MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Relationship
  • Breakup Psychology: Ex ని మర్చిపోలేకపోవడానికి కారణం ప్రేమా? లేక ఈగోనా? సైకాలజీ ఏం చెబుతోంది?

Breakup Psychology: Ex ని మర్చిపోలేకపోవడానికి కారణం ప్రేమా? లేక ఈగోనా? సైకాలజీ ఏం చెబుతోంది?

బ్రేకప్ తర్వాత జీవితంలో ముందుకు సాగాలని చాలామంది అనుకుంటారు. కానీ Ex గుర్తొచ్చి మళ్లీ గతాన్నే తలుచుకుంటూ బాధపడుతుంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? Ex ని మర్చిపోలేకపోవడానికి కారణం ప్రేమా? లేక ఈగోనా? దీని గురించి సైకాలజీ ఏం చెబుతోందో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 12 2026, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Breakup Psychology
Image Credit : getty

Breakup Psychology

ప్రేమలో చాలామంది ఓడిపోతుంటారు. కానీ కొంతమంది జీవితంలో నుంచి వెళ్లిపోయిన ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తూ ఉంటారు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయని సైకాలజీ చెబుతోంది. భావోద్వేగ అనుబంధం నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినడం వరకు చాలా లోతైన మానసిక ప్రక్రియలు ఉంటాయని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఎమోషనల్ బాండింగ్..
Image Credit : Freepik

ఎమోషనల్ బాండింగ్..

సైకాలజీ ప్రకారం మనం ఎవరితోనైనా ఎమోషనల్ గా దగ్గర అయితే వారి పట్ల ఒక భద్రతా భావం ఏర్పడుతుంది. ఆ వ్యక్తి మన జీవితంలో భాగమైపోతారు. బ్రేకప్ తర్వాత ఆ భద్రత ఒక్కసారిగా కోల్పోవడం వల్ల మనసు ఖాళీగా అనిపిస్తుంది. ఇది నిజమైన ప్రేమ వల్ల కూడా కావచ్చు. ప్రత్యేకంగా మనం ఆ వ్యక్తితో భవిష్యత్తును ఊహించుకొని ఉంటే, ఆ కలలు చెదిరిపోవడం బాధను మరింత పెంచుతాయి. అందుకే Ex గుర్తులు, ఫోటోలు, కలిసి గడిపిన జ్ఞాపకాలు మనసును వెంటాడుతుంటాయి.

37
ఈగో దెబ్బతినడం వల్ల..
Image Credit : Freepik

ఈగో దెబ్బతినడం వల్ల..

అయితే, ఇది పూర్తిగా ప్రేమే అనుకోవడం సరికాదు. కొన్నిసార్లు మనం మిస్ అవుతున్నది ఆ వ్యక్తిని కాదు. ఆ వ్యక్తితో ఉన్న “మన భావన”ను. అంటే, వారి దగ్గర మనకు దక్కిన ప్రాధాన్యం, ప్రేమిస్తున్నారనే అనుభూతి వంటివి కావచ్చు. సైకాలజీ ప్రకారం, బ్రేకప్ తర్వాత మన సెల్ఫ్ వర్త్ దెబ్బతినే అవకాశం ఉంది. “నేను సరిపోలేదా?”, “నన్ను ఎందుకు వదిలేశారు?” అనే ప్రశ్నలు ఈగోను దెబ్బతీస్తాయి. దానివల్ల కూడా కొందరు Ex ను మరచిపోలేరు.  

47
ఈ రసాయనాల ప్రభావం..
Image Credit : Getty

ఈ రసాయనాల ప్రభావం..

అంతేకాదు ప్రేమలో ఉన్నప్పుడు మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్ వంటి రసాయనాలు విడుదలవుతాయి. ఇవి ఆనందం, అనుబంధం, తృప్తి భావాలను కలిగిస్తాయి. బ్రేకప్ తర్వాత ఈ రసాయనాల స్థాయి ఒక్కసారిగా తగ్గిపోతుంది. అంటే ఒక అలవాటు మానేసినప్పుడు కలిగే ఖాళీ భావనలా ఉంటుంది. అందుకే Ex గురించి మళ్లీ మళ్లీ ఆలోచించడం, సోషల్ మీడియాలో చూసుకోవడం, మెసేజ్ చేయాలనే కోరిక కలగడం వంటివి జరుగుతుంటాయి.

57
బంధం విడిపోయిన తీరు..
Image Credit : freepik

బంధం విడిపోయిన తీరు..

సైకాలజీ ప్రకారం ప్రేమ బంధం విడిపోయిన తీరు కూడా ముఖ్యమే. మనమే విడిచిపెట్టిన సంబంధం అయితే మనసు త్వరగా అంగీకరించవచ్చు. కానీ ఎదుటి వ్యక్తి వదిలేసినప్పుడు, మనలో ఓడిపోయిన భావన పెరుగుతుంది. రిజెక్షన్ ని మన మెదడు పెద్ద నొప్పిలా అనుభవిస్తుంది. ఈ సమయంలో “నన్ను ఎందుకు వదిలేశారు?” అనే ప్రశ్న ప్రేమ కంటే ఈగోను ఎక్కువగా బాధిస్తుంది. అందుకే కొందరు మళ్లీ ఆ వ్యక్తిని కలవాలనుకుంటారు. కానీ అది ప్రేమ వల్ల కాదు, “నేను విలువైన వ్యక్తిని అని నిరూపించుకోవాలనే ఆతృత వల్ల కూడా కావచ్చు.

67
స్పష్టత అవసరం
Image Credit : Getty

స్పష్టత అవసరం

సంబంధం ఎందుకు ముగిసిందో స్పష్టత లేకపోతే కూడా మనసు నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. సైకాలజీలో దీన్ని రూమినేషన్ అంటారు. అంటే అదే ఆలోచన మళ్లీ మళ్లీ రావడం. దానివల్ల బాధ రెట్టింపవుతుంది. మనసుకు స్పష్టత లభించకపోతే Ex ను మర్చిపోవడం కష్టం అవుతుంది. ఇక్కడ ప్రేమకంటే భావోద్వేగాలే ఎక్కువగా పని చేస్తాయి.

77
ఏం మిస్ అవుతున్నామో..
Image Credit : our own

ఏం మిస్ అవుతున్నామో..

సైకాలజీ నిపుణుల ప్రకారం.. మనం నిజంగా ఏం మిస్ అవుతున్నామో మనస్ఫూర్తిగా విశ్లేషించుకోవాలి. ఆ వ్యక్తినా? లేక సంబంధంలో లభించిన గుర్తింపు, స్నేహం, భద్రతనా? అనే విషయం తెలుసుకోవాలి. డైరీ రాయడం, కౌన్సెలింగ్ తీసుకోవడం, సోషల్ మీడియా కాంటాక్ట్‌ను కొంతకాలం దూరంగా ఉంచడం వంటి చర్యలు మనసుకు సహాయపడతాయని సైకాలజీ నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Related Stories
Recommended image1
True Love Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని నిజంగా ప్రేమించే వాళ్లు చేసే 7 పనులు ఇవే!
Recommended image2
Fake Love Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని ప్రేమించినట్లు నటించేవాళ్లు ఎలా ఉంటారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved