా సందర్భాల్లో ఇది నిరాశకే దారి తీస్తుందని సైకాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

67
వీటిది కీలకపాత్ర
Image Credit : Getty

వీటిది కీలకపాత్ర

సామాజిక ప్రభావం కూడా ఈ ఆకర్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కథల్లో బ్యాడ్ బాయ్స్‌ను రొమాంటిక్ గా చూపించడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. నియమాలు పాటించని హీరో, ప్రేమలో మాత్రం నిజాయతీగా ఉంటాడన్న భావన చాలామందిలో బలంగా నాటుకుపోయింది. అందుకే రియల్ లైఫ్‌లో కూడా అలాంటి వ్యక్తుల పట్ల కొందరిలో ఆకర్షణ పెరుగుతుంది.

77
ఇది శాశ్వతం కాదు..
Image Credit : our own

ఇది శాశ్వతం కాదు..

నిపుణుల ప్రకారం బ్యాడ్ బాయ్స్ పట్ల ఆకర్షణ శాశ్వతం కాదు. వయసు పెరిగే కొద్దీ, జీవిత అనుభవాలు పెరిగే కొద్దీ చాలా మంది అమ్మాయిలకు భద్రత, గౌరవం, భావోద్వేగ స్థిరత్వం ముఖ్యమవుతాయి. అప్పుడు వారు ఎక్సైట్మెంట్ కంటే ఎమోషనల్ సేఫ్టీని ఎంచుకుంటారు. ఇది మానసిక పరిపక్వతకు సంకేతమని సైకాలజీ చెబుతోంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Related Stories
Recommended image1
True Love Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసా?
Recommended image2
Relationship Psychology: కొందరు అబ్బాయిలు ఆంటీలను ఎందుకు ఇష్టపడతారు? సైకాలజీ ఏం చెబుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved