- Home
- Life
- Relationship
- Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భార్య గురించి భర్త ఎవరికి చెప్పకూడని 4 విషయాలెంటో తెలుసా?
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భార్య గురించి భర్త ఎవరికి చెప్పకూడని 4 విషయాలెంటో తెలుసా?
చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. మరీ ముఖ్యంగా భార్య గురించి కొన్ని విషయాలు భర్త ఎవరికీ చెప్పకూడదట. అవెంటో ఇక్కడ చూద్దాం.

ఆచార్య చాణక్యుడు మానవ జీవితానికి సంబంధించిన చాలా విషయాలు బోధించాడు. ముఖ్యంగా భార్యా భర్తల బంధం బాగుండాలంటే కొన్ని నియమాలు పాటించాలని నీతి సూత్రాల్లో పేర్కొన్నాడు. చాణక్య నీతి ప్రకారం భర్త తన భార్య గురించి కొన్ని విషయాలు ఎవరితోనూ చెప్పకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
భార్యా భర్తల గొడవ
భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. భర్తకు భార్య మీద కోపం రావడం కూడా సహజం. కానీ గొడవ అయి భార్య మీద కోపం వచ్చిందని దాని గురించి అందరితో చెప్పకూడదు. కోపాన్ని భార్య ముందు మాత్రమే చూపాలి. అందరికీ చెప్పి ఆమెను అవమానించకూడదు.
భార్యతో సమస్య ఉంటే?
ఏ భర్త తన భార్య గురించి అన్ని విషయాలు ఇతరులకు చెబుతాడో వారి ఇంట్లో ఎప్పుడూ సమస్యలు వస్తాయి. భర్తకు భార్యతో సమస్య ఉంటే ఆమెతో మాట్లాడి పరిష్కరించుకోవాలి. కానీ వాటిని ఇతరులతో చెప్పకూడదని చాణక్యుడు బోధించాడు.
భార్య బలహీనతలు
భార్యాభర్తల సమస్యలను ఇతరులతో చెప్పుకుంటే వారి బలహీనతలు అందరికీ తెలుస్తాయి. దీనివల్ల కొత్త సమస్యలు వస్తాయని చాణక్యుడు చెబుతాడు. భార్య బలహీనతలు కూడా భర్త ఇతరులతో పంచుకోకూడదని ఆచార్య చాణక్యుడు తన నీతి సూత్రాల్లో చెప్పాడు.
ఇతరుల ముందు తిట్టడం
భర్త తన భార్య మీదున్న కోపాన్ని ఇంట్లో మాత్రమే చూపించాలి. ఇతరుల ముందు చూపించకూడదు. ఇతరుల ముందు ఆమెను తక్కువ చేసి మాట్లాడకూడదు. తిట్టకూడదు. ఇలా చేస్తే ఆమె గౌరవం తగ్గుతుంది. ఇది దాంపత్యం చెడిపోవడానికి కారణమవుతుంది.