Relationship: మీ లవర్ తో విడిపోయారా? బ్రేకప్ తో ఎన్ని ప్రయోజనాలో..!
ఒక్కసారి ప్రేమలో విఫలం అయితే చాలా మంది జీవితమే కోల్పోయినట్లు ఫీలౌతూ ఉంటారు. కానీ, బ్రేకప్ వల్ల కూడా కొన్ని లాభాలున్నాయి అని మీకు తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
బ్రేకప్ తో లాభాలున్నాయా?
ప్రేమ ఒక అందమైన అనుభూతి. దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో తమ జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడతారు. ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచం గురించి పెద్దగా పట్టించుకోరు. ఆ ప్రేమలోకంలోనే విహరిస్తారు. కానీ, ప్రేమించిన వారిని పెళ్లి చేసుకునే అదృష్టం అందరికీ దొరక్కపోవచ్చు. అన్ని ప్రేమలు సక్సెస్ కాలేవు. చాలా కారణాల వల్ల బ్రేకప్ కి దారి తీస్తాయి. ఒక్కసారి ప్రేమలో విఫలం అయితే చాలా మంది జీవితమే కోల్పోయినట్లు ఫీలౌతూ ఉంటారు. కానీ, బ్రేకప్ వల్ల కూడా కొన్ని లాభాలున్నాయి అని మీకు తెలుసా? అవేంటో చూద్దామా...
బ్రేకప్ తర్వాత లైఫ్..
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి వదిలి వెళ్ళినప్పుడు బాధ వర్ణనాతీతం. మనస్తాపాలు, అపార్థాలు లేదా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల బ్రేకప్ అవ్వడం సర్వసాధారణం. బ్రేకప్ తర్వాత బాధపడటం సహజం. కొంతమంది బ్రేకప్ తర్వాత పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తారు, మానసిక క్షోభకు గురవుతారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఒకరు మనల్ని వదిలి వెళ్ళినంత మాత్రాన జీవితాన్ని నాశనం చేసుకోవడం మూర్ఖత్వం.
ఆత్మవిశ్వాసాన్ని పెంచే బ్రేకప్..
మన జీవితంలో ఏం జరిగినా దానిలో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి సానుకూల కోణం, రెండోది ప్రతికూల కోణం. బ్రేకప్‌లో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి బ్రేకప్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
లవ్ బ్రేకప్ ఎంత బాధ కలిగించినా, అది చాలా పాఠాలు నేర్పుతుంది. మిమ్మల్ని తిరస్కరించిన వారి ముందు తల ఎత్తుకుని నిలబడతాననే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. బ్రేకప్ బాధాకరం అయినప్పటికీ, అది జీవితంలో బతికే ధైర్యాన్నిస్తుంది.
నచ్చినట్లుగా బతికే స్వేచ్ఛ
ప్రేమలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా బతకలేం. ప్రతిదానికీ మీ భాగస్వామిని అడగాలి. వారు చెప్పేది వినాలి. కానీ బ్రేకప్ తర్వాత ఎవరి మీదా ఆధారపడకుండా స్వేచ్ఛగా బతకవచ్చు. ఒంటరిగా ఉండటం మంచిదని తెలుస్తుంది. ఎవరితోనూ కలవకుండా మీ ఇష్టం వచ్చినట్లు బతకవచ్చు.
ప్రేమలో ఉన్నప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవడం మర్చిపోతాం. మన గురించి పట్టించుకోం. బ్రేకప్ తర్వాత మనకి మనం ఎక్కువ సమయం ఇస్తాం. మన ఇష్టాయిష్టాల గురించి తెలుసుకుని, ఆరోగ్యం, అందం గురించి శ్రద్ధ తీసుకుంటాం. మునుపటి కంటే ఎక్కువ సమయం మనతో మనం గడుపుతాం. ఆత్మపరిశీలన చేసుకుంటాం. మనకి మనం సమయం ఇవ్వడమే కాకుండా, కుటుంబానికి కూడా సమయం ఇస్తాం, వారి కష్టసుఖాల గురించి ఆరా తీస్తాం.
బ్రేకప్ తో ఆరోగ్యం కూడా..
బ్రేకప్ వల్ల శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ భాగస్వామి మీతో ఉన్నప్పుడు రాత్రంతా వారితో మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల సరిగ్గా నిద్రపోరు. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. బ్రేకప్ తర్వాత ఎవరితోనూ రాత్రంతా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. రాత్రంతా బాగా నిద్రపోవచ్చు. దీనివల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బ్రేకప్ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు బతకవచ్చు. ఎవరి అనుమతి అవసరం లేదు. మీ ఇష్టమైన బట్టలు వేసుకోవచ్చు, మీ ఇష్టమైనవి తినవచ్చు, మీ ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చు. ఎవరి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా బతకవచ్చు. ప్రేమ అనేది జీవితంలో ఒక భాగమే కానీ, జీవితమంతా కాదు. ప్రతిదానికీ ఒక హద్దు ఉండాలి. ఎవరు మన జీవితంలో ఉన్నా లేకపోయినా, మన జీవితాన్ని మనం బతికేస్తామనే ఆత్మవిశ్వాసం ఉండాలి.