ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్.. గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు
గర్భాధారణ సమయంలో స్త్రీ శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. ముఖ్యంగా హార్మోన్ల మార్పులు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ సమయంలో మునపటిలా సెక్స్ లో పాల్గొనలేరు. కొంతమంది ఆడవారికి ఈ సమయంలో సెక్స్ పట్ల ఆసక్తి మొత్తమే ఉండదు. కానీ ఇంకొంతమందికి మాత్రం..
ప్రెగ్నెన్సీ టైం లో స్త్రీ శరీరం అనేక శారీరక మార్పులకు లోనవుతుంది. అలాగే ఇది ఒత్తిడిని, నిరాశను కలిగిస్తుంది. ఇది ఆడవారిలో సెక్స్ డ్రైవ్ ను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో కొద్దిమంది ఆడవారికి మాత్రమే లిబిడో ఎక్కువగా ఉంటుంది. కానీ అన్నింటికంటే ముఖ్యంగా సెక్స్ కోరికలు పూర్తిగా తగ్గిపోతాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో హార్మోన్ల అసమతుల్యత ఒకటి. ఈ సంగతి వదిలేస్తే ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ విషయంలో గుర్తించుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శరీర అభద్రత
సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రెగ్నెన్సీ సమయంలో శరీర అభద్రత భావం ఉండటం సర్వసాధారణం. అంతేకాకుండా ఈ సమయంలో శరీరంలో ప్రతి త్రైమాసికంలో ఎన్నో మార్పులకు లోనవుతుంది. కొంతమందికి మొదటి త్రైమాసికం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం మూడ్ స్వింగ్స్ సమస్య ఉంటుంది. మరికొందరు మొదటి త్రైమాసికంలో విపరీతమైన అలసటతో బాధపడుతుంటారు. రెండు, మూడు నెలలో శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. దీనివల్ల ఈ సమయంలో అంత సెక్సీగా అనిపించదు. దీనివల్ల సెక్స్ లో పాల్గొనాలనే కోరికలు తగ్గుతాయి.
మీ భాగస్వామికి కూడా సెక్స్ గురించి తెలియకపోవచ్చు
ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో దీని గురించి మాట్లాడాలి. ఎందుకంటే మీ భాగస్వామి సెక్స్ చేయాలనుకున్నా.. ప్రెగ్నెన్సీ సమయం అని భయపడొచ్చు. గర్బివతితో సెక్స్ లో పాల్గొంటే బిడ్డకు రిస్క్ అని భయపడుతుంటారు. దీనికారణంగా మీరు మీ భాగస్వామి సెక్స్ పట్ల ఆసక్తి కోల్పోయారని అనుకోవద్దు.
కొంతమంది మహిళలకు ఎక్కువ సెక్స్ డ్రైవ్
ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు కూడా వర్తిస్తుంది. దీనికి హార్లోన్ల మార్పులే కారణం. కొంతమందికి గర్భధారణ సమయంలో సెక్స్ నచ్చదు. మరికొందరు మాత్రం ఎక్కువ లిబిడోను కలిగి ఉంటారు. జననేంద్రియాలకు రక్త ప్రవాహం, లూబ్రికెంట్ పెరగడమే దీనికి కారణం. అయితే కొంతమందికి గర్భధారణ సమయంలో సాధారణం కంటే సెక్స్ కోరికలు కలుగుతాయి. లవ్ మేకింగ్ చర్య విశ్రాంతి, నమ్మకం, సౌకర్యాన్ని ప్రోత్సహించే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది.
యోని సెక్స్
ఈ సమయంలో యోని శృంగారంలో పాల్గొనడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ మీ భాగస్వామిని కౌగిలించుకోవడం, పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివి చేయొచ్చు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి ఇవి గొప్ప మార్గాలు. యోని ఇంటర్కోస్ మంచి ఆలోచన కాకపోవచచ్చు. ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో. అయితే ఫోర్ ప్లే మిమ్మల్ని సెక్స్ మూడ్ లోకి తీసుకురావడానికి బాగా సహాయపడుతుంది.