MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Child Psychology: పిల్లల్ని బెదిరించి చదివిస్తే సక్సెస్ అవుతారా? సైకాలజీ ఏం చెబుతోంది?

Child Psychology: పిల్లల్ని బెదిరించి చదివిస్తే సక్సెస్ అవుతారా? సైకాలజీ ఏం చెబుతోంది?

ఏ పేరెంట్స్ అయినా తమ పిల్లలు చదువులో ముందుండాలని కోరుకుంటారు. అందుకోసం కొంతమంది పిల్లల్ని బెదిరించి, భయపెట్టి చదివిస్తుంటారు. ఈ తీరు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వాళ్లు లైఫ్ లో సక్సెస్ అవుతారా? సైకాలజీ ఏం చెబుతోందో ఇక్కడ చూద్దాం. 

1 Min read
Author : Kavitha G
Published : Mar 18 2026, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Child Psychology
Image Credit : Getty

Child Psychology

కొంతమంది తల్లిదండ్రులు, టీచర్లు పిల్లలను బెదిరించి చదివిస్తుంటారు. తద్వారా వాళ్లు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారని అనుకుంటారు. కానీ ఈ పద్ధతి అన్నీసార్లు మంచిది కాదని చెబుతున్నారు సైకాలజీ నిపుణులు. చిన్న వయసు నుంచే పిల్లల్ని భయపెట్టి బలవంతంగా చదివిస్తే వాళ్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి తగ్గిపోవడం
Image Credit : unsplash

కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి తగ్గిపోవడం

సైకాలజీ నిపుణుల ప్రకారం భయపెట్టి చదివించడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవడంలో తప్పులు దొర్లుతాయనే భావన పిల్లల్లో బాగా పెరుగుతుంది. దానివల్ల వారు కొత్త విషయాలు ప్రయత్నించడానికి ఇబ్బంది పడతారు. ఎక్కువగా భయపెట్టడం వల్ల చిన్న పిల్లల అభ్యాసంలో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా పిల్లలు తప్పులు చేస్తూ నేర్చుకుంటారు కానీ, పేరెంట్స్, టీచర్స్ బెదిరించడం వల్ల వారు ప్రయత్నం చేయడానికి కూడా భయపడతారు. 

35
సానుకూల ప్రోత్సాహం
Image Credit : unsplash

సానుకూల ప్రోత్సాహం

సైకాలజీ నిపుణుల ప్రకారం పిల్లల్ని భయపెట్టడం కంటే సానుకూల ప్రోత్సాహం ఇవ్వడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. చిన్న విజయాలను గుర్తించడం, పాజిటివ్ మాటలు చెప్పడం, ఆటల ద్వారా నేర్చుకోవడం, పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇవి భయపెట్టి చదివించడంతో పోలిస్తే ఎక్కువ ఫలితాలు ఇస్తాయి.

45
దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం
Image Credit : pinterest

దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం

సైకాలజీ ప్రకారం భయంతో మాత్రమే చదివించడం, తాత్కాలికంగా కొంత ఫలితం ఇచ్చినా, దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలు చూపుతుంది. పిల్లల్లో భయం పెరిగితే, వారు అన్నింటికి సంకోచిస్తారు. వారిలో క్రియేటివిటీ తగ్గుతుంది. నలుగురిలో ఉండడానికి ఇబ్బంది పడతారు.

55
ఇలా మార్గనిర్దేశం చేస్తే..
Image Credit : gemini ai

ఇలా మార్గనిర్దేశం చేస్తే..

సైకాలజీ నిపుణుల ప్రకారం ప్రేమతో, ప్రోత్సాహంతో, సానుకూల పద్ధతులతో మార్గనిర్దేశం చేయడం మంచిది. పిల్లలకు తప్పుల నుంచి నేర్చుకునే అవకాశాలు ఇవ్వడం, పిల్లలను స్వతంత్రంగా నేర్చుకునే విధంగా తయారుచేయడం వంటివి నిజంగా వారికి చదువులో స్థిరమైన విజయాన్ని ఇస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
Relationship Tips: ఈ 5 సంకేతాలు కనిపిస్తే మీ రిలేషన్‌షిప్ ప్రమాదంలో ఉన్నట్లే!
Recommended image2
Relationship Tips: భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved