స్వలింగ సంపర్కులకు కూడా ఈ లైంగిక వ్యాధులొస్తయ్.. జాగ్రత్తగా ఉండలేదో ?
లైంగిక కార్యకలాపాల వల్ల లైంగిక సంక్రమణ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ వ్యాధులు స్వలింగ సంపర్కుకు వచ్చే అవకాశం తక్కువ. కానీ ఛాన్సెస్ మాత్రం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
ఎయిడ్స్ లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు ప్రాణాంతకం అన్నసంగతి అందరికీ తెలిసిందే. స్త్రీ పురుషుల రిలేషన్ షిప్ లో లైంగిక సంక్రమణ వ్యాధుల ప్రమాదం ఎక్కువ. కానీ స్వలింగ సంపర్క సంబంధాలలో కూడా ఎస్టీడీల ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ అంటే చొచ్చుకుపోవడం మాత్రమే కాదన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే స్వలింగ సంపర్కులకు ఎయిడ్స్ తో సహా ఎన్నో లైంగిక సంక్రమణ అంటువ్యాధులు కూడా రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి సెక్స్ ద్వారా సంక్రమణ వ్యాప్తి చెందడానికి అతిపెద్ద కారణం శరీర ద్రవం. స్వలింగ సంపర్క సంబంధాలలో శరీర ద్రవం వ్యాప్తిచెందుతుంది. లెస్బియన్ జంటలలో లైంగిక సంక్రమణ అంటువ్యాధులు వచ్చే ప్రమాదం సాధారణంగా తక్కువగా ఉంటుంది. కానీ ప్రమాదం లేకపోలేదు.
lesbians
స్వలింగ సంపర్కులకు ఎయిడ్స్ వస్తుందా?
ఎయిడ్స్ అనేది హెచ్ఐవి వైరస్ వల్ల వస్తుంది. అయితే హెచ్ఐవి సంక్రమణకు ఏకైక మూలం సెక్స్ లేదా శారీరక సంబంధాలు కాదని తెలుసుకోవడం ముఖ్యం. ముద్దు లేదా ఓరల్ సెక్స్ వల్ల హెచ్ఐవి రాదు. ఇది సోకిన వీర్యం లేదా రక్తం హెచ్ఐవి సంక్రమణకు దారితీస్తుంది. అందుకే స్వలింగ జంటలకు సెక్స్ ద్వారా ఎయిడ్స్ వచ్చే అవకాశం తక్కువ. అయితే ఈ వ్యాధి సోకిన రక్తం, ఇంజెక్షన్లు, తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అంతేకాదు స్వలింగ జంటలకు క్లామిడియా, గోనేరియా, సిఫిలిస్, హెర్పెస్ వచ్చే ప్రమాదం ఉంది.
క్లామిడియా
క్లామిడియా అనేది ఒక బాక్టీరియల్ వ్యాధి. ఈ వ్యాధి వల్ల రోగిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఆకస్మిక రక్తస్రావం, యోనిలో దురద, చికాకు వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇవి కూడా ఆకస్మత్తుగా కనిపిస్తాయి.
గోనేరియా
గోనేరియా అనేది బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే లైంగిక సంక్రమణ. ఈ వ్యాధి తీవ్రమైనప్పుడు యోని నుంచి తెల్లని ఉత్సర్గ, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, నొప్పి లేదా గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇవి గోనేరియా లక్షణాలు. కాగా ఈ సంక్రమణ సంతానలేమికి దారితీస్తుంది.
సిఫిలిస్
సిఫిలిస్ అనేది ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ప్రారంభంలో నొప్పిలేని దద్దుర్లను కలిగిస్తుంది. అంతేకాదు లైంగిక కార్యకలాపాల్లో ముందుకు వెళ్లలేరు. దీన్ని ప్రారంభ దశలో గుర్తించకపోతే ఇది మీ మెదడు, నరాలు, కళ్లు, గుండెకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. మహిళల లైంగిక అవయవాల ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహిళలకు సిఫిలిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
జననేంద్రియ హెర్పెస్
హెర్పెస్ అనేది ఒక సాధారణ లైంగిక సంక్రమణ సంక్రమణ. నొప్పి, బొబ్బలు, జననేంద్రియ భాగాలలో దురద ఈ సంక్రమణ లక్షణాలు. కానీ చాలాసార్లు వ్యక్తులకుు ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించవు. కాబట్టి క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం మంచిది.
అందుకే స్వలింగ సంపర్కులు డెంటల్ డ్యామ్ లను ఖచ్చితంగా ఉపయోగించాలి. దీంతో మీ నోటి నుంచి బ్యాక్టీరియా యోనికి చేరదు. దీనితో పాటు జననేంద్రియ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతోనే మీ ఆరోగ్యం బాగుంటుంది.