ఆడవారి భావప్రాప్తి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు
శృంగారంతో శారీరక ఆనందమే కాదు మానసిక ఆనందం కూడా కలుగుతుంది. ఇది మనస్సును తేలికపరుస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం సెక్స్ లో భావప్రాప్తిని పొందడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే ఈ భావప్రాప్తిని స్త్రీలు ఎన్నో రకాలుగా పొందుతారట.
స్త్రీ ఉద్వేగం గురించి పట్టించుకునేవారు చాలా తక్కువే. సెక్స్ లో ప్రతిసారి భావప్రాప్తిని పొందేది కేవలం పురుషులు మాత్రమేనని నివేధికలు వెళ్లడిస్తున్నాయి. పురుషులతో పాటుగా స్త్రీలకు కూడా భావప్రాప్తి ముఖ్యం. అయినా స్త్రీల భావప్రాప్తి గురించి బహిరంగంగా ఎప్పుడూ చర్చించరు. దీనివల్లే మహిళల్లో భావప్రాప్తి గురించి ఎన్నో రకాల సందేహాలు ఉంటాయి. మహిళలకు కూడా తెలియని విషయాలు చాలానే ఉన్నాయట. శరీర తృప్తికి వీరికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఎప్పుడూ ఏదో ఒక కన్ ఫ్యూజన్ లో ఉండేవారికి. ఇలాంటి వారు శృంగారాన్ని ఆస్వాదించడం చాలా ముఖ్యం. ఇలాంటి వారు భావప్రాప్తిని పొందడం కూడా అవసరం. అయితే మహిళలు భావప్రాప్తిని ఎన్నో విధాలుగా పొందుతారట.
భావప్రాప్తి అనేది నాడీ వ్యవస్థ నియంత్రించే ఒక రకమైన అసంకల్పిత చర్య. ఇది ఉద్రిక్తతను విడుదల చేస్తుంది. దీనివల్ల మీ శరీరానికి విశ్రాంతి కలుగుతుంది. అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఇది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే దీన్ని ఆడవారు ఎన్నో విధాలుగా పొందుతారు. మరి దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సెక్స్ పై దృష్టి పెట్టడం
బెల్జియం యూనివర్శిటీ 18 నుంచి 67 ఏళ్ల మధ్య వయసున్న 250 మంది మహిళలపై ఓ పరిశోధన జరిపింది. భావప్రాప్తి ఆధారంగా చేసిన ఈ అధ్యయనం ప్రకారం.. భావప్రాప్తిని సాధించడంలో స్త్రీ మెదడు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పరిశోధనలో 75 మంది మహిళలు భావప్రాప్తిని సాధించలేదు. సెక్స్ సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచించని మహిళలే భావప్రాప్తిని పొందుతారని పరిశోధనలో తేలింది. సంభోగం సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచించే మహిళలు భావప్రాప్తిని పొందలేరని పరిశోధన వెల్లడిస్తోంది.
బహుళ ఉద్వేగం వచ్చే అవకాశం
సాధారణంగా పురుషులలో ఉద్వేగం తర్వాత వారికి మళ్లీ అదే మూడ్ లోకి రావడానికి కొంత సమయం పడుతుందది. అయితే మహిళలు బహుళ భావప్రాప్తిని సులభంగా సాధిస్తారట. జర్నల్ ఆఫ్ సెక్స్ అండ్ మారిటల్ థెరపీలో ఒక నివేదిక ప్రకారం.. 2,049 మంది మహిళల్లో 8 శాతం మంది బహుళ భావప్రాప్తిని అనుభవిస్తారు.
సెక్స్ సమయంలో మాట్లాడటం
సంభాషన సంబంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా లైంగిక జీవితాన్ని కూడా ఉత్తేజపరుస్తుంది. ఇష్టాయిష్టాల గురించి మాట్లాడటం చాలా ముఖ్యం. ది జర్నల్ ఆఫ్ సెక్స్ రీసెర్చ్ 2019 అధ్యయనం ప్రకారం.. లైంగిక కమ్యూనికేషన్. లూబ్రికేషన్, అంగస్తంభన, ఉద్వేగం, తక్కువ నొప్పి, ఉద్వేగంతో ముడిపడి ఉంది. మీ భాగస్వామితో మీ ఇష్టాల గురించి ఎంత ఎక్కువగా చెబితే మీరు అంత ఎక్కువ భావప్రాప్తిని పొందుతారని తేలింది.
ఉద్వేగం క్లిటోరస్ ద్వారా
ఉద్వేగాన్ని పెంచడానికి క్లిటోరిస్ ఒక సులభమైన మార్గం. జర్నల్ ఆఫ్ సెక్స్ అండ్ మారిటల్ థెరపీ లో 2018 నివేదిక ప్రకారం.. 36 శాతం మంది మహిళలు క్లిటోరిస్ ఉద్దీపన ద్వారా భావప్రాప్తి పొందుతారు. చాలా మంది మహిళలు క్లిటోరస్ సహాయం లేకుండా భావప్రాప్తి పొందలేరు. క్లిటోరిస్ చూడటానికి చిన్నగా కనిపించొచ్చు. కానీ దాని పరిమాణం అంతర్గతంగా పెద్దగా ఉంటుంది. ఇది 8,000 ఇంద్రియ నరాల చివరలను కలిగి ఉంటుంది. ఇది మహిళల శరీరంలో అత్యంత సున్నితమైన భాగంగా పరిగణించబడుతుంది. ఇది మీ మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తుంది.
నిద్ర ఉద్వేగం
మీకు తెలుసా? మీరు నిద్రపోయేటప్పుడు కూడా భావప్రాప్తి పొందొచ్చు. వినడానికి కాస్త వింతగా ఉన్నా.. ఇది పూర్తిగా నిజమంటున్నారు నిపుణులు. జర్నల్ ఆఫ్ సెక్స్ అండ్ మారిటల్ థెరపీ ప్రకారం.. మనం రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరంలో రక్త ప్రసరణ పెరగడం ప్రారంభమవుతుంది. దీనివల్ల శరీరంలో ఉద్వేగం వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా బోర్లా నిద్రపోయే వ్యక్తులకు. వీళ్లు ఈ రకమైన ఉద్వేగాన్ని సులభంగా పొందుతారట.