దిష్టి నిజమేనా? స్మృతి మంధాన, సమంత లైఫ్ ఇలా అవ్వడానికి దిష్టే కారణమా?
ఇండియన్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. హల్దీ, మెహెందీ గ్రాండ్ గా చేసుకున్న తర్వాత పెళ్లి ఆగిపోయింది. దిష్టి కారణంగానే ఇలా జరిగిందా?

స్మృతి మోసపోయిందా?
ఇండియన్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వార్త చాలా వైరల్ అయ్యింది. గ్రాండ్ గా పెళ్లి జరుగుతుంది అనుకునేలోగా… ఆ వివాహం కాస్త ఆగిపోయింది. ఈ పెళ్లి ఆగిపోవడానికి చాలా కారణాలు వినపడుతున్నాయి. స్మృతి తండ్రి ఆరోగ్యం బాలేదని కొందరు అంటే, పలాష్ కు వేరే అమ్మాయితో సంబంధం ఉందని, స్మృతిని మోసం చేశాడని ఓ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి కొందరు దిష్టి తగలడం వల్లే ఈ జంటకు ఇలా జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.
సమంత-నాగ చైతన్య
సమంత- నాగ చైతన్య జంటను చూసి కూడా అందరూ జోడి అంటే ఇలా ఉండాలి అనుకునేవారు. ఈ జంటకు కూడా దిష్టి తగలడం వల్లనే విడిపోయారు అని ఇప్పటికీ కామెంట్స్ వినపడుతూనే ఉంటాయి. అసలు, దిష్టి అనేది నిజమేనా?
దిష్టి ఎలా తగులుతుంది?
ఎవరైనా మీపై అసూయపడితే, అక్కడ ఒక 'డిస్ట్రెస్ రింగ్' ఏర్పడుతుంది. అది తరంగంలా మీ దగ్గరకు వస్తుంది. అది మీ శక్తిని నాశనం చేస్తుంది. ఫలితంగా దిష్టి తగులుతుందని నమ్ముతారు.
దిష్టి ఎవరి వల్ల తగులుతుంది?
బయటివాళ్లకు, మీకు పరిచయం లేనివాళ్లకు మీ విజయం, అందం గురించి ఆలోచనే రాదు. వాళ్లకు ఎలాంటి తేడా ఉండదు. మనవాళ్లకే మన విషయాలు ముఖ్యం. మనవాళ్లే మన పాలిట శత్రువులు అంటారు. అలాగే మనవాళ్ల వల్లే మనకు దిష్టి తగులుతుంది.
దిష్టి తగిలితే ఏమవుతుంది?
దిష్టి తగిలితే తిండి సహించదు, ఆరోగ్యం పాడవుతుంది, గొడవలు వస్తాయి, ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది. విజయం కూడా తగ్గుతుంది. జంటగా ఫోటో పెట్టిన రోజే గొడవ జరుగుతుందని చాలా మంది చెప్పడం మీరు వినే ఉంటారు.
దిష్టి తగిలినప్పుడు ఏం చేయాలి?
పెద్దవాళ్లతో దిష్టి తీయించుకోవాలి
ఉప్పు నీటితో స్నానం చేయాలి
హనుమాన్ చాలీసా చదవాలి

