వారానికోసారి శృంగారంలో పాల్గొన్నా..!
భాగస్వాముల మధ్య సెక్స్ చాలా కామన్. దీన్ని ప్రేమకు గుర్తుగా భావిస్తారు. కానీ వారానికి ఒకసారి సెక్స్ లో పాల్గొన్నే వ్యక్తులు ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతుకుతారని పలు సర్వేలు వెళ్లడిస్తున్నాయి.
sex life
భాగస్వాముల మధ్య సెక్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇదే వారిద్దరి మధ్య ప్రేమను రెట్టింపు చేస్తుంది. నమ్మకాన్ని పెంచుతుంది. గొడవలు అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. మనస్పర్థలను పోగొడుతుంది. ముఖ్యంగా ఇది వారి ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. సైన్స్ ప్రకారం.. కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం వల్ల మీ ఆయుష్షు పెరుగుతుంది. చదవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం గురించి మనందరికీ తెలుసు. కానీ రెగ్యులర్ గా సెక్స్ చేయడం కూడా ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒక భాగమని మీకు తెలుసా?
Image: Getty Images
సెక్స్ మనకు చాలా రకాలుగా అవసరం. అంటే సెక్స్ శారీరక ఆనందం గురించి కాదు. ఇది మీ మానసిక స్థితిని పెంచడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, రక్తపోటును కంట్రోల్ చేయడానికి, గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి అంటూ సెక్స్ ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.
Image: Getty Images
వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది అందరికీ తెలసిందే. అయితే ఆరోగ్యకరమైన అలవాట్ల జాబితాలోకి సెక్స్ కూడా చేరిందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ దీర్ఘాయువుతో పాటు దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని ఎన్నో ఆధారాలు ఉన్నాయి.
Image: Getty Images
అధ్యయనం ఏం చెబుతోందంటే..
సెక్స్ తో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పలు అధ్యయనాల ప్రకారం.. సెక్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
Image: Getty Images
ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కేసులు బాగా పెరిగిపోతున్నాయి. న్యూ ఇంగ్లాండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధనల ప్రకారం.. గుండెజబ్బులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోవడానికి కారణమవుతాయి. 65 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న 1,120 మంది పురుషులు, మహిళలపై 22 సంవత్సరాల సుదీర్ఘ అధ్యయనం ఆధారంగా ఈ వాదన వచ్చింది.
Image: Getty Images
క్రమం తప్పకుండా సెక్స్ చేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా.. ఆ తర్వాత దాని ప్రమాదకరమైన లక్షణాలను కూడా తగ్గిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. లైంగికంగా చురుగ్గా ఉండేవారాకి గుండెపోటు తర్వాత కూడా ఎక్కువ రోజులు బతికే అవకాశాలను పెంచుతుంది.
సెక్స్ ఎంత ఆరోగ్యకరమైనది?
వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనే వారికి గుండె పోటు వచ్చే అవకాశం 27 శాతం తక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. అప్పుడప్పుడు శృంగారంలో పాల్గొనే వారికి 8 శాతం తక్కువ అవకాశం ఉందట. గుండెపోటు తర్వాత వారానికి ఒకసారి సెక్స్ లో పాల్గొన్నా ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. పలు అధ్యయనాల ప్రకారం.. వారానికి ఒకసారి సెక్స్ చేయడం వల్ల మీ మనుగడ అవకాశాలు 37 శాతం పెరుగుతాయి.
పలు అధ్యయనాల ప్రకారం..
శృంగారాన్ని దీర్ఘాయువుతో ముడిపెట్టిన అధ్యయనాలు చాలానే ఉన్నాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ ప్రకారం.. తక్కువ సార్లు సెక్స్ లో పాల్గొన్న పురుషులలో అంగస్తంభన గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. లైంగికంగా చురుగ్గా ఉండే పురుషులకు లిబిడో, శారీరక శ్రమ సామర్థ్యం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం పేర్కొందది. సెక్స్ సామర్థ్యం మొత్తం ఆరోగ్యానికి మంచి సంకేతమంటున్నారు నిపుణులు.