- Home
- Life
- Relationship
- Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం మీ భాగస్వామి ఇలా చేస్తుంటే.. మీకు దూరమవుతున్నట్లే!
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం మీ భాగస్వామి ఇలా చేస్తుంటే.. మీకు దూరమవుతున్నట్లే!
స్నేహమైనా, ప్రేమైనా, పెళ్లైనా ఏదైనా సరే.. ముందుకు సాగాలంటే ఆ బంధంలో ఉన్న వ్యక్తుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటానికి, విడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకరికి ప్రేమ ఉండి మరొకరికి లేకపోతే ఆ బంధం నిలవడం కష్టమవుతుంది. ఆ బంధం నుంచి విడిపోవడానికి సాకులు వెతుక్కుంటారు. చాణక్య నీతి ప్రకారం మీ భాగస్వామి లేదా స్నేహితుడు మీకు దూరమవుతున్నారని చెప్పే కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ చూద్దాం.

ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. ఆయన రాసిన నీతి సూత్రాలు మానవ జీవితాలకు ఎప్పటికీ ఉపయోగపడేలా ఉంటాయి. చాణక్యుడు బోధించిన ఎన్నో విషయాలు నేటీకి ఫాలో అవుతూ ఉంటారు. ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి తన జీవితంలో విజయం ఎలా సాధించాలి? బంధాలను ఎలా కాపాడుకోవాలి? శత్రువులను ఎలా గుర్తించాలి? వంటి ఎన్నో విషయాలను బోధించాడు. చాణక్య నీతి ప్రకారం మీ భాగస్వామి మీకు దూరమవుతుందని చెప్పే కొన్ని సంకేతాలున్నాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
మోసం చేసే భాగస్వామి ఎలా ఉంటారు?
భార్యా భర్తల బంధం ప్రేమ, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తుంటే వారు ప్రతి చిన్న విషయానికి మీ తప్పులను ఎత్తి చూపే అవకాశం ఉందని ఆచార్య చాణక్యుడు తన నీతి సూత్రాల్లో బోధించాడు. భవిష్యత్తులో మీ సంబంధం విడిపోతే.. కొన్ని తప్పుల కారణంగా మీ సంబంధం విచ్ఛిన్నమైందని మీరు భావించవచ్చు.
సాకులు చెబుతుంటే?
మీ భాగస్వామి చిన్న విషయాలకు కూడా సాకులు, అబద్దాలు చెబుతుంటే వారు మిమ్మల్ని మోసం చేస్తుండవచ్చు. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా దాచి ఉంచినప్పుడు మాత్రమే సాకులు చెబుతాడు. అలాంటి పరిస్థితిలో మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడటం ముఖ్యం.
అలవాట్లు మారుతుంటే?
చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ఎవరినైనా ఆకర్షించాల్సి వచ్చినప్పుడు లేదా ప్రభావితం చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే తన జీవితంలో మార్పులు చేసుకుంటాడు. మీ భాగస్వామి అలవాట్లు మారుతుంటే దాన్ని విస్మరించవద్దని చాణక్యుడు తన బోధనల్లో పేర్కొన్నాడు.
మోసం చేసే స్నేహితులు ఎలా ఉంటారు?
చాణక్యుడు తన నీతి సూత్రాల్లో స్నేహితుల గురించి చాలా విషయాలు చెప్పాడు. మోసం చేసే స్నేహితులకు దూరంగా ఉండాలని చాణక్యుడు బోధించాడు. మోసం చేసే స్నేహితుడు కష్టంలో తోడుగా ఉండడు. వారితో అవసరమైన ప్రతిసారి తప్పించుకొని తిరిగేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో కలవడానికి కూడా ఇష్టపడరు.
విషయాలు దాచడం..
చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా విషయాన్ని దాచినప్పుడు అది అతని ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఎదుటి వ్యక్తి పట్ల తన ప్రవర్తన మారుతుంది. మీ స్నేహితుడి ప్రవర్తన మారుతున్నట్లు మీకు అనిపిస్తే అతను మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుండచ్చు.