- Home
- Life
- Relationship
- Double Dating: వేగంగా పెరుగుతోన్న డబుల్ డేటింగ్ కల్చర్.. అసలేంటీ కొత్త ట్రెండ్.?
Double Dating: వేగంగా పెరుగుతోన్న డబుల్ డేటింగ్ కల్చర్.. అసలేంటీ కొత్త ట్రెండ్.?
Double Dating: మారుతోన్న టెక్నాలజీతో పాటు కల్చర్ కూడా మారుతోంది. తాజాగా డబుల్ డేటింగ్ అనే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఇంతకీ ఏంటీ డబుల్ డేటింగ్.? ఇది ప్రేమ నిర్వచనాన్ని ఎలా మార్చుతోంది? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డబుల్ డేటింగ్ అంటే ఏంటి.?
ఇప్పటి యువతలో డబుల్ డేటింగ్ అనే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఇందులో ఒక అబ్బాయి–అమ్మాయి మాత్రమే కాకుండా, రెండు జంటలు కలిసి డేట్‌కు వెళ్తారు. అంటే డేట్‌లో ఒకేసారి నలుగురు వ్యక్తులు పాల్గొంటారన్నమాట. అందరూ కలిసి కేఫే, పార్క్, సినిమా, రెస్టారెంట్ లేదా ఏదైనా యాక్టివిటీలో పాల్గొంటారు. ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్‌కి చెందిన.. Year In Swipe 2025 రిపోర్ట్ ప్రకారం, డబుల్ డేటింగ్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. అందులోనూ ఈ ట్రెండ్‌లో మహిళలు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
టిండర్‌లో డబుల్ డేటింగ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
టిండర్ ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా డబుల్ డేటింగ్ ఫీచర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా.. ఒక్కో యూజర్ తనతో పాటు ముగ్గురు స్నేహితులను టీమ్‌లోకి తీసుకోవచ్చు. అందరి ప్రొఫైల్స్ కలిపి ఒక గ్రూప్ కార్డ్ గా కనిపిస్తుంది. మరో గ్రూప్ ఈ కార్డ్‌కు రైట్ స్వైప్ చేస్తే, మిమ్మల్ని చూసే గ్రూప్‌లోనూ కనీసం ఒకరు రైట్ స్వైప్ చేస్తే మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయిన తర్వాత రెండు గ్రూపులు ఒక గ్రూప్ చాట్ రూమ్ లో మాట్లాడుకోవచ్చు. అక్కడి నుంచి డేట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా యువత సేఫ్‌గా, రిలాక్స్‌గా కొత్త వారిని పరిచయం చేసుకోవచ్చు.
డబుల్ డేటింగ్‌లో పార్టనర్ అసలు స్వభావం ఎలా తెలుస్తుంది?
డబుల్ డేటింగ్‌లో పార్టనర్ అసలు స్వభావం ఎలా తెలుస్తుంది?డబుల్ డేటింగ్ ద్వారా మీ పార్టనర్ మీ స్నేహితుల మధ్య ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎంతగా కలిసిపోతాడు, సరదాగా ఉంటాడా, ఇతరులను గౌరవిస్తున్నాడా లేదా.? నిజమైన స్వభావం ఎలా ఉంటుంది.? లాంటి విషయాలను గమనించవచ్చు. ఒకరితో ఒకరు ఉండగా కనబడని వ్యక్తిత్వం, గ్రూప్‌లో స్పష్టంగా బయటపడుతుంది.
రెడ్ ఫ్లాగ్స్ (జాగ్రత్త లక్షణాలు) గుర్తించడం సులభం.
గ్రూప్‌లో ఉండటం వల్ల మీ స్నేహితుల అభిప్రాయం కూడా తెలుస్తుంది. పార్టనర్‌లో ఉన్న అహంకారం, అసహనం, ఈర్ష్య, అసభ్య ప్రవర్తన, మాట్లాడే తీరు, ఇతరులతో ప్రవర్తించే విధానం వంటి విషయాలు త్వరగా బయటపడతాయి. అందుకే ఇది రెడ్ ఫ్లాగ్స్‌ను తొందరగా గుర్తించే సులభమైన మార్గం ఇది.
సింగిల్ డేట్ కంటే డబుల్ డేట్ ఎందుకు సౌకర్యంగా ఉంటుంది?
సింగిల్ డేట్‌లో సాధారణంగా ఏమి మాట్లాడాలి? ఏం ధరించాలి? ఎదుటివారు నచ్చుతారా? అనే ఒత్తిడిలో ఉంటాం. కానీ డబుల్ డేట్‌లో వాతావరణం సహజంగా, హాయిగా ఉంటుంది. చర్చలు సహజంగానే సాగుతాయి. ఒక టీమ్‌లాగా ఉండడంతో ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. అందుకే ఈ ట్రెండ్ యువతలో వేగంగా పాపులర్ అవుతోంది.

