Zodiac signs రాజయోగం తీసుకొస్తున్న అక్షయ తృతీయ.. ఏఏ రాశుల వారికి ఆ యోగమంటే..
అక్షయ తృతీయ: జ్యోతిశాస్త్రం, హిందూ నమ్మకాల ప్రకారం అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన రోజు. ఆ రోజు ఏదైనా పని చేబడితే అంతా శుభమే జరుగుతుంది అంటారు. ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయాలని పండితులు చెబుతుంటారు. లక్ష్మిదేవి, కుబేరుడిని పూజిస్తే ధన లాభం కలుగుతుందని ప్రతీతి. ఈసారి అక్షయ తృతీయ ఏప్రిల్ 30న వస్తోంది. ఈ దినాన గజకేసరి యోగం, లక్ష్మినారాయణ యోగం, మాలవ్య యోగం, చతుర్ గ్రహ యోగం కలుగుతాయని జ్యతిష్య పండితులు సెలవిస్తున్నారు. వీటి కారణంగా అన్నిరాశుల వారికి మంచి జరిగినా.. కొన్ని రాశుల వారికి అత్యధిక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.
13

మీనరాశికి అత్యంత సానుకూల సమయం
ఈ నాలుగు రాజయోగాల ద్వారా అత్యధిక లబ్ది పొందేది మీన రాశి వారు. ఈ ప్రభావం కారణంగా ఇల్లు లేదా వహనాలు కొనుగోలు చేస్తారు. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. లక్ష్మిదేవి ఆశీస్సులతో భారీగా ధన యోగం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు కొలువులో కుదురుకుంటారు. మీన రాశి వారిలో నాయకత్వాన్ని నిరూపించుకునే అవకాశాలు వస్తాయి. కొత్త పనులు చేపట్టడానికి, జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం.
23
వృషభ రాశివారికి పట్టిందల్లా బంగారమే
వృషభ రాశి వారికి తమ జీవిత కాలంలోనే అత్యంత అనుకూలమైన సమయాల్లో ఇదొకటి. ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. ఇల్లు, వాహనాల కొనుగోలుకు సరైన తరుణం. ఈ రాశి వారు కొత్తగా వ్యాపార ప్రయత్నాలు ప్రారంభిస్తే విజయం సాధిస్తారు. కుబేరుడు, లక్ష్మిదేవిల కటాక్షంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
33
మిథున రాశివారికి లక్ష్మిదేవి ఆశీస్సులు
అక్షయ తృతీయ పర్వదినాన రాజయోగాల ప్రభావం మిథున రాశి వారిపై దండిగా కనిపిస్తుంది. లక్ష్మిదేవి, కుబేరుడి ఆశీస్సులు సంపూర్తిగా ఉండటంతో విపరీతమైన ధన యోగం దక్కుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో దూసుకెళ్తారు. వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయం. ప్రేమలో విజయం సాధిస్తారు.
Latest Videos