మీ భర్త ఫ్యామిలీ మిమ్మల్ని ద్వేషిస్తోందనడానికి సంకేతాలు ఇవే..
కనీసం మీరు ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకపోవడం, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో మిమ్మల్ని దూరం పెట్టడం లాంటివి చేస్తారు.
పెళ్లి తర్వాత భర్త కుటుంబాన్ని ఓ మహిళ తన కుటుంబంగా భావిస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తన కుటుంబంలా భావించి, అన్నీతానే చేస్తుంది. కానీ చాలా మంది తమ ఇంటి కోడలిని తమ ఇంటి వ్యక్తిగా యాక్సెప్ట్ చేయరు. ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. మిమ్మల్ని కూడా మీ అత్తగారి కుటుంబం ద్వేషిస్తోంది అనడానికి కొన్ని సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూద్దాం..
మీరు అంటే మీ భర్త కుటుంబానికి ఇష్టం లేకపోతే, వారు మిమ్మల్ని ప్రతి విషయంలోనూ దూరం పెట్టాలని చూస్తుంటారు. మిమ్మల్ని ప్రతి విషయంలోనూ ఇగ్నోర్ చేయడం లాంటివి చేస్తారు.కనీసం మీరు ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకపోవడం, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో మిమ్మల్ని దూరం పెట్టడం లాంటివి చేస్తారు.
మీరు అంటే ఇష్టంలేకపోయినా, వారు మిమ్మల్ని ద్వేషించినా చాలా కోపం గా ఉంటారు. మీరు ఏం చేయకపోయినా విమర్శించడం లాంటివి చేస్తారు. ప్రతి దానికీ వెటకారంగా మాట్లాడటం లాంటివి చేస్తారు. అందరి ముందు అవమానించడం లాంటివి కూడా చేస్తారు.
ఫ్యామిలీ ఈ వెంట్స్ కి మిమ్మల్ని కావాలనే దూరం పెడతారు. ఇంట్లో అందరూ ఫంక్షన్స్ కి వెళ్లినా, మిమ్మల్ని కావాలని రావద్దు అని చెప్పడం లాంటివి చేస్తారు. ఇంట్లో ఉండి పనులు చూసుకో, అందరూ ఫంక్షన్ కి వెళ్తే ఇంట్లో ఎవరు ఉంటారు? లాంటి ప్రశ్నలు వేస్తారు.
जिस दिन बहू बिदा होकर अपने पति के घर आती है तो जरूरी नहीं कि उसी दिन से सास और बहू का रिश्ता मां बेटी जैसा हो जाए। यह एक टाइम टेकिंग प्रोसेस है जिस रिश्ते को बनने में थोड़ा समय जरूर लगता है।
(File photo)
మీరు ఏం చేసినా, ఏం చేయకపోయినా విమర్శించడం లాంటివి చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలను అంగీకరించరు. మీరు తీసుకునే నిర్ణయం మంచిది అయినా వారు దానిని అంగీకరించరు. మీరు ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు అని వీరు భావిస్తారు.
మీ గురించి అందరికీ రూమర్స్ క్రియేట్ చేయడం లాంటివి చేస్తారు. మీ గురించి అందరికీ చెడు చెబుతూ ఉంటారు. అందరూ మీ గురించి చెడుగా చెప్పుకునేలా చేస్తారు.
మీ ముందు ఇతరుల గురించి మంచిగా చెప్పడం, వారిపై ప్రేమ కురిపించడం లాంటివి చేస్తారు. మీ మీద మాత్రం వీలైనంత వరకు ద్వేషం కురిపిస్తూనే ఉంటారు.
ఇంట్లో పనంతా మీరే చేయాలని ఆర్డర్లు వేస్తారు. మీరు పని చేసినా కూడా అది వారికి నచ్చదు. ఎప్పుడు ఏవిధంగా గొడవలు పడదామా అని చూస్తూ ఉంటారు.