- Home
- Business
- Jio Plans: అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 3 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్
Jio Plans: అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 3 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్
Jio Plans: రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తోంది. రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, OTT సబ్‌స్క్రిప్షన్లు వంటివి కోరుకునే వారికి జియో కొత్త ప్లాన్స్‌ను తీసుకొచ్చింది.

28 రోజుల ప్లాన్ – రూ. 449 ప్యాక్
ఈ ప్లాన్ తక్కువ కాలం ఉన్నప్పటికీ ప్రయోజనాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. రోజుకు 3GB డేటా, మొత్తం 84GB లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, JioHome సేవకు 2 నెలల ఉచిత యాక్సెస్, మొబైల్/టీవీ కోసం 3 నెలల జియో సినిమా హాట్‌స్టార్ ప్లాన్, గూగుల్ జెమినీ ప్రోకు 18 నెలల ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది. అతి తక్కువ ధరలో OTT + AI సర్వీసులను కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు.
రూ. 1199 ప్లాన్ – 84 రోజుల ప్రయోజనాలు
మూడు నెలలకు పైగా చెల్లుబాటు ఉండే ఈ ప్లాన్ బడ్జెట్‌లో బెటర్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 3GB డేటా (మొత్తం 252GB) లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, JioHome రెండు నెలల ట్రయల్ లభిస్తుంది. మొబైల్/టీవీ కోసం 3 నెలల హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. 50జీబీ జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్ పొందొచ్చు. అలాగే 18 నెలల గూగుల్ జెమినీ ప్రో ఉచితంగా పొందొచ్చు.
రూ. 1799 ప్లాన్ – OTT యూజర్లకు బెస్ట్ ఆప్షన్
OTT కంటెంట్‌ను ఎక్కువగా చూస్తూ మంచి డేటా అవసరమున్న వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. 84 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చారు. రోజుకు 3GB డేటా లభిస్తుంది. ఎలిజిబుల్ యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, JioHome 2 నెలల ట్రయల్ లభిస్తుంది. మొబైల్/టీవీ కోసం 3 నెలల హాట్‌స్టార్ జియోసినిమా పొందొచ్చు. వీటితో పాటు 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ సేవలు పొందొచ్చు. ఈ ప్లాన్‌లో ఒకేసారి డేటా, కాలింగ్, నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనాలు పొందొచ్చు.
ఈ ప్లాన్‌ల ప్రత్యేకత ఏంటి.?
ఈ అన్ని ప్లాన్స్ డేటా, కాలింగ్, ఓటీటీ, ఏఐ టూల్స్ కలయికతో వస్తాయి. మార్కెట్లో ఇదే ధరలో ఇంతకన్నా ఎక్కువ ప్రయోజనాలు అరుదుగా చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ వాలిడిటీతో స్టేబుల్ యూజర్లు చాలా సేవ్ అవుతారు. క్లౌడ్ స్టోరేజ్, హైస్పీడ్ 5G సపోర్ట్ పెద్ద ఆకర్షణగా చెప్పొచ్చు.
ఈ ప్లాన్‌లను ఎలా రీఛార్జ్ చేయాలి?
జియో రీఛార్జ్ చేయడం చాలా సులభం. మైజియో యాప్ లేదా జియో.కామ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఏదైనా Jio డిజిటల్ స్టోర్‌లో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ మూడు ప్లాన్‌లు ప్రస్తుతం జియో యూజర్లలో అత్యధికంగా డిమాండ్ ఉన్నవి. తక్కువ ధరకే పూర్తి ప్రయోజనాలు పొందాలనుకునే వారికి ఇవి సరైన ఎంపికలుగా చెప్పొచ్చు.

