MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Relationship
  • father son bond నాన్నే రోల్ మోడల్.. కావొద్దు ఫెయిల్!

father son bond నాన్నే రోల్ మోడల్.. కావొద్దు ఫెయిల్!

పిల్లలు బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకం అవుతుంది. ముఖ్యంగా అబ్బాయిలు చెడు దారి పట్టకుండా, అమ్మాయిల పట్ల చెడుగా ప్రవర్తించకుండా ఉండాలంటే తండ్రి మార్గదర్శకత్వం ఎంతో అవసరం. నాన్న తన పిల్లాడికి  ఒక స్నేహితుడు, మెంటర్, రోల్ మోడల్ గా ఉండాలి.  ప్రతి తండ్రి తన కొడుక్కి అన్న విషయాలూ నేర్పించలేడు. కానీ చాలా విషయాలు తండ్రి ప్రవర్తన చూసే నేర్చుకుంటాడు కొడుకు. కాబట్టి కొన్ని విషయాల్లో తండ్రి ఆదర్శంగా ఉండాలి. 

2 Min read
Author : Anuradha B
Published : Apr 15 2025, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

క్రమశిక్షణ, విలువలు, పెద్దల్ని గౌరవించడం, నిజాయతీ... ఇలాంటివి పిల్లాడికి చెబితే రావు.  పెద్దవాళ్లని చూసే నేర్చుకుంటారు. రోజూ ఉదయాన్నే నిద్ర లేచి చదువుకోవాలి అని పిల్లాడికి చెబితే తలకెక్కించుకోడు. మనమూ ఆ పని చేయాలి. మనం మన పెద్దలకు గౌరవం ఇస్తే అది చూసి నేర్చుకుంటాడు. ఇంట్లో నిత్యం గొడవలు, అరుచుకోవడాలు ఉంటే అది పసి మనసుపై ఎంతో ప్రభావం చూపుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాధ్యత

బాధ్యత

నాన్నకు ఎన్నో బాధ్యతలు. కుటుంబాన్ని చక్కబెట్టడం, పిల్లల్ని చదివించడం, అనారోగ్యం వస్తే ఆసుత్రికి తీసుకెళ్లడం, ఉద్యోగం చేయడం, పిల్లల పెళ్లిళ్లు.. ఇవన్నీ సక్రమంగా చేస్తుంటే తన పిల్లాడు చూస్తూ పెరుగుతాడు. ఇవన్నీ పురుషుడి బాధ్యతలు అని తెలుసుకుంటాడు. సమయానికి హోంవర్క్ చేయడం, ఇంటిపనుల్లో సాయం చేయడం, వయసు పెరుగుతున్నకొద్దీ చిన్నచిన్న పనులు సొంతంగా చేయడం, కుదిరితే చిన్నచిన్న పనులు చేసి డబ్బులు సంపాదించడం.. ఇవన్నీ నేర్పిస్తుండాలి.

35
father son

father son

అతి గారాబం చేయడం, అడిగిందల్లా కొనివ్వడం.. ఇలాంటి వాటితో పిల్లలకు డబ్బు విలువ తెలియదు. ఒక రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడాలో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. మనం చేసే దుబారా ఇతరులకు జీవితాలకు ఎలా ఉపయోగపడుతుందో తెలియజెప్పాలి. ఉన్నదాంట్లో సర్దుకుపోవడం చెప్పాలి. అవసరాలేంటో, విలాసాలేంటో తెలియజేసినప్పుడే జీవితంలో కొడుక్కి డబ్బు విలువ తెలుస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ లేని వ్యక్తుల జీవితంలో ఏమీ సాధించలేరనే విషయం తెలియజెప్పాలి. 

45

సమాజంలో మహిళలపై నిత్యం ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆడవాళ్లను చులకనగా చూస్తున్నారు. మగాళ్లు ఇలా రాక్షసుల్లా ప్రవర్తించడానికి కారణం ఇంట్లో పెరిగిన వాతావరణమే. ఇంటి యజమాని తన భార్య, తల్లికి గౌరవం ఇవ్వకపోతే అతడి కొడుక్కీ ఆడవాళ్లంటే చులకనభావం ఏర్పడుతుంది. నాన్న ఇతర మహిళలను గౌరవించినప్పుడే కొడుకూ నేర్చుకుంటాడు. అమ్మాయిలను ఎలా గౌరవించాలో చెప్పినప్పుడే పిల్లలూ నేర్చుకుంటారు. 

55

చేపట్టిన ప్రతి పనీలో విజయం సాధించలేం. అది చదువు, ఉద్యోగం, ఎంచుకున్న రంగం.. ఏదైనా కావొచ్చు. వైఫల్యాలు బాధిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ ఫెయిల్యూర్స్ ని తట్టుకోలేరు. అలాంటప్పుడే ఇవన్నీ జీవితంలో భాగం అని చెప్పగలగాలి. పడినా బలంగా లేవాలి.. ముందుకు సాగాలి అని భరోసా ఇవ్వాలి. అప్పుడే పరీక్షలో ఫెయిలైన విద్యార్థి తనువు చాలించడం, ప్రేమలో విఫలమైన కుర్రాడు సూసైడ్ చేసుకోవడం లాంటివి తగ్గుతాయి. 

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
బంధుత్వం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved