- Home
- Life
- Relationship
- Relationship Psychology: కొందరు అబ్బాయిలు ఆంటీలను ఎందుకు ఇష్టపడతారు? సైకాలజీ ఏం చెబుతోంది?
Relationship Psychology: కొందరు అబ్బాయిలు ఆంటీలను ఎందుకు ఇష్టపడతారు? సైకాలజీ ఏం చెబుతోంది?
ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, ఆకర్షణ పెరగడానికి చాలా కారణాలుంటాయి. కొంతమంది అబ్బాయిలు తమకంటే పెద్ద వయసు మహిళలను ఇష్టపడుతుంటారు. ఇది కేవలం శారీరక ఆకర్షణా? లేక దీని వెనుక లోతైన మానసిక కారణాలున్నాయా? అలాంటి వారి గురించి సైకాలజీ ఏం చెబుతోందో తెలుసా?

Relationship Psychology
కొంతమంది యువకులు తమ వయసు అమ్మాయిలకంటే పెద్ద వయసు మహిళల వైపు ఆకర్షితులవుతుంటారు. ఇలాంటివి మన చుట్టూ చాలా జరుగుతుంటాయి కూడా. అయితే ఇది శారీరక ఆకర్షణ మాత్రమేనా? లేక దీని వెనుక లోతైన కారణాలున్నాయా? సైకాలజీ నిపుణులు ఇలాంటి యువకులు, మహిళల గురించి ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఎమోషనల్ సెక్యూరిటీ
సైకాలజీ ప్రకారం కొంతమంది యువకులు తమ జీవితంలో భావోద్వేగ స్థిరత్వం లేకపోవడం వల్ల పెద్ద వయసు మహిళల వైపు ఆకర్షితులవుతారు. సాధారణంగా కొంతమంది మహిళలు ప్రశాంతంగా కనిపిస్తారు, సహనంతో ఉంటారు. ఇది యువకులకు ఒక రకమైన సేఫ్ స్పేస్ లాగా అనిపిస్తుంది. చిన్నప్పుడు తల్లితో బలమైన అనుబంధం ఉన్నవారు లేదా తల్లిదండ్రుల సంరక్షణ లోపించినవారు, ఆ మాతృ సాన్నిహిత్యాన్ని గుర్తు చేసే వ్యక్తుల వైపు ఆకర్షితులవుతారని సైకాలజీ చెబుతోంది.
జీవితంపై స్పష్టత
అలాగే పెద్ద వయసు మహిళలకు జీవితంపై స్పష్టత ఉంటుంది. వాళ్లకు ఏం కావాలో, ఏం వద్దో తెలుసు. ఈ స్పష్టత, ఆత్మవిశ్వాసం కొంతమంది యువకులకు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. అదే సమయంలో, తమ వయసు అమ్మాయిలతో పోలిస్తే ఆంటీలు కాస్త డ్రామా తక్కువగా, భావోద్వేపరంగా స్థిరంగా ఉంటారనే భావన కూడా ఉంటుంది. ఒక యువకుడు తన జీవితంలో గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడు, స్పష్టత కలిగిన వ్యక్తుల వైపు సహజంగానే ఆకర్షితుడవుతాడని సైకాలజీ చెబుతోంది.
ఆంటీలు ఇచ్చే సలహాలు..
కొంతమంది యువకులు తమ జీవితంలో ఒక మెంటర్ లేదా గైడ్ కావాలని కోరుకుంటారు. వారికంటే పెద్ద వయసు మహిళలు అనుభవంతో ఇచ్చే సలహాలు, జీవితాన్ని చూసిన విధానం యువకులకు ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఇది ప్రేమగా మారకపోయినా, ఆ అనుబంధం క్రమంగా భావోద్వేగ ఆకర్షణగా మారే అవకాశం ఉంటుంది.
తిరుగుబాటు మనస్తత్వం
సైకాలజీ ప్రకారం ఏదైతే సమాజం వద్దు అని చెబుతుందో మనిషి అటువైపు మరింత ఆకర్షితుడవుతాడు. “ఇది తప్పు”, “ఇలా ఉండకూడదు” అని చెప్పినప్పుడు, కొంతమంది యువకుల్లో దానిపై మరింత ఆసక్తి పెరుగుతుంది. తిరుగుబాటు మనస్తత్వం ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
స్పష్టత అవసరం..
సైకాలజీ నిపుణుల ప్రకారం పెద్ద వయసు, చిన్నవయసు సంబంధాల్లో భావోద్వేగ పరిపక్వత, బాధ్యత, స్పష్టత చాలా అవసరం. లేకపోతే అది భవిష్యత్తులో మానసిక ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉంది.
సైకాలజీ ప్రకారం కొంతమంది అబ్బాయిలు ఆంటీలను ఇష్టపడటం విచిత్రం కాదు, తప్పు కూడా కాదు. అది వారి వ్యక్తిగత అనుభవాలు, భావోద్వేగ అవసరాల ప్రతిబింబం. కానీ ఆ ఆకర్షణను అర్థం చేసుకొని, అది ఆరోగ్యకరమైన సంబంధమా? పరస్పర గౌరవం ఉందా? అన్న ప్రశ్నలను వేసుకోవడం ముఖ్యం. నిపుణుల సలహా ప్రకారం, స్వీయ అవగాహన, ఎమోషనల్ మెచ్యూరిటీ ఉంటే, ఏ ఆకర్షణ అయినా మన జీవితాన్ని ఏం చేయలేదు.

