సెక్స్ కు ముందు ఫోర్ ప్లేను మిస్ చేయకండి.. ఎందుకంటే?
కొంతమంది జంటలు ఫోర్ ప్లే గురించి మర్చిపోయి సెక్స్ లో పాల్గొంటారు. కానీ దీనివల్ల లైంగిక జీవితం ఆనందంగా సాగదు. అలాగే మీ సెక్స్ లైఫ్ బోరింగ్ గా కూడా ఉంటుంది.
సంభోగంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ సెక్స్ కు ముందు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. దీనిలో ఫోర్ ప్లే ఒకటి. ఫోర్ ప్లే లో ముద్దులు, కౌగిలింతలు ఉంటాయి. ఫోర్ ప్లే లో పాల్గొనకపోతే లైంగిక ప్రేరణ లోపిస్తుంది. ఇది మహిళలకు లూబ్రికేషన్ లోపానికి దారితీస్తుంది. ఇది చివరికి సెక్స్ ను ఆనందంగా కాకుండా బాధాకరంగా మారుస్తుంది.
ఫోర్ ప్లే అంటే ఏంటి?
సంభోగానికి ముందు భాగస్వాముల మధ్య ఫోర్ ప్లే ఖచ్చితంగా ఉండాలంటున్నారు నిపుణులు. నెమ్మదిగా, ఆప్యాయంగా చేసే ఈ లైంగిక చర్య లైంగిక కోరికను రేకెత్తిస్తుంది. లైంగిక చర్యలో వేగాన్ని పొందడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు.
Image: Getty Images
ఫోర్ ప్లే ప్రయోజనాలు
చాలా మంది సెక్స్ ను మంచి వ్యాయామంగా భావిస్తారు. ఎందుకంటే ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. అలాగే దీన్ని చాలా మంది సంతానోత్పత్తికి ఒక చర్యగా భావిస్తారు. కానీ అది అంతకంటే చాలా ఎక్కువ. శృంగారంలో పాల్గొనడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. కానీ సెక్స్ కంటే ముందు మీరు ఫోర్ ప్లే లో పాల్గొనాలి. అసలు ఫోర్ ప్లే మీ ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
ఫోర్ ప్లే మూడ్ ను సెట్ చేస్తుంది
దంపతుల మధ్య టచింగ్, మేకింగ్ అన్నీ ఆనందకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. ఇది చివరికీ భాగస్వాములిద్దరికీ మంచి లైంగిక సంతృప్తిని కలిగి ఉండటానికి సహాయపడుతుంది.
భావోద్వేగ సంబంధం
మీరు ఫోర్ ప్లేలో పాల్గొంటే.. ఇది మీ భాగస్వామితో మంచి భావోద్వేగ సంబంధాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది శారీరకంగా కనెక్ట్ కావడం గురించి మాత్రమే కాదు మిమ్మల్ని మానసికంగా మీ భాగస్వామికి మరిత దగ్గర చేస్తుంది.
Image: Getty Images
ఫోర్ ప్లే సెక్స్ నుఆహ్లాదకరంగా చేస్తుంది
మీరు ఫోర్ ప్లేలో పాల్గొంటే మీ భాగస్వామితో సెక్స్ మొత్తం ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది. ఇది లైంగిక ప్రేరేపణను పెంచుతుంది. అలాగే లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.
ఫోర్ ప్లే సెక్స్ ను తక్కువ బాధాకరంగా చేస్తుంది
శృంగారం వల్ల నొప్పి రావొద్దంటే..యోనిని లూబ్రికేషన్ చేయడానికి సహాయపడే ఫోర్ ప్లేను స్కిప్ చేయొద్దని నిపుణులు చెబుతున్నారు.
Marrige sex
ఫోర్ ప్లే ఒత్తిడిని తగ్గిస్తుంది
ఒత్తిడిని తగ్గించేందుకు ఎన్నో పద్దతులు ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించేందుకు మీరు చేయాల్సిందల్లా మీ భాగస్వామిని ఫోర్ ప్లేలో పాల్గొనమని చెప్పండి. ఎందుకంటే ఇది ఫీల్ గుడ్ హార్మోన్లను విడుదల చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.