మోసం చేస్తూ దొరికిపోతే ఏం చేయాలి?
వారిని నమ్మించడానికి , బుకాయించే బదులు చేసిన తప్పును నిజాయితీగా అంగీకరించాలి. నీ వల్లే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని బ్లేమ్ చేయకుండా, జరిగింది చెప్పడం మంచిది.
ఈరోజుల్లో చాలా మంది తమ జీవిత భాగస్వామిని మోసం చేసేవారు పెరిగిపోతూ ఉన్నారు. మరొకరి మోజులో పడి కాపురాలను నాశనం చేసుకుంటన్నవారు కోకొల్లలు. కొందరు.. ఏదో క్షణికావేశంలో చేసిన తప్పుల కారణంగా కూడా జీవితాలు నాశనమౌతున్నాయి. అయితే, జీవిత భాగస్వామిని మోసం చేసినప్పుడు బుకాయించకుండా, వారితో నిజాయితీగా మాట్లాడటం వల్ల సమస్యలు పరిష్కరించుకోవచ్చట. అసలు ఇలాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో ఓసారి చూద్దాం..
1.మీరు మోసం చేస్తూ దొరికిపోయినప్పుడు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. ఆ సమయంలో మీరు బాధ్యతగా వ్యవహరించాలి. లేదు, నేను తప్పు చేయలేదని వారిని నమ్మించడానికి , బుకాయించే బదులు చేసిన తప్పును నిజాయితీగా అంగీకరించాలి. నీ వల్లే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని బ్లేమ్ చేయకుండా, జరిగింది చెప్పడం మంచిది.
2.మీరు తప్పు చేశారు. అది నిజం. కాబట్టి, మీరు చేసిన తప్పుకు మనస్ఫూర్తిగా మీ భాగస్వామికి క్షమాపణలు చెప్పాలి. మీరు చేసిన తప్పుకి మీరు రిగ్రెట్ అవుతున్నారు అనే భావన మీ భాగస్వామికి కలిగించాలి. అప్పుడు వారు మిమ్మల్ని క్షమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మళ్లీ మీ పార్ట్ నర్ తో ఆనందంగా ఉండాలి అంటే.. క్షమాపణలు కోరడం తప్పనిసరి.
3.మీరు చేసిన తప్పుకి, మీరు చేసిన మోసానికి మీ భాస్వామి విపరీతంగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వారు తమ బాధను మీతో పంచుకునే క్రమంలో, వారి ఫీలింగ్స్ ని తెలియజేసే సమయంలో ఏడ్వడం, తిట్టడం లాంటివి చేసే అవకాశం ఉంది. ఆ సమయంలోనూ మీరు చాలా ఓపికగా ఉండటం మంచిది.
4.మీరు, మీ భాగస్వామి అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాలి. ఆ విషయంలో పారదర్శకంగా ఉండాలి. అదేవిధంగా, అవసరం లేని విషయాలు చెప్పవద్దు. చెప్పాల్సినంత వరకు చెబితే సరిపోతుంది. అనవసరమైనవి చెబితే, వారు మరింత బాధపడే అవకాశం ఉంది.
5.మీరు చేసిన తప్పుకు మీరు ఎంత పశ్చాత్తాపడుతున్నారనే విషయాన్ని వారికి తెలియజేసి, అలా చేయడం వల్ల మీ భాగస్వామికి అన్యాయం జరిగిందనే విషయాన్ని గుర్తించాలి. వారిపై జాలి, దయ చూపించాలి.
6.మీరు తప్పు చేసి, వెంటనే వారు మిమ్మల్ని క్షమించాలని, వెంటనే మీతో మాట్లాడాలని మీరు భావించకూడదు. వారికి కొంత సమయం ఇవ్వాలి. దానిని వారు అర్థం చేసుకోవడానికి, జీర్ణించుకోడానికి సమయం పడుతుందని అర్థం చేసుకోవాలి. వారికి కోలుకోవడానికి సమయం ఇవ్వాలి.
Cheating husband
7. మీరు ఒకసారి తప్పు చేశారు అంటే, వారు మిమ్మల్ని నిత్యం అనుమానించే అవకాశం ఉంది. కాబట్టి.. దానిని మీరు అర్థం చేసుకోగలగాలి. వారికి మీపై మళ్లీ నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేయాలి.