చల్లని వాతావరణంలో సెక్స్ ను బాగా ఎంజాయ్ చేసే చిట్కాలు..
చలికాలంలో చాలా మంది జంటలు సెక్స్ కు దూరంగా ఉంటారు. కారణం ఈ సీజన్ లో లిబిడో తగ్గడం. ఇతర కాలాలతో పోలిస్తే చలికాలంలోనే లిబిడో తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎందుకవుతుందంటే..?
చల్లని వాతావరణం ఆహ్లాదంగా అనిపిస్తుంది. కానీ ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది. ముఖ్యంగా ఇది సెక్స్ డ్రైవ్ ను కూడా తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. అవును చలికాలంలో చాలా మందికి లిబిడో తక్కువగా ఉంటుందట. దీనివల్ల మీకు సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. ఒక అధ్యయనం ప్రకారం.. టెస్టోస్టెరాన్ స్థాయిలు చల్లని వాతావరణంలో తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇదొక పురుష సెక్స్ హార్మోన్. ఇది కాలానుగుణంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే తక్కువ స్థాయి టెస్టోస్టెరాన్ తక్కువ లిబిడోతో సంబంధం కలిగి ఉంటుందట.
టెస్టోస్టెరాన్ సెక్స్ డ్రైవ్ లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే టెస్టోస్టెరాన్ స్థాయిలు శరదృతువులో ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ పడిపోవడం ప్రారంభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చల్లని నెలల్లో వీటి స్థాయిలు పడిపోతాయట. ముఖ్యంగా మీకు విటమిన్ డి లోపం ఉంటే.
తక్కువ విటమిన్ డి కూడా తక్కువ సెక్స్ డ్రైవ్ కు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. మీకు తెలుసా? మన శరీరంలో విటమిన్ డి స్థాయిలు సాధారణంగా శీతాకాలంలో తక్కువగా ఉంటాయి. విటమిన్ డి లోపం ఉన్న మహిళల్లో లైంగిక కోరికలు తక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ డి ఉన్న మహిళల్లో లైంగిక కోరికలు బాగా ఉన్నాయని ఒక అధ్యయనం వెళ్లడించింది. విటమిన్ డి లైంగిక కోరికను మెరుగుపరిచిందని, ఉద్వేగం, లైంగిక సంతృప్తిని పెంచిందని 2018 లో ఒక అధ్యయనం కనుగొంది.
శీతాకాలంలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉండటం సాధారణం. అయితే ఇది మన నాడీ వ్యవస్థను, కండరాల పనితీరుతో సహా మన జీవితంలోని చాలా భాగాలను ప్రభావితం చేస్తుంది. తక్కువ విటమిన్ డి స్థాయిలను తక్కువ లైంగిక కోరికతో ముడిపెట్టే అధ్యయనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో. అందుకే చల్లని వాతావరణంలో ప్రతిరోజూ కాసేపు ఎండుకు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అంత టైం లేకపోతే విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోండని నిపుణులు చెబుతున్నారు.
లేకపోతే మీరు ఈ సీజన్లలో సెక్స్ ను ఆస్వాధించలేరు. ఇది మిమ్మల్ని నీరసంగా చేస్తుంది. వాతావరణాన్ని ఎంజాయ్ చేయనీయదు. ఈ సీజన్లలో గాలి మీకు నిద్రవచ్చేలా చేస్తుంది కానీ సెక్స్ లో పాల్గొనేలా చేయదని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని చిట్కాలతో మీరు చల్లని వాతావరణంలో కూడా సెక్స్ ను ఎంజాయ్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
sex
శీతాకాలంలో మీరు సెక్స్ మూడ్ లోకి రావడానికి కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి. మీ స్థలాన్ని వీలైనంత సౌకర్యవంతంగా, సెక్సీగా మార్చడానికి ప్రయత్నించండి. అలాగే రూంలో కొవ్వొత్తులు వెలిగించడం, విలాసవంతమైన దుప్పట్లు, హీట్ వాటర్ మీలో సెక్స్ కోరికలను కలిగించడానికి సహాయపడతాయి.
మీకు వీలైతే సెక్స్ కు ముందు కాసేపు వ్యాయామం చేయండి. అది కూడా మీ శరీరం వేడిగా ఉన్నప్పుడు. ఇది మీ గుండె వేగాన్ని పెంచుతుంది. రక్తప్రవాహాన్ని పెంచుతుంది. ఇది మీలో సెక్స్ కోరికలు కలగడానికి కూడా సహాయపడుతుంది. అలాగే మీ శరీరం సెక్స్ ఆనందాన్ని అనుభవించే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా సెక్స్ చేయడానికి ఇది మంచి సమయం.
చలికాలంలో భావప్రాప్తిని పొందడం కాస్త కష్టమే. కానీ ఈ నెలల్లో సాక్సులను ధరించి సెక్స్ లో పాల్గొంటే మంచి ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. 2005 లో గ్రోనింగెన్ విశ్వవిద్యాలయం ఒక అధ్యయనం నిర్వహించింది.. దీనిలో సాక్సులు ధరించి సెక్స్ లో పాల్గొంటే భావప్రాప్తి పొందే అవకాశం ఉందని కనుగొన్నారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరం. కానీ సాక్సుల వల్ల మీ పాదాలు వెచ్చగా ఉంటాయి. సెక్స్ సమయంలో చల్లని పాదాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
అయితే చాలా మంది సెక్స్ లో పాల్గొనేటప్పుడు బట్టలను విప్పేస్తుంటారు. కానీ అన్నీ విప్పాల్సిన అవసరం లేదు. స్పూనింగ్ సెక్స్ అనేది ఒక గొప్ప భంగిమ. ఈ పొజీషన్ లో మీరు మీ బట్టలను పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదు. చల్లని వాతావరణమైనా సెక్స్ మిమ్మల్ని వేడెక్కిస్తుంది. అయితే మొదటి కొన్ని నిమిషాలకు దుప్పట్లు అవసరం అవుతాయి. ఆ తర్వాత వాటిని కూడా తొలగిస్తారు.