MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు

Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు

Pregnancy Symptoms: మహిళలు గర్భం దాల్చిన ప్రారంభంలో వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఈ సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకుంటే, వైద్య పరీక్షలకు ముందే గర్భధారణను ప్రాథమికంగా గుర్తించే అవకాశం ఉంటుంది.

2 Min read
Author : Nandini Arava
Published : May 08 2026, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రెగ్నెన్సీ ముఖ్య లక్షణం
Image Credit : Asianet News

ప్రెగ్నెన్సీ ముఖ్య లక్షణం

ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మొట్టమొదట వచ్చే సంకేతం పీరియడ్స్ ఆగిపోవడం. క్రమం తప్పకుండా వచ్చే పీరియడ్స్ అయ్యే మహిళల్లో లేటు అయితే గర్భం దాల్చినట్లుగా భావించవచ్చు, అయితే మానసిక ఒత్తిడి లేదా ఇతర ఆరోగ్య మార్పుల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. దీనితో పాటు వాంతులు రెండో నెల నుండే ప్రారంభమవ్వచ్చు. దీన్నే మార్నింగ్ సిక్‍నెస్ అంటారు. పేరుకు తగ్గట్టుగా కేవలం ఉదయం మాత్రమే కాకుండా రోజులో ఏ టైంలోనైనా ఇబ్బంది పెట్టవచ్చు. ఈ శారీరక మార్పులను గమనించడం ద్వారా ప్రెగ్నెన్సీ ప్రాథమికంగా అంచనా వేయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హార్మోన్ల మార్పులు
Image Credit : Getty

హార్మోన్ల మార్పులు

గర్భధారణ ప్రారంభంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల శారీరక మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా రొమ్ములు సున్నితంగా మారి ఉబ్బినట్లు లేదా భారంగా అనిపించడం, అలాగే వాటి చుట్టూ ఉండే చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే సమయంలో శరీరంలో ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరగడం వల్ల విపరీతమైన నీరసం, నిద్రమత్తు ఉంటాయి. మరోవైపు, పెరుగుతున్న గర్భాశయం మూత్రాశయంపై ఒత్తిడిని కలిగించడం వల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది, ఇది గర్భిణుల్లో కనిపించే అత్యంత సాధారణ లక్షణం.

Related Articles

Related image1
Pregnancy Age: గర్భం దాల్చడానికి సరైన వయసెంత? ఈ ఏజ్ దాటితే రిస్క్ అంటున్న నిపుణులు
Related image2
Pregnancy Calculation: పెళ్లై నెల.. కానీ నెలన్నర ప్రెగ్నెన్సీ .. ఇది సాధ్యమేనా?
34
ఇంప్లాంటేషన్ బ్లీడింగ్
Image Credit : social media

ఇంప్లాంటేషన్ బ్లీడింగ్

కొంతమంది మహిళలకు పీరియడ్స్ సమయంలో కొద్దిగా రక్తస్రావం అవుతుంది. దీన్ని 'ఇంప్లాంటేషన్ బ్లీడింగ్' అంటారు. ఇది పీరియడ్స్ రక్తస్రావం కన్నా చాలా తక్కువగా, గులాబీ లేదా గోధుమ రంగు చుక్కల్లా కనిపిస్తుంది. దీనితో పాటు కడుపులో కొద్దిగా నొప్పి కూడా ఉండొచ్చు. హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ప్రవర్తనలో మార్పులు వస్తాయి. కొన్నిసార్లు సంతోషంగా, మరికొన్నిసార్లు కోపంగా లేదా విచారంగా అనిపిస్తుంది. కొన్ని వాసనలు పడకపోవడం, కొన్ని పదార్థాలనే తినాలనిపించడం వంటివి కూడా గర్భధారణ లక్షణాలే.

44
ప్రెగ్నెన్సీ కిట్‍తో పరీక్ష చేయించుకోండి
Image Credit : Getty

ప్రెగ్నెన్సీ కిట్‍తో పరీక్ష చేయించుకోండి

ఈ లక్షణాలు కనిపించినప్పుడు, 'ప్రెగ్నెన్సీ కిట్' ఉపయోగించి ఇంట్లోనే పరీక్ష చేసుకోవడం మంచిది. ఉదయం మొదటి మూత్రంతో పరీక్షిస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఫలితం పాజిటివ్ వస్తే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సరైన సమయంలో వైద్య సహాయం తీసుకోవడం తల్లి, బిడ్డ ఇద్దరినీ సురక్షితంగా ఉంచుతుంది. డాక్టర్ సూచించిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Recommended image3
Child Psychology: మీ పిల్లల్లో ఈ 5 లక్షణాలు ఉంటే.. మీరు సూపర్ కిడ్‍ని పెంచుతున్నట్లే!
Related Stories
Recommended image1
Pregnancy Age: గర్భం దాల్చడానికి సరైన వయసెంత? ఈ ఏజ్ దాటితే రిస్క్ అంటున్న నిపుణులు
Recommended image2
Pregnancy Calculation: పెళ్లై నెల.. కానీ నెలన్నర ప్రెగ్నెన్సీ .. ఇది సాధ్యమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved