సాన్నిహిత్యం అంటే సెక్స్ మాత్రమే కాదు.. భాగస్వాముల మధ్య ఇవి కూడా ఉండాల్సిందే..!
మీ జీవిత భాగస్వామితో శృంగారంతో పాటుగా మీ జీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తులతో కూడా సాన్నిహిత్యాన్ని కొనసాగించొచ్చు. నిజానికి ఇవి మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా బలంగా ఉంచుతాయి. నమ్మకాన్ని పెంచుతాయి.
"సాన్నిహిత్యం" అనే పదాన్ని కేవలం లైంగిక సంబంధాలుగానే చూస్తారు చాలా మంది. కానీ ఇవి ఖచ్చితంగా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. కానీ సాన్నిహిత్యం అంటే సెక్స్ లేదా లైంగిక కార్యకలాపాలు మాత్రమే కాదు. మీ లైంగిక భాగస్వామితో పాటుగా మీ జీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తులతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి. సాన్నిహిత్యం వల్ల అవతలి వ్యక్తితో భావోద్వేగ సంబంధం, నమ్మకం పెరుగుతాయి.
సాన్నిహిత్యం, సెక్స్ మధ్య వ్యత్యాసం
ఎవరితోనైనా సాన్నిహిత్యాన్ని కొనసాగించడానికి మీరు వారితో సెక్స్ లో పాల్గొనాల్సిన అవసరం లేదు. శృంగారం శారీరక అవసరాలను తీరుస్తుంది. దీని కోసం ఇద్దరి వ్యక్తుల మధ్య శరారీక సంబంధం ఉంటుంది. సాన్నిహిత్యం కోసం మీకు భావోద్వేగ కనెక్షన్ అవసరం. కానీ ఇది శారీరక సంబంధమైతే కాదు. సాన్నిహిత్యం మీ శృంగార జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ భాగస్వామికి దగ్గరగా ఉండటానికి సహాయపడుతుంది. దీంతో మీరు ఆహ్లాదకరమైన శృంగారాన్ని ఆస్వాదించొచ్చు. సాన్నిహిత్యం మీ మానసిక, లైంగిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒత్తిడిని తగ్గిస్తుంది
ఒత్తిడి నిద్రలేమి, కండరాల నొప్పి, అధిక రక్తపోటు, గుండె సమస్యలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీ భాగస్వామి, స్నేహితులు, కుటుంబంతో సాన్నిహిత్యాన్ని కొనసాగించడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకరి పట్ల అభిమానాన్ని చూపించడం, ఇతరుల నుండి భావోద్వేగ మద్దతు పొందడం వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం తగ్గుతుంది.
లైంగిక జీవితం మెరుగు
శృంగారంలో పాల్గొన్నంత మాత్రానా మీరు వారితో సాన్నిహిత్యాన్ని పంచుకుంటారని అర్థం కాదు. కానీ మీరు మీ భాగస్వామితో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తే అది మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. సన్నిహిత సంబంధంలో శారీరక సంబంధాన్ని కలిగి ఉండటం వల్ల మీ కోరికను నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు. అలాగే లైంగిక కార్యకలాపాల సమయంలో మీ ప్రేమ మంచి భావప్రాప్తి పొందడానికి సహాయపడుతుంది. అంతేకాదు మీకు మంచి మానసిక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. అలాగే ఇది మీ సంబంధాన్ని బలంగా చేస్తుంది.
మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది
మీరు ఎవరితోనైనా సాన్నిహిత్యంగా ఉంటే అది మీ మానసిక ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. సాన్నిహిత్యాన్ని కోల్పోయిన పురుషులు ఎక్కువ కోపంగా ఉంటారు. ఇక మహిళలు సులభంగా డిప్రెషన్ కు గురవుతున్నారని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు ఒక వ్యక్తితో కూర్చోవడం లేదా ఒకరిని తాకడం వల్ల మంచి అనుభూతి చెందితే మీ శరీరం ఆక్సిటోసిన్ ను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటే మీ శరీరం డోపామైన్ వంటి ఎక్కువ సంతోషకరమైన హార్మోన్లను ఎక్కువగా విడుదల చేస్తుంది.
బలంగా చేస్తుంది
మన భావాలను అందరితో పంచుకోలేం. చాలా మంది తమకు నమ్మకం, సౌకర్యంగా ఉన్న వారితోనే తమ భావాలన్నింటినీ చెప్పుకుంటారు. అలాగే సాన్నిహిత్యాన్ని పంచుకుంటారు. మీరు మీ భావాలను ఎవరితోనైనా పంచుకున్నప్పుడు, భావోద్వేగపరంగా ఆ వ్యక్తి మీతో ఉన్నారని మీకు తెలిసినప్పుడు మీరు లోపలి నుంచి మరింత బలంగా మారుతారు. అలాగే భావోద్వేగ సాన్నిహిత్యం రోగాలు తొందరగా తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. అంతే కాదు ఇది మీ ఒంటరితనాన్ని కూడా దూరం చేస్తుంది. ముఖ్యంగా నిరాశ, ఆందోళనలను.
సాన్నిహిత్యంలో రకాలు
శారీరక సాన్నిహిత్యం
శారీరక సాన్నిహిత్యం అంటే సెక్స్ చేయడం లేదా ఒకరితో ఒకరు శారీరకంగా కనెక్ట్ అవ్వడం కాదు. దీనర్థం శారీరక రూపంలో అంటే కలిసి సమయాన్ని గడపడం, ఒకరితో ఒకరు మాట్లాడటం ద్వారా మంచి అనుభూతి చెందడం. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నా లేదా స్నేహితుడితో కూర్చొని నవ్వుతున్నా టైం తెలియనంత సమయాన్ని గడుపుతారు. అంతేకాదు కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని సాన్నిహిత్యాన్ని కూడా ఆస్వాదించొచ్చు.
భావోద్వేగ సాన్నిహిత్యం
భావోద్వేగ సాన్నిహిత్యం అంటే ఒక వ్యక్తితో భావోద్వేగంగా కనెక్ట్ కావడం. మీరు మీ భావాలన్నింటినీ వారితో చెప్పుకోగలుగుతారు. అంతేకాదు మీరు కూడా వారి భావాలను అర్థం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు.