MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?

Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?

పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఏ ఫుడ్ పెట్టాలో, ఏ ఫుడ్ పెట్టకూడదో తెలియక చాలామంది పేరెంట్స్ సతమతమవుతుంటారు. ముఖ్యంగా అరటి పండు, పెరుగు పెట్టొచ్చా లేదా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. మరి ఈ విషయం గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Dec 05 2025, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kids Health Care Tips
Image Credit : our own

Kids Health Care Tips

పిల్లలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు కొన్ని ఫుడ్స్ అస్సలు పెట్టొద్దని నిపుణులు చెబుతుంటారు. అయితే చాలామంది పేరెంట్స్ ఆ టైంలో పిల్లలకు అరటి పండు, పెరుగు పెట్టడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఫుడ్స్ పెట్టడం వల్ల జలుబు పెరుగుతుందని కొందరు, అలాంటిది ఏమి ఉండదని మరికొందరు నమ్ముతారు. అయితే నిపుణుల ప్రకారం పిల్లలకు జలుబు, దగ్గు ఉన్న సమయంలో అరటిపండు, పెరుగు పెట్టవచ్చో లేదో ఇక్కడ తెలుసుకుందాం. 

25
అరటి పండు పెడితే ఏమవుతుంది?
Image Credit : Getty

అరటి పండు పెడితే ఏమవుతుంది?

అరటిపండులో శరీరానికి కావాల్సిన పొటాషియం, ఫైబర్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అరటిపండు సహజంగా మృదువుగా ఉండటం వల్ల తేలికగా జీర్ణమవుతుంది. సాధారణంగా జలుబు సమయంలో అరటిపండు తింటే ప్రతికూల ప్రభావం ఉన్నట్లుగా శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది పిల్లల్లో దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు.. అరటిపండు తిన్న వెంటనే దగ్గు మరింత పెరిగినట్లు అనిపించవచ్చు. కానీ అది పిల్లల శరీరతత్వం మాత్రమే. అలాంటి సందర్భాల్లో అరటిపండును తాత్కాలికంగా తగ్గించడం మంచిది.

Related Articles

Related image1
పిల్లలకు చిన్నప్పటి నుంచే కచ్చితంగా నేర్పించాల్సిన 5 అలవాట్లు ఏంటో తెలుసా?
Related image2
పిల్లలకు వాంతులు, విరేచనాలు అయినప్పుడు ఏ ఫుడ్ పెట్టొచ్చు? ఏది పెట్టకూడదు?
35
పెరుగు పెడితే ఏమవుతుంది?
Image Credit : Getty

పెరుగు పెడితే ఏమవుతుంది?

పెరుగు సహజ ప్రోబయోటిక్స్‌తో కూడిన ఆహారం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గట్ హెల్త్ ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వైద్యుల ప్రకారం, జలుబు ఉన్నప్పుడు పెరుగును పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. అయితే, చల్లగా ఉన్న పెరుగు ఇవ్వకుండా, గది ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగు ఇవ్వడం మంచిది. 

45
తక్కువ మొత్తంలో ఇవ్వడం..
Image Credit : Getty

తక్కువ మొత్తంలో ఇవ్వడం..

పిల్లలకు అరటి పండు, పెరుగు ఇస్తున్నప్పుడు మోతాదుపై శ్రద్ధ అవసరం. పిల్లల రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, ఏ ఆహారం అయినా ఎక్కువ మోతాదులో ఇస్తే కడుపు నిండిపోవడం, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి అరటిపండును చిన్న ముక్కల రూపంలో ఇవ్వడం, పెరుగును తక్కువ మోతాదులో ఇవ్వడం సురక్షితం. 

55
వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి
Image Credit : Getty

వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి

పిల్లలు.. ముక్కు కారడం, గొంతులో మంట, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, లైట్ ఫుడ్, గోరువెచ్చని ద్రవాలు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. గోరువెచ్చని నీరు, కూరగాయల సూప్, పప్పు, కిచిడి వంటి ఆహారాలు సులభంగా జీర్ణమవుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting Psychology: పేరెంట్స్ స్ట్రెస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?
Recommended image2
Child Psychology: పిల్లల్ని పదే పదే చెంపపై కొడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?
Recommended image3
Modern Parenting : 9 ఏళ్లు దాటిన పిల్లలకు తల్లి ఎలాంటి విషయాలు నేర్పించాలో తెలుసా?
Related Stories
Recommended image1
పిల్లలకు చిన్నప్పటి నుంచే కచ్చితంగా నేర్పించాల్సిన 5 అలవాట్లు ఏంటో తెలుసా?
Recommended image2
పిల్లలకు వాంతులు, విరేచనాలు అయినప్పుడు ఏ ఫుడ్ పెట్టొచ్చు? ఏది పెట్టకూడదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved