MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Relationship : ఆఫీస్ రొమాన్స్... ఇదే ఇప్పుడు ట్రెండ్..!

Relationship : ఆఫీస్ రొమాన్స్... ఇదే ఇప్పుడు ట్రెండ్..!

ప్రస్తుతం కొత్త ట్రెండ్ ప్రారంభమయ్యింది. ఆఫీసులు కేవలం పనిచేసే ప్రాంతాలుగానే కాదు ప్రేమికుల అడ్డాగా మారిపోతున్నాయి. ఓ సర్వేలో ఆఫీస్ రొమాన్స్ గురించి సంచలన విషయాలు బైటపడ్డాయి. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 09 2026, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏమిటీ ఆఫీస్ రొమాన్స్..?
Image Credit : AI meta

ఏమిటీ ఆఫీస్ రొమాన్స్..?

ఆఫీస్ రొమాన్స్‌ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయిందని ఓ సర్వే తేల్చింది. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం... 60% మందికి పైగా ఉద్యోగులు తమ ఆఫీసులోనే ప్రేమలో మునిగితేలుతున్నారట. ఈ ఆధునిక వర్క్ కల్చర్ వల్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య గీత చెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణమని ఈ సర్వే పేర్కొంది. 

ఎక్కువ సేపు ఆఫీసులోనే ఉండటం, బయట సోషల్ లైఫ్‌కు టైమ్ లేకపోవడం, రోజూ కలిసే సహోద్యోగులతో చనువు పెరగడం వంటివి ఆఫీస్ రొమాన్స్‌లకు దారితీస్తున్నాయట. సర్వేలో 65% మంది రోజూ చూసే ముఖాలు కాబట్టి వాళ్లతో కలవడం, మాట్లాడటం సులభమని చెప్పారు... మరో 61% మంది బయట వేరే వాళ్లను వెతుక్కునే టైమ్ లేదని అభిప్రాయపడ్డారట. ఆఫీసులో ఉండే ఒత్తిళ్లను అర్థం చేసుకునే భాగస్వామిని చాలామంది ఎంచుకుంటున్నారు.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పనిపై ప్రభావం ఉంటుందా?
Image Credit : X

పనిపై ప్రభావం ఉంటుందా?

ఆఫీస్ లో సాగే ప్రేమ మన పనితీరును, నిర్ణయాలను ప్రభావితం చేస్తాయట. సహోద్యోగితో ప్రేమలో ఉన్నప్పుడు బ్రేకప్ అయితే పరిస్థితి ఏంటనే భయం ఆఫీస్ లవర్స్ లో ఎక్కువగా ఉంటుందని స్టడీ చెబుతోంది. విడిపోయాక ఆఫీసులో ఎదురయ్యే ఇబ్బందులే ఈ ఆందోళనకు కారణం. 54% మంది తమ ప్రేమ వల్ల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతినదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

35
ఆఫీస్ లవ్ పై సహోద్యోగుల రియాక్షన్
Image Credit : X

ఆఫీస్ లవ్ పై సహోద్యోగుల రియాక్షన్

ఆఫీసులో ప్రేమ వ్యవహారాలు ఎక్కువకాలం రహస్యంగా ఉండవు. తమ రిలేషన్‌షిప్ బయటకు తెలిశాక తోటి ఉద్యోగులు తమతో వింతగా ప్రవర్తిస్తున్నారని సగానికి పైగా జంటలు అంగీకరించాయి. 60% మంది తమ కొలీగ్స్ ప్రేమ గురించి గాసిప్స్ విన్నారట. మూడింట ఒక వంతు మందిలో ఇది అసూయకు కారణమవుతోంది. ఆఫీసులో వీళ్ల పబ్లిక్ రొమాన్స్ 41% మందికి ఇబ్బందిగా అనిపిస్తోందని సర్వేలో తేలింది.

45
పాత బంధానికి గుడ్‌బై చెప్పిమరీ ఆఫీస్ రొమాన్స్..
Image Credit : Ai Meta

పాత బంధానికి గుడ్‌బై చెప్పిమరీ ఆఫీస్ రొమాన్స్..

సహోద్యోగితో ప్రేమలో పడిన వారిలో 40% మంది అప్పటికే ఉన్న తమ భాగస్వామిని మోసం చేసి ఈ బంధంలోకి వచ్చారట. అదే సమయంలో 43% మంది ఆఫీసులో కలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. బంధం నిలబెట్టుకోవడం కోసం దాదాపు సగం మంది ఉద్యోగం కూడా మారారు. 30% మంది ఒకవేళ ప్రేమ విఫలమైతే ఆఫీసులో ఎలా మెలగాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారట.

55
వన్-నైట్ స్టాండ్ కూడా ఎక్కువే..
Image Credit : Getty

వన్-నైట్ స్టాండ్ కూడా ఎక్కువే..

62% మంది తమ రిలేషన్‌షిప్ గురించి హెచ్‌ఆర్ విభాగానికి తెలియజేస్తున్నారట. కంపెనీలు కూడా ఇప్పుడు ఇలాంటి బంధాలను నిషేధించే బదులు, వాటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగుల మధ్య రిలేషన్ టీమ్ వర్క్‌పై ప్రభావం చూపిస్తోందనే ఆందోళనలు ఉన్నాయి.  

ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు మాత్రమే సహోద్యోగితో డేటింగ్ చేయడం తప్పని భావిస్తున్నారట. అంతేకాదు 50% మంది కొలీగ్స్‌తో ఫ్లర్ట్ చేస్తామని, 39% మంది సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, 17% మందికి 'వన్-నైట్ స్టాండ్' అనుభవం ఉందని చెప్పినట్లు సర్వే తేల్చింది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బంధుత్వం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
భార్య ఏడాదిగా పుట్టింట్లో ఉంటే.. భ‌ర్త విడాకులు తీసుకోవ‌చ్చా? చ‌ట్టం ఏం చెబుతోంది
Recommended image2
Relationship: చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా? 5 అలవాట్లు మార్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీ
Recommended image3
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Related Stories
Recommended image1
Relationship Tips: రిలేషన్ షిప్‌లో ఈ 3 తప్పులు చేశారంటే.. బంధం తెగిపోవడం ఖాయం!
Recommended image2
Relationship: 90 శాతం మందికి ప్రేమ‌కు అస‌లైన‌ అర్థం ఏంటో తెలియ‌దు.. మీకు తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved