MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Health Care: పిల్లల ఎముకలు బలంగా మారాలంటే.. రోజూ ఇవి తినిపించాల్సిందే..

Health Care: పిల్లల ఎముకలు బలంగా మారాలంటే.. రోజూ ఇవి తినిపించాల్సిందే..

Child Bone Strength Tips: పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా శ్రద్ధ వహించాలి. పిల్లలకు చిన్న దెబ్బ తాకినా వారి ఎముకలు ఇట్టే విరిగిపోతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టి, పిల్లల ఎముకలు దృఢంగా మారాలంటే.. తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. 

2 Min read
Author : Rajesh K
Published : Jun 27 2025, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పిల్లల ఎముకలు బలంగా మారాలంటే..
Image Credit : stockPhoto

పిల్లల ఎముకలు బలంగా మారాలంటే..

ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం చాలా ముఖ్యమైనది. ఈ వయసులో పిల్లలు లేచి నిలబడటం, పరుగెత్తడం, పైకి ఎక్కడం, కింద పడటం వంటి పనులు చేస్తుంటారు. ఈ సమయంలో గాయాలు లేదా ఎముకలు విరగడం వంటి సమస్యలు రావచ్చు. ఎముకలు విరిగితే భవిష్యత్తులో అది  తీవ సమస్యగా మారవచ్చు.  కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి, వారికి బలమైన ఎముకలు దృఢంగా మారడానికి తల్లిదండ్రులు బాధ్యత వహించాలి.  పిల్లల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.  

26
కాల్షియం
Image Credit : stockPhoto

కాల్షియం

గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను అభివృద్ధి చేయడానికి కాల్షియం అవసరం అని తెలుసు కాబట్టి పిల్లల ఆరోగ్యానికి కూడా ప్రతి రోజు వారి డైట్ లో పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బాదం, తృణధాన్యాలు వంటివి సూపర్ ఫుడ్ చేర్చాలి. ఒక కప్పు పాలలో 300 మి.గ్రా కాల్షియం, ఒక కప్పు పెరుగులో 400 మి.గ్రా కాల్షియం ఉంటుంది. అలాగే సోయా పాలు, సోయా పెరుగు వంటి సోయాబీన్‌ ఉత్పత్తుల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 

Related Articles

Related image1
Lung Health: మీ ఊపిరితిత్తుల్లో సమస్య ఉందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో పరిష్కారం..
Related image2
Health tips: కాల్షియం లోపం ఉన్నవారు కచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే!
36
విటమిన్ డి
Image Credit : stockPhoto

విటమిన్ డి

ఎముకలను ఆరోగ్యానికి  విటమిన్ డి ముఖ్యం. విటమిన్ డి లోపం ఉన్నవారి ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. శరీరంలో కాల్షియంను గ్రహించే లక్షణం విటమిన్ డి కి ఉంది. గుడ్లు, కొవ్వు చేపలు, పాలు వంటి ఆహార పదార్థాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అలాగే.. ఉదయం కొంత సమయం ఎండలో నిలబడితే విటమిన్ డి శరీరానికి అందుతుంది. విటమిన్ డి తక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించి సప్లిమెంట్స్ తీసుకోండి.  శరీరం కాల్షియంను గ్రహించడానికి విటమిన్ డి చాలా అవసరం. కాబట్టి పిల్లలను ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం 15 నిమిషాలు ఎండలో ఆడుకోనివ్వాలి.

46
సమతుల్య ఆహారం
Image Credit : stockPhoto

సమతుల్య ఆహారం

ఎముకల పెరుగుదల, బలోపేతానికి ప్రోటీన్లు కూడా చాలా అవసరం. బోన్ హెల్త్ లో ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి. పప్పులు, బీన్స్, గుడ్లు, చికెన్, చేపలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పిల్లల వయస్సును బట్టి వారికి సరైన మోతాదులో ప్రోటీన్లు ఇవ్వాలి. అలాగే విటమిన్ కె ఎముకల ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. బ్రోకలీ, క్యాబేజీ, ఆకుకూరలలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లతో పాటు మెగ్నీషియం, భాస్వరం వంటి ఇతర ఖనిజాలు, విటమిన్లు కూడా ఎముకల పెరుగుదలకు అవసరం. కాబట్టి పిల్లలకు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు వంటి సమతుల్య ఆహారం అందించాలి.

56
శారీరక శ్రమ
Image Credit : stockPhoto

శారీరక శ్రమ

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలను తగ్గించాలి. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు,  సోడా పానీయాలు, కెఫిన్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉంచండి.  పిల్లలకు సంపూర్ణ ఆహారంతో పాటు శారీరక శ్రమను ఉండాలి. అంటే.. పరుగెత్తడం, దూకడం, ఆడుకోవడం వంటి శారీరక వ్యాయామాలను చేయించండి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంతో పాటు ఎముకల సాంద్రతను పెంచుతాయి. 

66
ఆడుకోనివ్వండి.
Image Credit : stockPhoto

ఆడుకోనివ్వండి.

పిల్లలు ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల వారి ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. కాబట్టి పిల్లలను ఒకే చోట కూర్చోబెట్టడం, చేతిలో మొబైల్ ఇచ్చి వీడియోలు చూడమనడం వంటి పనులు తగ్గించి, ఇతర కార్యకలాపాలలో పాల్గొనేలా చేయండి.  బాల్యంలో వచ్చే ఎముకల పగుళ్లు భవిష్యత్తులో కూడా సమస్యలను కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి వారు ఆడుకునేటప్పుడు, పరిగెత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
పురుషులు
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting Psychology: పేరెంట్స్ స్ట్రెస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?
Recommended image2
Child Psychology: పిల్లల్ని పదే పదే చెంపపై కొడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?
Recommended image3
Modern Parenting : 9 ఏళ్లు దాటిన పిల్లలకు తల్లి ఎలాంటి విషయాలు నేర్పించాలో తెలుసా?
Related Stories
Recommended image1
Lung Health: మీ ఊపిరితిత్తుల్లో సమస్య ఉందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో పరిష్కారం..
Recommended image2
Health tips: కాల్షియం లోపం ఉన్నవారు కచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved