స్త్రీ భావప్రాప్తితో ఎన్ని లాభాలున్నాయో..!
సెక్స్ లో భావప్రాప్తి మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. అయితే పురుషులే భావప్రాప్తిని ఎక్కువగా పొందుతారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆడవారు భావప్రాప్తిని పొందడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుందట. ఏదేమైనా ఆడవారి భావప్రాప్తి వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
భావప్రాప్తి మీ సంబంధాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇది మీ లైంగిక ఆనందాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇది పురుష భాగస్వామిని కూడా సంతృప్తిపరచడానికిక సహాయపడుతుంది. ఇవే కాకుండా స్త్రీ భావప్రాప్తి వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయట. ఇది మీ ఇద్దరి సంబంధాన్ని భావోద్వేగపరంగా బలోపేతం చేస్తుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
పరిశోధన ఏం చెబుతోందంటే..
జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జువాలజీలో ఒక పరిశోధన ప్రకారం.. స్త్రీలు సంభోగంలో క్లైమాక్స్ కు చేరుకున్నప్పుడు.. వారి శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. ఈ సమయంలో వారి హృదయ స్పందన రేటు, శ్వాస రేటు, రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి. అంతేకాదు "లవ్ హార్మోన్" అయిన ఆక్సిటోసిన్ ఉద్వేగం సమయంలో బాగా పెరుగుతుంది. దీంతో ఆడవారు మంచి అనుభూతిని పొందుతారు. ఈ సమయంలో భాగస్వాములిద్దరిలోనూ డోపామైన్ చురుగ్గా మారుతుంది. దీనివల్ల ప్రేమ, భావోద్వేగాలు, నమ్మకం, అనుబంధం వంటి భావాలు మెదడుకు సంబంధించిన కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేస్తాయి. ఆడవారి భావప్రాప్తి వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది
భావప్రాప్తి కేవలం ఆనందాన్ని మాత్రమే కలిగిస్తుందనే భావిస్తారు చాలా మంది. కానీ ఇది మీకు, మీ భాగస్వామికి.. మీ శరీరంతో మరింత సంతృప్తిని కలిగిస్తుంది. దాని వల్ల మీ ఇద్దరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ భాగస్వామి సెక్స్ డ్రైవ్ ను కూడా పెంచుతుంది. ఇది మీ బంధంపై నమ్మకాన్ని మరింత పెంచుతుంది.
బాగా నిద్రపోతారు
భావప్రాప్తి వల్ల మీ శరీరానికి కలిగే మంచి ప్రయోజనం ఏంటంటే.. దీని తర్వాత మీరు ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోతారు. సెక్స్ తర్వాత హార్మోన్లు మీరు వేగంగా నిద్రపోవడానికి సహాయపడతాయి. అవి మీ ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తాయి. అందుకే మీరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు.
ఒకరి భావాలను మరొకరు మరింత అర్థం చేసుకోవడం
భావప్రాప్తి కారణంగా లేదా పోస్ట్-సెక్స్ హార్మోన్ ఆక్సిటోసిన్ విడుదల వల్ల మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అంతేకాదు ఒకరినొకరు భావోద్వేగపరంగా మరింత మెరుగ్గా కనెక్ట్ అవుతారు.ఇది మీకు మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. దీనివల్ల మీ ఇద్దరికీ ఒకరితో ఒకరు మరింత నిర్మొహమాటంటా మాట్లాడగలుగుతారు. సమస్యలను కలిసి పరిష్కరించుకుంటారు.
మీ కమ్యూనికేషన్ పెరుగుతుంది
ఒక పరిశోధన ప్రకారం.. సెక్స్ సమయంలో ఉద్వేగం పొందిన వారు సానుకూలంగా మాట్లాడుతారు.. అవి వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవి. దీనివల్ల భాగస్వాములిద్దరూ ఒకరినొకరు ఎక్కువగా ప్రేమించుకుంటారు. ఇది వారి సంబంధాన్ని బాగా ఉంచుతుంది.
మీ బంధం బలంగా ఉంటుంది
ఆడవారు భావప్రాప్తిని పొందితే వారి బంధం మరింత బలంగా ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నారు. భావప్రాప్తి తర్వాత మహిళలు మరింత రిలాక్స్ గా ఫీలవుతారు. దీనితర్వాత పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ ఆక్సిటోసిన్ స్థాయిలు పెరగడం ప్రారంభమవుతాయి. ఇది మీ శృంగార ప్రేమ భావాలను పెంచుతుంది. అంతేకాదు ఇది మీ ఇద్దరి బంధాన్ని బలోపేతం చేస్తుంది.
స్త్రీ భావప్రాప్తి పురుషులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది
శృంగారంలో మీ భావప్రాప్తి మీకు మాత్రమే కాదు మీ పురుష భాగస్వామికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. భావప్రాప్తిని అనుభవించే స్త్రీలు వారి భాగస్వామి వ్యక్తిత్వంలో హాస్యం, ఎక్కువ ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలను కలిగి ఉంటారు. భావప్రాప్తి కారణంగా మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇది మీ సంబంధాన్ని సాఫీగా, సరళంగా చేస్తుంది.భావప్రాప్తి శారీరక ప్రయోజనాలను కలిగించడమే కాకుండా మీ భాగస్వామితో బలమైన బంధాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది.