MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Relationship
  • Relationship Psychology: కొందరు అమ్మాయిలు పెళ్లైన అబ్బాయిలని ఎందుకు ఇష్టపడతారు?సైకాలజీ ఏం చెబుతోంది?

Relationship Psychology: కొందరు అమ్మాయిలు పెళ్లైన అబ్బాయిలని ఎందుకు ఇష్టపడతారు?సైకాలజీ ఏం చెబుతోంది?

ఒక ఆడ, మగ మధ్య ప్రేమ పుట్టడం సహజం. కానీ ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు పెళ్లైన మగవాళ్లను ఇష్టపడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజంగా ఇది ప్రేమా, ఆకర్షణా, లేక మానసిక అవసరాల ప్రభావమా? సైకాలజీ ఏం చెబుతోందో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 19 2026, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Relationship Psychology
Image Credit : gemini ai

Relationship Psychology

ఈ మధ్య మనం తరచూ వింటూనే ఉన్నాం. మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది పెళ్లికాని అమ్మాయిలు పెళ్లి అయిన అబ్బాయిలని ఇష్టపడుతున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది. దాని వెనుక కారణాలు ఏంటి? సైకాలజీ నిపుణులు వీరి గురించి ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆ గుణాలు చూసి..
Image Credit : Gemini AI

ఆ గుణాలు చూసి..

సైకాలజీ ప్రకారం ఒక అమ్మాయి, పెళ్లైన అబ్బాయిని ఇష్టపడటానికి మొదటి కారణం ఏంటంటే ఆల్రెడీ ఆ అబ్బాయిలోని మంచి లక్షణాలను చూసి మరొక అమ్మాయి అతన్ని సెలెక్ట్ చేసుకోవడమే. అంటే ఆ అబ్బాయిలో ఎంతో కొంత మంచితనం, స్థిరత్వం, బాధ్యత, సామర్థ్యం ఉంటేనే ఇంకొక అమ్మాయి, ఆ అబ్బాయిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటుంది కదా అనేది వీరి లాజిక్. అబ్బాయిలోని ఈ గుణాలు తనకోసం కూడా ఉపయోగపడతాయని వీరు అనుకునే అవకాశం ఉందని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Parenting Psychology: పేరెంట్స్ స్ట్రెస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?
Related image2
Child Psychology: పిల్లల్ని పదే పదే చెంపపై కొడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?
36
ఎమోషనల్ మెచ్యూరిటీ.
Image Credit : chatgpt

ఎమోషనల్ మెచ్యూరిటీ.

మరో ముఖ్యమైన కారణం ఎమోషనల్ మెచ్యూరిటీ. పెళ్లైన వ్యక్తులు సాధారణంగా కుటుంబ బాధ్యతలు, సంబంధాలను నిలబెట్టుకోవడం, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోవడం వంటివాటి వల్ల వారు స్థిరంగా, శాంతంగా కనిపించవచ్చు. ఈ స్థిరత్వం కొందరు అమ్మాయిలకు ఆకర్షణీయంగా అనిపించవచ్చు. ముఖ్యంగా జీవితంలో ఎమోషనల్ సపోర్ట్ లేని వారికి భద్రత, నమ్మకం కలిగించే వ్యక్తులవైపు ఆకర్షణ కలగడం సాధారణమని నిపుణులు చెబుతున్నారు.

46
దక్కని వాటిపై మక్కువ
Image Credit : Istock

దక్కని వాటిపై మక్కువ

సైకాలజీ ప్రకారం ఈజీగా దక్కని వస్తువు లేదా వ్యక్తిపై ఇష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. పెళ్లైన వ్యక్తి పూర్తిగా అందుబాటులో లేడనే భావన కొందరిలో ఆసక్తిని పెంచవచ్చు. ఇది చాలాసార్లు నిజమైన ప్రేమ కంటే ఛాలెంజ్, థ్రిల్ వల్ల కలిగే ఆకర్షణ కావచ్చు. ఈ రకమైన ఆకర్షణ తాత్కాలికమైందని నిపుణులు సూచిస్తున్నారు.

56
డిఫరెంట్ కోరికలతో..
Image Credit : ChatGpt

డిఫరెంట్ కోరికలతో..

సైకాలజీ ప్రకారం కొందరు వ్యక్తులు తమని తాము ప్రత్యేకం అని నిరూపించుకోవడానికి కూడా ఇలా డిఫరెంట్ కోరికలతో ఉంటారు. ఇప్పటికే కుటుంబ బంధంలో ఉన్న వ్యక్తి తనని ఇష్టపడటం వారికి ఒక రకమైన విలువను పెంచినట్లు భావిస్తారు. అయితే ఇలా అందరు అమ్మాయిలు ఉండకపోవచ్చు. చాలామంది స్పష్టమైన సరిహద్దులు, నైతిక విలువలు పాటిస్తారు.

66
అర్థం చేసుకోవడం ముఖ్యం
Image Credit : ChatGpt

అర్థం చేసుకోవడం ముఖ్యం

సైకాలజీ ప్రకారం ఆకర్షణ సహజమైన భావన. కానీ దాన్ని ఎలా నిర్వహిస్తామనేది ముఖ్యం. భావోద్వేగాలను గుర్తించి, వాటి మూలాన్ని అర్థం చేసుకోవడం అవసరం. పెళ్లైన వ్యక్తి పట్ల ఆకర్షణ కలిగితే, ఎందుకు ఇలా అనిపిస్తోందని వారిని వారు ప్రశ్నించుకోవాలి. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Related Stories
Recommended image1
Parenting Psychology: పేరెంట్స్ స్ట్రెస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?
Recommended image2
Child Psychology: పిల్లల్ని పదే పదే చెంపపై కొడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved